ప్రభాస్ సినీ ప్రయాణం చాలా విచిత్రమైనది. చాలా నిమ్మదిగా వచ్చి, చాలా గట్టి పాదాన్ని సినిమా ఇండస్ట్రీలో మోపాడు. బాక్రౌండ్ సపోర్ట్ ఉన్నప్పటికీ.. ప్రభాస్ సక్సస్ లో ఎక్కువ భాగం తన కృషి, పట్టుదల కనిపిస్తాది. ఒక్క అడుగు కావాలి అని ఛత్రపతి లో అడిగి, బాహుబలితో ప్రపంచం మొత్తాన్ని చుట్టాడు. దేశవిదేశాలలో మన తెలుగు ఇండస్ట్రీ సత్తాని చాటాడు. బాహుబలి తరవాత ప్రభాస్ సినిమాలపై అంచనాలు చాలా ఎక్కువ అయ్యాయి.
అందువలన ఇప్పుడు ప్రభాస్ సినిమాలతో ప్రేక్షకులు అంతగా సంతృప్తి చెందలేకపోతున్నారు. కానీ మన హీరో చాల కాలం వరకు ఖాళీగా మాత్రం లేడు. సినిమా తరవాత సినిమా అంటూ డేట్స్ ఎక్కడా ఖాళీ లేవు. ఎంత బిజీ గా ఉన్నాడంటే.. తన పెళ్లి గురించి ఆలోచించేంత టైం కూడా ఎక్కడా లేదు. అంత బిజీ గా, డెడికేటెడ్ గా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తో ఆదిపురుష్` షూటింగ్ పూర్తి అయ్యింది.
ఇంకా రెండు అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా చిత్రాలు మొదలయ్యాయి. అవేమిటంటే.. నీల్ దర్శకత్వంలో `సలార్`, నాగ్ అశ్విన్ తో `ప్రాజెక్ట్-కె`చిత్రాలు. ఇవి కాకుండా ఇంకా నాలుగు సినిమాలు రెడీ అవుతున్నాయి. ఇదిలా ఉంటె ప్రభాస్ కి ఆరోగ్యం బాలేదని, తీవ్రమైన జ్వరంతో ఉన్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో ప్రభాస్ అభిమానులు ఆందోళనకు గురి అయ్యారు. మా హీరో ఎలా ఉన్నాడో అని బెంగతో ఉన్నారు.
ఇక అనుష్క విషయానికి వస్తే.. ఈమె కూడా ప్రభాస్ లాంటిదే. శ్రమ, పట్టుదల ఉన్న మనిషి అందుకేనెమో వీల్లద్దరికి అంత మంచి స్నేహం కుదిరింది. ప్రభాస్ కి ఆరోగ్యం బాలేదు అనగానే అభిమానుల దృష్టి అనుష్కా పై పడింది. అంతే ఫ్యాన్స్ అంతా.. ప్రభాస్ కి అనుష్క అంత సేవ చేస్తుంది, ఇంత సేవ చేస్తుంది అంటూ ఎవరి ఊహని వాళ్ళు అందరితో పంచుకుంటున్నారు..