Actor Allari Naresh: అల్లరి అనే చిత్రం ద్వారా సినిమా రంగంలోకి హీరో గా పరిచయం అయ్యాడు నరేష్. ఆ అల్లరి చిత్రంలో నటించిన తర్వాత తన ఇంటి పేరు కూడా అల్లరి గా మారిపోయింది. అలా కామెడీ హీరోగా తనదైన శైలి లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అల్లరి నరేష్. ప్రముఖ స్టార్ డైరెక్టర్ ఇ.వి.వి సత్యనారాయణ కొడుకే ఈ అల్లరి నరేష్.. కానీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఏమాత్రం తండ్రి పేరు ఉపయోగించకుండా రాజేంద్రప్రసాద్ తర్వాత కామెడీ హీరోగా ఎంతో పేరు సంపాదించుకున్నాడు అల్లరి నరేష్. అలా వరుస సినిమాలతో మనందరితో నవ్వుల పువ్వులు పూయించిన అల్లరి నరేష్ ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి..
మహేష్ బాబు సరసన మహర్షి చిత్రంలో అతని స్నేహితుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. దాంతో కామెడీ చిత్రాలను పక్కనపెట్టి యాక్షన్ సినిమాల్లో కూడా ప్రస్తుతం హీరోగా చేస్తున్నాను. అయితే ప్రస్తుతం అల్లరి నరేష్ గురించి నెట్టింట ఓ వార్త అయితే వైరల్ అయింది. మరది ఏంటి అనుకుంటున్నారు? అప్పట్లో అల్లరి నరేష్ మామూలోడు కాదు మరి.. మనోడు ఏ సినిమా లో నటించిన ఓ కొత్త హీరోయిన్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసేవాడు. అలా ఈ కామెడీ హీరో అల్లరి నరేష్ చాలా మంది హీరోయిన్లతో ఎఫైర్లు కొనసాగించారంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్త తెగ వైరల్ అయితుంది.
ఇక మరి ఆ విషయాలు ఏంటని వివరాల్లోకి వెళితే.. సినిమా రంగంలో ఈ ప్రేమలు, డేటింగ్ లు, ఎఫైర్ లు అనేవి చాలా కామన్ విషయం.. అలా అల్లరి నరేష్ మంచి కామెడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సమయంలో హీరోయిన్ గజాలతో అలాగే ఫర్జానాతో ప్రేమలో పడ్డాడట.. కానీ ఈ ఇద్దరికి హీరోయిన్లలో ఏ ఒక్క హీరోయిన్ కూడా పెళ్లి ఊసు ఎత్తకపోగా పెళ్లి వరకు దారి తీయలేదు. ఇక అల్లరి నరేష్ కత్తి కాంతారావు చిత్రంలో నటిస్తున్న సమయంలో అల్లరి నరేష్ కి కామ్నా జట్మలాని మధ్య చాలా మంచి స్నేహమే ఏర్పడిందట.. అది ప్రేమ వరకు దారి తీసినప్పటికీ పెళ్లి మాత్రం జరగలేదట..
ఇక ఆ తర్వాత కూడా మంజరి ఫడ్నాస్ అనే హీరోయిన్ తో కూడా అల్లరి నరేష్ సాగించాడనే వార్తలు వచ్చాయి. ఇలా చాలామంది హీరోయిన్లతో అప్పుడు అల్లరి నరేష్ (Actor Allari Naresh) ఎఫైర్ నడిపించాలని ప్రస్తుతం వార్త వైరల్ అవుతుంది. కానీ వాళ్ళు అలా చేసింది కేవలం సినిమా అవకాశాల కోసమని ఆ తర్వాత ప్రచారం జరిగింది. దాంతో అల్లరి నరేష్ పేరు ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లతో ఇలా ఎఫైర్ నడుపుతుంది అనే విషయం కుటుంబ సభ్యుల వరకు వెళ్లగా.. విసిగిపోయిన కుటుంబ సభ్యులు విరూపా అనే అమ్మాయితో 2015 సంవత్సరంలో వివాహం చేశారు. ఇక ఆ వివాహము అనంతరం ఎలాంటి ప్రేమ జోలికి వెళ్లని వెళ్లలేదు. ప్రస్తుతం అయితే ఓవైపు సినిమాల్లో మరొకవైపు లైఫ్ లో చాలా హ్యాపీగా ఆనందంగా గడుపుతున్నాడు అల్లరి నరేష్.