Home Cinema 100th Birthday Of ANR: ఏఎన్ఆర్ కి మాత్రమే దక్కిన రికార్డ్స్ తో పాటు ఆయన...

100th Birthday Of ANR: ఏఎన్ఆర్ కి మాత్రమే దక్కిన రికార్డ్స్ తో పాటు ఆయన జీవితంలో ఈ పచ్చి నిజాలు మీకు తెలుసా?

about-the-100th-birthday-of-anr-fans-and-celebrities-comments

100th Birthday Of ANR: కృష్ణాజిల్లా గుడివాడ తాలూకు నందివాడ మండలం రామాపురంలో 1924 సెప్టెంబర్ 20న జన్మించిన మహా గొప్ప నటుడు అక్కినేని నాగేశ్వరరావు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అక్కినేని నాగేశ్వరావు గారు.. వెంకటరత్నం, పున్నమ్మ అనే దంపతులకు జన్మించారు. ఈరోజు ఆయన శతజయంతి ( 100th Birthday Of ANR ) సందర్భంగా ఆయన గురించి సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా గుర్తు చేసుకుంటుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఏఎన్ఆర్ ఒక మూల స్తంభం అన్న విషయం మనందరికీ తెలిసిందే. 1941లో ధర్మపత్ని అనే సినిమా ద్వారా సినిమా రంగంలో అడుగుపెట్టిన ఆయన 1944లో శ్రీ సీతారామ జననం అనే సినిమాలో శ్రీరాముడుగా నటించారు. అక్కడి నుంచి ఆయన హీరోగా సినిమా ఇండస్ట్రీలో రాణించడం మొదలుపెట్టారు.

ANR-100-birthday-celebrations

దాదాపుగా 70 సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏలిన మహానటుడు ఆయన అక్కినేని నాగేశ్వరరావు గారికి ఎన్నో అవార్డులో వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఆయనకి అత్యున్నత పరిష్కారం దాదాసాహెబ్ ఫాల్కే ( 100th Birthday Of ANR ) అవార్డును 1991లో ఇచ్చింది. ఇంకా మన భారత దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ కూడా ఏఎన్నార్ కి ఇవ్వడం జరిగింది. ఇంకా ఆయన పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ వంటి మూడు పద్మ పురస్కారాలను కూడా అందుకున్న తొలి నటుడు అక్కినేని నాగేశ్వరావు గారు. అలాగే ఆయనకు 1957 ఆగస్టులో నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు అనే బిరుదుని ఆర్థిక మంత్రి గోపాల్ రెడ్డి చేతుల మీదగా అందుకున్నారు. ఈ వేడుక విజయవాడలో జరిగింది.

See also  Allu Arha: నేనేం తక్కువ అంటూ తండ్రికి తగ్గ కూతురు అనిపించుకుంటుంది అల్లు అర్హ. మరి అది ఏ విషయంలో తెలుసా.?

ANR-100-birthday

ఇంకా ఆయనకు అనేక బిరుదులు కూడా వచ్చాయి. నట సౌరభవమా, నటరాజశేఖర్, అభినయ నవరస సుధాకర, కళా ప్రవీణ, కళా శిరోమణి, అభినయ కళా ప్రపూర్ణ, భారతమాత ముద్దుబిడ్డ ఇలాంటి బిరుదులను ఆయన అందుకోవడం జరిగింది. ఇక ఇవే కాకుండా ఎన్నో చలనచిత్ర అవార్డులతో పాటు నంది అవార్డులు,డాక్టరేట్లు కూడా ఆయన అందుకోవడం జరిగింది. అక్కినేని నాగేశ్వరావు గారి సినిమా అంటే ఇష్టం లేని ( 100th Birthday Of ANR ) వాళ్ళు అంటూ ఉండరు. ఆయన సినిమా చూస్తుంటే మనసుకు ఉల్లాసంగా, ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. ఆయన సినిమాలో ఆయనతోపాటు నటించే హీరోయిన్స్ కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటారు. ఆయన ఎదుటి వాళ్ళకి ఇచ్చే గౌరవం, ఆయన తీరు చూస్తే అందరికీ నచ్చుతుంది. ముఖ్యంగా ఆయన నటన అంటే అందరికీ ఎంతో ఇష్టం..

See also  Vijay Varma: ఆ పని కానిచ్చేసారా మాల్దీవుల్లో అని ఓ అభిమాని ప్రశ్నించగా.. కోపం తో తమన్నా లవర్ ఏం చేసాడంటే..

ANR-100-birthday-memory

ఇన్ని ఘనవిజయాలని సాధించిన ఏఎన్ఆర్.. అతి సామాన్యమైన ఒక రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి .ఆయన పెద్ద పెద్ద చదువులు చదువుకోలేదు. యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకోవడం కోసం ఏ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ లో జాయిన్ అయ్యి నేర్చుకోలేదు. కేవలం నాటకాలు లో నటిస్తూ.. ఆయన కళా ప్రతిభను పెంచుకుంటూ.. సినిమాల్లోకొచ్చి ఆయన ప్రతిభతో నటిస్తూ.. చాలా కష్టపడి జీవితంలో పైకి వచ్చిన వ్యక్తి . ఒక పూట తిండి కోసం ఎన్నో కష్టాలు పడిన చరిత్ర ఆయన జీవితంలో ఉంది. అలాంటి ఒక పేద రైతుబిడ్డ తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మూల స్తంభంగా ఉండటమే కాకుండా.. అక్కినేని అనే ఒక వారసత్వపు ముద్రని ఆయన కొడుకులకి, మనవలకి ఇచ్చి.. ఇప్పటికి ఆయన పేరును తలచుకునేలా చేసిన ఆయన గొప్పతనానికి.. తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా ఒక్కసారి ఆనందంగా ఆయన పుట్టినరోజుని ఆయన్ని తలచుకొని గర్విద్దాం..