Abhishek Bachchan : బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఏకైక కుమారుడు అభిషేక్ బచ్చన్ గురించి మనందరికీ తెలిసిందే. అభిషేక్ బచ్చన్ బాలీవుడ్లో ఎన్నో సినిమాలను చేశాడు. కానీ ఎందుకో అమితాబ్ ని వరించిన అదృష్టం ( Abhishek Bachchan and Aishwarya Rai ) సినిమా రంగంలో అభిషేక్ కి వరించలేదని చెప్పాలి. ఇక అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యారాయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరూ పెళ్లి తర్వాత కూడా ఎంతో అన్యోన్యంగా, ప్రేమగా ఉన్నారు అనేది ఎప్పటికప్పుడు ఏదో రూపంలో వార్తలు వస్తూనే ఉంటాయి.
అయితే గత కొంతకాలంగా అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకోబోతున్నారని అనేక వార్తలు వచ్చాయి. అభిషేక్ – ఐశ్వర్యరాయి అంతగా ప్రేమించుకొని.. ఎన్నో పూజలు చేయించుకొని.. జాతకాలు చూసుకొని.. పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్లిద్దరు విడిపోవడం వెంటనే అందరూ ఆశ్చర్యపోయేవారు. కచ్చితంగా వీళ్ళిద్దరూ ( Abhishek Bachchan and Aishwarya Rai ) విడిపోతారని, దానికి కారణం వాళ్ళింట్లో అనేక సమస్యలని అనుకునేవారు. అభిషేక్, ఐశ్వర్యరాయ్ ఆమె అత్తగారు జయ బచ్చన్ అధికారం చూపిస్తాదని అందుకే ఐశ్వర్యరాయ్ కి నచ్చడం లేదని వేరేగా ఉంటుందని , అక్కడ నుంచి కూడా అభిషేక్ తో కూడా వేరవుతుంది అని అందుకే సినిమాల్లో మల్లి రీ ఎంట్రీ ఇచ్చిందని ఎన్నో కథలు వింటూనే ఉన్నాము.
వీటిలో ఎన్ని నిజాలు ఉన్నాయో తెలియదు గానీ.. ఏదో ఒక ప్రచారాలు వస్తూనే ఉండేవి. అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యారాయ్ కి ఆరాధ్య అనే పాప ఉంది. వీళ్ళిద్దరూ ఆ పాపని ఎంతో అల్లరి ముద్దుగా పెంచుతున్నారు. ఇది ఇలా ఉంటే ఆరాధ్యకు టీనేజ్ దగ్గరికి వస్తున్న సందర్భంగా టీనేజ్ పేరెంట్స్ దగ్గర నుంచి తీసుకునే ( Abhishek Bachchan and Aishwarya Rai ) ఇంటర్వ్యూ కోసం అభిషేక్ ని పేరెంటింగ్ టిప్స్ గురించి పంచుకోవాలని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ సందర్భంగా అభిషేక్ బచ్చన్ ని అనేక ప్రశ్నలు అడిగారు. దాంట్లో ఒక్కొక్క సమాధానం ఒక్కొక్క నిజాన్ని బయట పెడుతూ వచ్చింది. పిల్లల పెంపకం విషయంలో కొన్ని టిప్స్ చెప్పమని అడగ్గా.. అభిషేక్ బచ్చన్ ఇలా సమాధానం ఇస్తూ వచ్చాడు..
ఇవన్నీ కేవలం ఐశ్వర్యారాయ్ ని చూసుకుంటుంది. పిల్లలను పెంచడం గురించి గానీ, ఇంట్లో అన్ని విషయాలు గురించి గానీ పెత్తనం తనదే నాదేమీ ఉండదు అని అభిషేక్ చెప్పుకొచ్చాడు. మీ అందరికీ తెలుసు కదా ఇంట్లో ఎవరు పెత్తనం అని అంటూ.. మరి మొత్తం మా ఇంట్లో పెత్తనం అంతా ఐశ్వర్యరాయ్దే అని చెప్పకనే చెప్పేసాడు. నేను కేవలం బయట మాత్రమే చూసుకుంటాను.. ఇంట్లో ప్రతిదీ ఐశ్వర్యారాయ్ చెక్కబడుతుంది అంటూ చెప్పాడు. ఇలా ఐశ్వర్యరాయ్ గురించి మీకు తెలుసు కదా అంటూనే ఐశ్వర్యారాయ్దే మొత్తం పెత్తనం అంటూ ఆమె స్థాయిని ఇంకా పెంచుతూ తనకి ఆమె మీద ప్రేమని ప్రకటించాడు. దీంతో అభిషేక్ బచ్చన్ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..