Abbas: ఇప్పుడున్న కూరగాళ్ళకి తెలియక పోవుండొచ్చు అబ్బాస్ అంటే ఎవరనేది కానీ 90స్ జనరేషన్ వాళ్ళకి కచ్చితంగా తెలిసిన పేరు అబ్బాస్.. ఇక అప్పట్లో ఇతని పేరు చెప్తే పూనకాలే.. ఎందుకంటే అలాంటి చిత్రాలలో నటిస్తూ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. సినిమా ప్రపంచం అనేది ఓ పెద్ద సముద్రం లాంటిది. ఇక ఇందులో ఎంత మంది కుర్ర హీరోలు వచ్చినప్పటికీ.. పాన్ ఇండియా స్టార్లుగా ఎదుగుతూ ఉన్నప్పటికీ.. గ్లోబల్ స్థాయిలో అవకాశాలను కైవసం చేసుకున్నప్పటికీ కూడా కొద్ది మంది హీరోలు అంటే వాళ్ళ ఫ్యాన్స్ కి ఎంతో అభిమానం ఉంటుంది.
ఇక వాళ్ళు ఇప్పటికీ తెర పై కనిపించకపోవచ్చు. అలాగే అప్పట్లో ఉన్న హీరోలు కనుక సోషల్ మీడియా వాడకం అంతాగా తెలియక పోవుండొచ్చు కానీ 90 స్ జనరేషన్ కుర్రాళ్లకు మాత్రం ఖచ్చితంగా ఆ హీరోలు ఎప్పటికైనా గుర్తుండి పోతుంటారు. అలాంటి గుర్తుండిపోయే పేర్లు అబ్బాస్ పేరు కూడా ఒకటి. ఇక అప్పట్లో అబ్బాస్ కి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక రేంజ్ లో ఉండేది. అబ్బాస్ అంటే పడి చచ్చిపోతూ ఉండేవాళ్ళు అంత క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ మూట గట్టుకున్నాడు అన్న మాట. ప్రేమ దేశం చిత్రం ద్వారా రాత్రి కి రాత్రే స్టార్ హీరోగా మారిపోయాడు అబ్బాస్.
ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగి తన నటనతో ఇండస్ట్రీని షేక్ చేస్తూ ఎంత త్వరగా స్టార్ హీరో అయ్యాడో.. ఎంత త్వరగా కెరియర్ లో సక్సెస్ ని చూశాడో.. అంతే త్వరగా కెరియర్ లో పతనాన్ని కూడా చూశాడు. అయితే అబ్బాస్ తన వ్యక్తి గత జీవితం లో తీసుకున్న పలు నిర్ణయాల వల్లే ఇండస్ట్రీకి దూరమయ్యాడని గతంలో వార్తలు వినిపించ సాగాయి. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతున్న అబ్బాస్ (Abbas) తన కు ఓ అమ్మాయి విషయంలో జరిగిన మోసాన్ని గురించి వెల్లడించాడు. నేను చదువుకునే రోజుల్లో కాలేజీలో ఓ అమ్మాయి నన్ను ప్రేమించింది. నేను కూడా ఆ అమ్మాయిని ప్రేమించాను కానీ చివరికి నన్ను మోసం చేసి వదిలి వెళ్ళింది.
ఇక ఆ సమయంలో నాకేం చేయాలో తెలియక పిచ్చి పట్టినట్లు అయింది. చాలా రోజుల వరకు డిప్రెషన్ లోకి వెళ్లి చివరకు ఇక సూసైడ్ చేసుకుందామని నిశ్చయించుకున్నాను. అందుకోసం నడిరోడ్డు పై నిల్చున్నాను నా ఎదురుగా ఒక ట్రక్కు వస్తుంది. ఒక వేళ లారీ ట్రాక్ నన్ను గుద్దినట్లయితే నేను చనిపోయే వాడిని.. అక్కడే ఉంటే కచ్చితంగా అదే జరిగేది. కానీ లారీ పక్కనుంచే ఓ వ్యక్తి బైక్ పై వస్తున్నాడు. ఒక వేళ నేను తప్పుకోకుంటే అది అతన్ని గుద్దేది. నా వల్ల ఎదుటివారికి ఏదన్నా జరిగితే నేను తట్టుకోలేను. నా ప్రాణం కన్నా పక్కవారి ప్రాణానికి ఎక్కువ విలువని ఇస్తానంటూ చాలా ఎమోషనల్ గా ఆ ఇంటర్వ్యూలో భాగంగా ఈ విషయాన్ని బయట పెట్టాడు.