Pawan Kalyan – Ram Charan : తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటాయి. వాటి రికార్డ్స్ ని మర్చిపోవాలంటే కష్టమే. అలాంటి వాటిలో పవన్ కళ్యాణ్ సినిమా అత్తారింటికి దారేది సినిమా కూడా ఒకటి. ఈ సినిమా రిలీజ్ టైం లో పైరసీ కూడా చాలా దారుణంగా ఉండేది. అలాంటి సమయంలో ( Pawan Kalyan and Ram Charan ) కూడా అన్నిటినీ ఎదుర్కొని 70 కోట్ల పైన షేర్ ని సంపాదించి పెట్టిన సినిమా ఇది. ఆ రోజుల్లో మగధీర సినిమా తప్పించి.. ఇంకే సినిమా కూడా అంత వసూళ్లను రాబట్టలేదు. అటువంటి స్థాయిలో అత్తారింటికి దారేది అనే సినిమా అంత వసూలు తీసుకురావడానికి కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇమేజ్, త్రివిక్రమ్ తన మనసును పెట్టి దర్శకత్వం వహించిన తీరు.
ఈ సినిమా మొదలు నుంచి కూడా ఎంతో అద్భుతంగా కథని రాసుకున్నాడని అర్థమవుతుంది. ఈ సినిమాలో ప్రతి డైలాగుని, ప్రతి పాటని, ప్రతి సన్నివేశాన్ని కూడా ప్రేక్షకులు ఎంతగానో ఎంజాయ్ చేశారు. ఈ సినిమాలో సినిమా అంతా ఒక ఎత్తు అయితే క్లైమాక్స్ సీను ఒక్కటీ ఒక ఎత్తు. అప్పట్లో ఎవరూ ఊహించని క్లైమాక్స్ సీన్ ఇది. తన మేనత్తని ( Pawan Kalyan and Ram Charan ) ఒప్పించుకునే క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోయిన్ చూపించకుండా సెంటిమెంటుతో ఆమెకు వాళ్లు పడే బాధని ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఆ సీన్ ని పండించడంలో అది కూడా ఒక రైల్వే స్టేషన్ లో.. ఎంత అద్భుతంగా ఆ సీను పండిందంటే.. ఎన్నేళ్లు అయినా, ఎన్నాళ్ళైనా మరువలేని అద్భుతమైన సీన్ అది.
అయితే ఆ సీన్ లో మెగా అభిమానులందరికీ ఎంతగానో నచ్చిన మరొక వ్యక్తి ఉన్నాడు.
అతను ఎవరో కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అదేంటి అత్తారింటికి దారేది సినిమాలో రామ్ చరణ్ ఎక్కడున్నాడు? అని అనుకుంటున్నారా? మీరు లాస్ట్ సన్నివేశంలో పవన్ కళ్యాణ్ నదియాకి అన్ని విషయాలు చెప్పిన తర్వాత.. నదియా కూర్చుని ఫోన్ చేయరా గౌతం నేను మీ నాన్నతో మాట్లాడుతాను అని అన్నప్పుడు.. వెనకాల ( Pawan Kalyan and Ram Charan ) చివర్లో ఒక వ్యక్తి వెనక్కు తిరిగి ఉంటాడు. అతను ఎవరో కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. రామ్ చరణ్ ఆరోజు పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ దగ్గరికి వచ్చి షూటింగ్ జరుగుతున్న క్రమంలో ఆ చివర్లో నిలబడి.. అటువైపు తిరిగి, ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ ఉండగా.. అనుకోకుండా ఆ సీన్ లో అతను కూడా రావడం జరిగింది.
ఈ విషయాన్ని అప్పట్లోనే త్రివిక్రమ్ చెప్పడం కూడా జరిగింది. కాబట్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకే స్క్రీన్ ని పంచుకోవడం అనేది జరిగిపోయింది. ఆ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఒకరితో ఒకరు అనుకోగా.. మెగా అభిమానులు అసలు మెగా హీరోలు అందరూ కలిసి ఒక సినిమా చేస్తే బాగుణ్ణు అని అనుకుంటున్నారు. అప్పుడు అంతమందికి సరిపడే కథ రాయాలన్నా.. తీయాలన్నా కూడా సినిమాని ఎన్ని పార్ట్శ్ తియ్యాల్సి వస్తాదో మరి.. ఇప్పటికే ఒక హీరోకే రెండు మూడు పార్ట్ లు తీస్తున్నారంటే.. మరి అంతమంది మెగా హీరోలకి అన్ని పార్ట్శ్ చూసే ఓపిక మనకు లేదు కానీ వద్దులే అని నవ్వుకుంటున్నారు..