Anchor Anasuya: మొదట న్యూస్ రీడర్ గా తన జీవితాన్ని మొదలు పెట్టి ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షో లో యాంకర్ గా అడుగు పెట్టిన అనసూయ భరద్వాజ్.. తన దైన శైలిలో ముందుకు సాగుతూ కేవలం బుల్లి తెర పై కాకుండానే వెండి తెర పై కూడా తన మాయా జాలాన్ని ప్రదర్శించి ప్రస్తుతం ఏ విధంగా ఎంతటి పాపులాటి సంపాదించుకుందో.. అలాగే ఇండస్ట్రీలో ఏ విధంగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందిందో మనందరికీ తెలిసిన విషయమే.. జబర్దస్త్ కామిడీ షో యాంకర్ గా తన కెరీర్ మొదలు పెట్టి నెంబర్ వన్ యాంకర్ గా ఇండస్ట్రీలో తన సత్తా చాటుకుంటూ.. (Anchor Anasuya Apologise)
మరో వైపు సోషల్ మీడియాలో కూడా నిత్యం యాక్టివ్ గా ఉంటూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది అనసూయ.. అలా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న అనసూయ ఎప్పుడు ఏదో ఒక వివాదాల్లో ఇరుక్కుకుంటూ ఉంటుంది. అలాంటి ఓ వివాదం ఆంటీ ఆంటీ అని ట్రోలింగ్ కు గురైందన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే.. కానీ ఎవరు ఎన్ని అన్నా కూడా అలాంటి వాటిని పట్టించుకోకుండా తన పని మాత్రం తాను చేసుకుంటూ ముందుకు సాగుతుంది అనసూయ. ఇక ఈ మధ్య కాలంలో ఎప్పుడు తన కుటుంబంతో ఎక్కువగా సరదాగా గడుపుతూ..
వెకేషన్ కు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది అనసూయ. ఈ క్రమంలో తన కొడుకు పుట్టిన రోజు సెలబ్రేషన్ చేసుకుని మరి ఎంజాయ్ చేసింది అనసూయ. కొడుకు పుట్టిన రోజు సందర్భంగా తనకు ఇష్టమైన ఫుడ్ ను చూసి ఆగలేక ఫుల్ గా లాగించేసిందట. ఆ తర్వాత ఆ జంక్ ఫుడ్ తిన్న క్యాలరీస్ ను కరిగించడానికి జిమ్ లో నిత్యం తెగ కష్టపడి పోతూ ఉంటుందట అనసూయ.. ఇక ఇదే విషయాన్ని ఓపెన్ గా తన అభిమానులతో పంచుకోగా చాలామంది ఆమె పోస్ట్ పై కామెంట్లు పెడుతున్నారు. ఫేవరెట్ ఫుడ్ చూడగానే ఫుల్ గా కుమ్మేసావా.. మరి ఇప్పుడేమో ఆ కుమ్మిన ఫుడ్ అంత కరగడానికి నానా తిప్పలు పడుతున్నాను అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకొచ్చింది. (Anchor Anasuya Apologise)
ఇదే కాకుండా నాకు ఇష్టమైన ఫేవరెట్ ఫుడ్ చూసి కంట్రోల్ తప్పి ఫుల్ గా తిని ఇప్పుడేమో బాధపడాల్సి వస్తుంది. ఛా.. నేను అలా చేయకుండా ఉండాల్సింది అని అంటూ అనసూయ రాసుకొచ్చింది. దాంతో ఆమె చేసిన ఆ పోస్టు కు కొందరు ఆకతాయిలు తెగ ట్రోల్ చేస్తున్నారు అనసూయను.. దాంతో మరొక సారి ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి కొందరేమో తినడం ఎందుకు ఇప్పుడు కరిగించడం ఎందుకంటూ తెగ కామెంట్లు చేస్తుంటే.. మరి కొందరు ఎందుకు అనసూయ నీకింత సాహసాలు అవసరమా.. హాయిగా ఇంట్లో కూర్చొని మంచిగా హ్యాప్పీ గా కూర్చోవచ్చుగా అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.