NTR : మే 20వ తేదీన సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు ఎంతో ఘనంగా హైదరాబాదులో జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. దీనికి ఎందరో అతిరథ మహారధులు హాజరుకాగా.. నందమూరి కుటుంబం మొత్తం హాజరైంది. అయితే ఈ వేడుకకి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వీరిద్దరూ మాత్రం రాలేదు. ఇంకా ఈ వేడుకకి ( Jr NTR not attend for Senior NTR ) బాలకృష్ణ, నారా కుటుంబం ఇంకా మెగా కుటుంబం నుంచి రామ్ చరణ్, అక్కినేని కుటుంబం నుంచి నాగచైతన్య ఇలా ఎందరో వచ్చి.. సీనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడి.. వాళ్ళ బాధని, ఆనందాన్ని వ్యక్తం చేశారు. సీనియర్ ఎన్టీఆర్ అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో.. అలాగే తెలుగు రాజకీయాల్లో కూడా.. ఆయన అంటే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.
ఎన్నో గొప్ప గొప్ప సినిమాలను చేసి తెలుగు వారి గుండెల్లో శ్రీరాముడిగా, శ్రీకృష్ణుడిగా నిలిచిపోయిన ఎన్టీఆర్.. అలాగే కేవలం కేజీ రెండు రూపాయలకు బియ్యం అందించి.. తెలుగు వారి హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప రాజకీయ వేత్త కూడా. ఆయన మాటంటే శాసనం అన్నట్టుగా.. అటు సినిమాల్లో, ఇటు ( Jr NTR not attend for Senior NTR ) రాజకీయాల్లో కూడా ఆయన అనుకున్నట్టుగానే పట్టుదలగా, పవర్ ఫుల్ గా ఉండే గొప్ప మనిషి. తెలుగువాడి ఖ్యాతిని భారతదేశం మొత్తం చూసి గర్వించేలా చేసిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్. అలాంటి వ్యక్తి చివరి టైంలో ఎలాంటి బాధలు పడ్డారో, ఎంత మానసిక క్షోభ అనుభవించారో మనందరికీ తెలిసిందే. ఇవన్నీ ఇలా ఉంటే ఎన్టీఆర్ శతజయంతి అంటే ఆయన పేరు పెట్టుకున్న మనవడు, ఆయన పేరు నిలబెడుతున్న మహా వారసుడు జూనియర్ ఎన్టీఆర్ తప్పకుండా వస్తాడని అందరూ ఊహించారు.
కానీ అందరి ఊహలకు వ్యతిరేకంగా జూనియర్ ఎన్టీఆర్ గానీ, అలాగే కళ్యాణ్ రామ్ గాని ఇద్దరూ కూడా ఈ వేడుకకు రాలేదు. తాత పేరుని ఎంతగా నిలబెట్టాడంటే .. ఇతని పేరుకు ముందు జూనియర్ ఎలా చేర్చాల్సి వచ్చిందో.. అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన పేరుకు ముందు సీనియర్ అని చేర్చాల్సి వచ్చింది. అంతగా ( Jr NTR not attend for Senior NTR ) ఆ పేరుని నిరంతరం నిలిచేలా పాపులర్ చేసిన గొప్ప వారసుడు మన తారక్. అలాంటి ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు ఎందుకు రాలేదు అని ఆలోచిస్తే.. కొందరు ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు అని.. అందుకే రాలేదని అనగా.. తాత జయంతి కంటే పుట్టినరోజు వేడుక పెద్ద గొప్పది కాదని.. అలా ఎన్టీఆర్ రాకుండా ఉండే మనిషి కాదని అంటున్నారు. తారక్ పెద్దవాళ్ళను గౌరవించే మనిషని అందరికీ తెలుసు.
ఎందుకంటే తనకు దక్కిన గౌరవాన్ని ఒక వేడుకల్లో అప్పుడే చనిపోయిన శోభన్ బాబుకి అంకితం చేసిన గొప్ప క్యారెక్టర్ ఉన్న మనిషి జూనియర్ ఎన్టీఆర్. అలాంటిది వాళ్ళ తాత శతజయంతి కి రాకుండా ఉండకపోవడమనేది జరగదు. కాకపోతే ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ ఇద్దరు కూడా రాకపోవడానికి నందమూరి కుటుంబం నుంచి బాలకృష్ణ కారణమని అంటున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ కి బాలకృష్ణకి ఎప్పుడు పడదని.. బాలకృష్ణకి ఎన్టీఆర్ వేడుకకి రావడం ఇష్టం లేదని.. అందుకే ఒకరిని బాధ పెట్టడానికి వెళ్ళే కంటే.. వెళ్లకపోవడం మంచిదని ఎన్టీఆర్ మానేసాడని.. ఎన్టీఆర్ వెళ్లట్లేదు కాబట్టి కళ్యాణ్ రామ్ కూడా వెళ్లలేదని అంటున్నారు. అయితే ఇలాంటి వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గానీ.. ఓకే కుటుంబంలో ఆ గొప్ప వ్యక్తికి రెండు తరాల వారసులైన బాలకృష్ణ ఎన్టీఆర్ మధ్య ఇలాంటి విభేదం దేనికంటూ.. వీరిద్దరి మధ్య విభేదం సృష్టిస్తున్నది ఎవరు అంటూ జనాలు వాపోతున్నారు.