Home Cinema Prabhas: ఆ ఇద్దరు స్టార్ హీరోలు రిజెక్ట్ చేసిన స్టొరీ లో ప్రభాస్ నటించగా.. అది...

Prabhas: ఆ ఇద్దరు స్టార్ హీరోలు రిజెక్ట్ చేసిన స్టొరీ లో ప్రభాస్ నటించగా.. అది ఎలాంటి రిజల్ట్స్ ఇచ్చిదో తెలుసా.?

Prabhas: సినిమా ఇండస్ట్రీలో ఓ హీరో కోసం రైటర్ ఎంతో కష్టపడి కథలను రాసి దర్శక, నిర్మాతలు తీరా ఆ హీరో తో కథ చెబుదామని వెళితే చాలా సింపుల్ గా ఆ కథ నచ్చకపోతే రిజెక్ట్ చేసి పడేస్తారు. ఆ తర్వాత మళ్లీ ఆ కథలో ఎన్నో మార్పులు చేర్పులు చేసుకుని మళ్లీ ఆ తర్వాత వేరే హీరోకి ఈ స్టోరీ సెట్ అవుతుందోనని అతని దగ్గరికి వెళ్లి కూడా ఈ కథను చెప్తే అతడు కూడా వద్దంటే.. మరొకరి దగ్గరికి వెళ్లడం ఇలా సినిమా ఇండస్ట్రీలో కథలు అటు ఇటు ట్రావెల్ అవుతూనే ఉంటాయి. ఒక హీరో కోసం రాసిన కథలో మరొక హీరో సినిమా చేయడం సర్వసాధారణమైన విషయం. (Prabhas Accepted Movie Stories)

movie-stories-which-were-rejected-by-chiranjeevi-and-mahesh-babu-but-prabhas-accepted-it-made-it-blockbuster

ఇలాంటి విషయాలు ప్రతి హీరో జీవితంలో జరుగుతూనే ఉంటాయి. అలా ఆ హీరోలు వద్దనుకున్న కథలు సూపర్ డూపర్ హిట్ అయినవి అలాగే అట్టర్ ఫ్లాప్ అయినవి కూడా చాలా ఉంటాయి. అలా గతంలో మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు రిజెక్ట్ చేసిన ఆ కథతో ప్రభాస్ సినిమా చేశాడు. మరింతకు ఆ చిత్రం మరేదో కాదు చక్రం.. కృష్ణ వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడిగా హీరోయిన్ ఆసిన్ మరియు చార్మికౌర్ లు నటించారు. ఈ చిత్రంలో ప్రధానమైన పాత్రలో నటించిన వారు ప్రకాష్ రాజ్, ఊర్వశి, తనికెళ్ల భరణి మొదలైన వారు.. ఈ చిత్రాన్ని పద్మాలయ టెలి ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మించారు.

See also  Prabhas - Anushka : ప్రభాస్ అనుష్క ల గురించి సంచలనమైన వార్త బయటపెట్టిన..

movie-stories-which-were-rejected-by-chiranjeevi-and-mahesh-babu-but-prabhas-accepted-it-made-it-blockbuster

కాగా ఈ సినిమా 2005వ సంవత్సరంలో మార్చి 25 తారీకున విడుదలైంది. అయితే ఈ చిత్రాన్ని భారీ అంచనాల నడమే బాక్సాఫీస్ వద్ద విడుదల చేసినప్పటికీ డిజాస్టర్ గా నిలిచింది. ఎందుకంటే ఈ చిత్రంలో హీరో ప్రభాస్ క్యాన్సర్ ఉందని తెలిసినా సరే ఆ చేదు విషయాన్ని దిగమింగుకొని అందరి ముఖాల్లో నవ్వులు నింపాలని ప్రయత్నించే ఓ యువకుడి పాత్రలో నటించాడు. కాగా ప్రభాస్ ఈ చిత్రంలో తన పాత్రకు వందకు వంద శాతం న్యాయం చేశాడు. కానీ సినిమాలో హీరో పాత్ర చంపేయడం సినిమాకు చాలా పెద్ద మైనస్ గా మారుతుంది. అది అందరికీ తెలిసిన విషయమే.. ఇక ప్రభాస్ అభిమానులే కాదు సాధారణమైన ప్రేక్షకులైన సరే హీరో పాత్ర చనిపోడాన్ని అస్సలు ఊహించుకోలేకపోయారు. (Prabhas Accepted Movie Stories)

See also  Niharika : నిహారికకు తన బావతో ఆ కారణంగా పెళ్లి ఫిక్స్?

movie-stories-which-were-rejected-by-chiranjeevi-and-mahesh-babu-but-prabhas-accepted-it-made-it-blockbuster

దాంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఇక్కడ ఈ చిత్రాన్ని మొదటగా ప్రభాస్ తో తీయాలని అనుకోలేదట డైరెక్టర్ కృష్ణ వంశీ.. ఎందుకంటే మొదట ఈ స్టోరీని మెగాస్టార్ చిరంజీవికి వివరిస్తే.. ఆయన హీరో చనిపోతే ప్రేక్షకులు ఎవ్వరు ఒప్పుకోరని ఈ కథను చాలా సున్నితంగా రిజెక్ట్ చేశాడట.. ఇక ఆ తర్వాత మహేష్ బాబు వద్దకు వెళ్లి వివరిస్తే ఆయన కూడా ఇదే కారణంతో చేయనని చెప్పాడట.. ఇక మొత్తానికి ప్రభాస్ పై ప్రయోగం చేసేందుకు రంగంలోకి దిగారు దర్శక, నిర్మాతలు అయినప్పటికీ ఎదురు దెబ్బే తగిలింది.. కానీ ఈ చిత్రం హిట్ కాక పోయినప్పటికీ రెండు నంది అవార్డులను కైవసం చేసుకుంది. మరి అదే విధంగా ఈ చిత్రాన్ని డబ్ చేసి మరి మలయాళం లో కూడా విడుదల చేశారట..