Vijaya Shanthi : టాలీవుడ్ టాప్ హీరో హీరోయిన్ లలో ముఖ్యమైన వాళ్లలో ఒకరైన చిరంజీవి విజయశాంతి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చిరంజీవి విజయశాంతితో కలిసి కనీసం 20 సినిమాలు పైగా నటించారు. ఆ రోజుల్లో వీళ్ళిద్దరూ జంటగా సినిమా వస్తే అభిమానులు ఎంత ఆనంద పడిపోయేవారో.. అలాగే సినీ దర్శకులు, నిర్మాతలు కూడా వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమాలు తీసి.. అభిమాన నుంచి ( Vijaya Shanthi comments on Chiranjeevi ) అంతగా డబ్బు సంపాదించుకోవాలని కూడా చూసేవారు. చిరంజీవి, విజయశాంతి కలిసి నటించిన ఆఖరి సినిమా గ్యాంగ్ లీడర్. ఈ సినిమా తర్వాత వీళ్ళిద్దరూ కలిసి నటించిన సినిమాలైతే ఇక లేవు.
విజయశాంతి హీరోయిన్ అయినప్పటికీ హీరోలతో సరి సమానంగా సినిమాల్లో రోల్స్ ని సంపాదించుకుంది. అది కూడా సాదాసీదా చిన్న హీరోలతో కాదు.. మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) సినిమాల్లో కూడా ఆమె కంటూ ఒక ( Vijaya Shanthi comments on Chiranjeevi ) ప్రత్యేకమైన పాత్రను సంపాదించుకునే స్థాయికి వచ్చింది. అంతే కాకుండా చిరంజీవితో పోటాపోటీగా సినిమాల్లో నటించేది. వీళ్లిద్దరూ కెమిస్ట్రీ ఎంతో అద్భుతంగా ఉండేది. వీళ్లిద్దరూ కలిసి చేసిన కామెడీ గాని, రొమాన్స్ గాని, డ్యాన్స్ గాని ప్రతిదీ కూడా అభిమానులను ఆకట్టుకునేది. అయితే గ్యాంగ్ లీడర్ సినిమా తర్వాత విజయశాంతి లేడీ ఓరియంటెడ్ సినిమాలో చేసి చిరంజీవికి దీటుగా టాలీవుడ్ ని ఒక ఊపు ఊపింది.
లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేయడంలో విజయశాంతి ఎంత దీటుగా, ఎంత సక్సెస్ఫుల్గా నటిస్తాదో మనందరికీ తెలుసు. విజయశాంతి కెరియర్లో లేడీ ఓరియంటెడ్ గా వచ్చిన సినిమాలు కర్తవ్యం, ప్రతిఘటన ఇలాంటి సినిమాలు ఎన్నో గొప్ప పేరుని సంపాదించుకున్నాయి. దాసరి నారాయణరావు దర్శకత్వంలో ( Vijaya Shanthi comments on Chiranjeevi ) ఒసేయ్ రాములమ్మ సినిమా తర్వాత విజయశాంతి క్రేజ్ హీరోలను మించిపోయింది. ఆమె రెమ్యూనరేషన్ కూడా స్టార్ హీరోల సైతం మించిపోయింది. అలాంటి తరుణంలో ఆమె నెమ్మదిగా సినిమాల నుంచి బయటకు వచ్చి.. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చింది. రాజకీయాల్లో ఎలా పయనించింది అవన్నీ కూడా మనందరికీ తెలిసిందే.
అయితే అప్పట్లో విజయశాంతి ( Vijaya Shanthi ) రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యి, రాజకీయాల జర్నీలో ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడు.. ఆమె చిరంజీవి గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలంగాణ ప్రజలు తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా ఇచ్చారని.. కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీ తెలంగాణ ( Vijaya Shanthi comments on Chiranjeevi ) ప్రజలకు ఏమిచ్చిందని ప్రశ్నించింది. చిరంజీవి కూడా ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఎన్నెన్నో మాటలు, ఎన్నెన్నో వాగ్దానాలు చేశాడు కానీ.. ఏ రోజైనా అతను తెలంగాణ ప్రజలకు.. వాళ్ళ ప్రత్యేక రాష్ట్రాన్ని వాళ్లకు ఇమ్మని అడుగుతుంటే చిరంజీవి ఏమైనా మాట్లాడడా? వాళ్లకు సపోర్ట్ చేశాడా? అందరూ మోసగాళ్లే.. ముసుగులో దొంగలే అంటూ ఆమె చిరంజీవి గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.