ఈ ఆరేళ్ళ పిల్లాడు గురించి తెలిస్తే,ఆశ్చర్యపోతారు.
వయసు ప్రతీ మనిషిలో మార్పు తీసుకుని వస్తుందన్న విషయం మనందరికీ తెలిసిందే. చిన్నతనం అన్నిటికంటే బాగుంటుంది. ఈబాధలు, కష్టాలు పెద్దగా అర్ధం కావు. చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నా, తమకు ఎం కావాలో చిన్న చిన్న కోరికలు కోసం తల్లితండ్రుల దగ్గర మారాం చేస్తూ, వాళ్ళతో ముద్దుగా అన్ని కోరికలు తీర్చుకుంటూ ఉంటారు. తల్లితండ్రుల ముద్దుతో గారంగా పెరిగే ఆ చిన్నతనాన్ని ఎంత వయసు వచ్చినా మరచిపోలేము. ఎందుకంటే అంత ఆనందమైన రోజులు, మనకి వయసు బాధ్యతలు పెరిగే కొద్దీ తగ్గిపోతాయి.
అయితే ఒక ఆరేళ్ళ పిల్లాడు, అరవై ఏళ్ల వయసుకు తగ్గ పరిణితి చూపించాడు. ఈ పిల్లాడి గురించి తెలిసిన ప్రతీ ఒక్కరూ కన్నీరు పెట్టుకుంటున్నారు. ఆ పిల్లాడి గురించి తెలిసిన తరవాత, ఆ పిల్లాడి గురించి కన్నీరు పెట్టుకుంటున్నారు గాని, వారి జీవితంలో ఉన్న బాధలతో నిరాశలో దుఃఖిస్తూ ఉన్నవారు మాత్రం దుఃఖాన్ని ఆధైర్యాన్ని వదిలేయాలని అనుకుంటున్నారు. నిజంగానే ఆ పిల్లాడు ఎందరికో ఆదర్శంగా నిలిచి, సూపర్ బాయ్ ని అనిపించుకుంటున్నాడు. ఆరేళ్లలో అంతటి ఆలోచనా విధానం, దైర్యం, సహనం ఎలా వచ్చిందని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
హైదరాబాద్ కు చెందిన ఐటీ ఉద్యోగుల దంపతుల ఆరేళ్ళ పిల్లాడి గురించి డాక్టర్ సుధీర్ కుమార్ రాసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ దంపతులకు ఒకే ఒక్క సంతానం. కొంతకాలంగా ఆ అబ్బాయికి హెల్త్ బాగోకపోవడంతో డాక్టర్ ని సంప్రదించారు. ఆ పిల్లాడికి క్యాన్సర్ ఉందని తెలిసింది. కానీ ఆ పిల్లాడికి ఆ విషయం చెప్పకుండా, మందులు వాడుతూ వస్తున్నారు తల్లితండ్రులు. అయితే ఆ పిల్లాడు మాత్రం గూగుల్ లో ఆ మెడిసిన్ దేనికి వాడతారో సెర్చ్ చేసి, జబ్బు గురించి తెలుసుకున్నాడు. తాను ఎంతో కాలం బ్రతకనని తెలుసుకున్నాడు.
ఆ పిల్లాడికి కాళ్ళు చేతులు పనిచేయడం మానేయడంతో న్యూరోలాజిస్ట్ దగ్గరకు తీసుకుని వెళ్లారు. అక్కడ ఆ పిల్లాడు తాను డాక్టర్ తో సింగల్ గా మాట్లాడాలని అని అడిగాడు. పేరెంట్స్ బయటకు వెళ్లారు. అప్పుడు ఆ పిల్లాడు డాక్టర్ తో ఇలా అన్నాడు. డాక్టర్ నాకు కాన్సర్ ఉందని, తొందరలోనే చనిపోతానని నాకు తెలుసు. కానీ దయచేసి మా అమ్మానాన్నకి చెప్పకండి, వాళ్ళు తట్టుకోలేరు అని చెప్పాడు. డాక్టర్ అలానే అని చెప్పి, తరవాత తల్లితండ్రులకు జరిగింది చెప్పి, మీకు తెలిసినట్టు మీ అబ్బాయితో ఉండకండి. చివరిరోజుల్లో తనకి ఆనందాన్ని ఇవ్వండి అని చెప్పారు.
తల్లితండ్రులు ఇద్దరూ ఉద్యోగాన్ని వదిలి, తమ కొడుకుతో టైం ఎక్కువగా గడపడం మొదలు పెట్టారు. తమ కొడుక్కి ఇష్టమైన డిస్నీ లాండ్.. ధీమ్ పార్కు కోసం అమెరికాకు తీసుకెళ్లారు. బాధని ఎవ్వరూ బయటకు రానివ్వకుండా, ఒకరి ఆనందం కోసం ఒకరు ఎంతో ఆనందంగా గడిపారు. తాను వెల్తూ, ఆ తల్లితండ్రుల ముఖంలో చిరునవ్వుని మాత్రమే చూస్తూ నెలరోజుల క్రితం ఆ పిల్లాడు మరణించాడు. ఆరేళ్ళ వయసులో అంతగా ఆలోచన విధానం, దైర్యం చివరి రోజుల్లో జీవితానికి తగ్గ ఆనందాన్ని పొందటం నిజంగా అందరిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.