Home Cinema Vijay Antony: బిచ్చగాడు 2 తో విజయ్ ఆంటోని పరిస్థితి ఇలా..

Vijay Antony: బిచ్చగాడు 2 తో విజయ్ ఆంటోని పరిస్థితి ఇలా..

vijay-antony-turned-into-a-waiter-at-a-restaurant-what-happened-to-him

Vijay Antony: 19 మే 2023న బిచ్చగాడు 2 సినిమాతో విజయ్ ఆంటోని మన ముందుకు వచ్చాడు. ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకొని.. కలక్షన్స్ కూడా బాగానే రాబడుతుంది. 2016లో బిచ్చగాడు అనే సినిమాతో విజయ్ ( Vijay Antony turned into a waiter ) ఆంటోని తెలుగు వాళ్ళకు పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ ని చేతిలో పెట్టుకొని.. తరువాత కొన్ని సినిమాలు తెలుగులో రిలీజ్ చేసినప్పటికీ.. ఆ సినిమాలు తెలుగులో అంతగా ఆదరణ పొందలేకపోయాయి. సుమారు ఏడేళ్ల తర్వాత విజయ్ ఆంటోని మళ్ళీ బిచ్చగాడు 2 సినిమాతో సెంటిమెంటల్ గా అదే టైటిల్ని పట్టుకొని మళ్లీ తెలుగు వాళ్ళ ముందుకు వచ్చాడు. సెంటిమెంట్ బాగానే వర్క్ అవుట్ అయ్యింది.

vijay-antony-turned-into-a-waiter-at-a-restaurant-what-happened-to-him

బిచ్చగాడు సినిమా తల్లి సెంటిమెంట్ తో.. 48 రోజుల పాటు అడుక్కుని తింటే.. బిచ్చగాడిగా పర్ఫెక్ట్ గా ఉంటే.. తన తల్లి బ్రతుకుతుందని ఒక స్వామీజీ చెప్పిన మాటలకు అపర కోటీశ్వరుడు బిచ్చగాడుగా బతికే క్రమమంలో ఎన్ని కష్టాలు, నష్టాలు, అనుభవాలు వస్తాయో ఆ సినిమాలో చూపించాడు. అలాగే ఇప్పుడు బిచ్చగాడు 2 లో ( Vijay Antony turned into a waiter ) చెల్లెలు సెంటిమెంట్ ని పెట్టి.. అలాగే ఒక బిచ్చగాడు జీవితంలో ఎన్ని సమస్యలు ఉంటాయి ? వాళ్లను ఎంతమంది ఎలా మోసం చేస్తూ ఉంటారు? వాడుకుంటా ఉంటారు అనే విషయాన్ని చక్కగా చూపించాడు. బిచ్చగాడు 2 సినిమా కూడా విజయ్ ఆంటోనీ ఊహించినంత సూపర్ డూపర్ హిట్ అవ్వకపోయినప్పటికీ.. హిట్ టాక్ తెచ్చుకుంది.

See also  Priyamani: అఫీషియల్- డివోర్స్ తీసుకుంటున్న ప్రియమణి..? కన్ఫామ్ చేసిన భర్త ముస్తఫ్ఫా..!!

vijay-antony-turned-into-a-waiter-at-a-restaurant-what-happened-to-him

పైగా ఈ సినిమా కలెక్షన్స్ కూడా బాగానే ఉన్నాయి అంటున్నారు. బిచ్చగాడు 2 సినిమా బాక్సాఫీస్ దగ్గర రిజల్ట్ చూపించడంతో బిచ్చగాడు పార్ట్ 3 తీయాలని విజయ్ ఆంటోని నిర్ణయించుకున్నాడంట. విజయ్ ఆంటోని కేవలం ఒక హీరో మాత్రమే కాదు. సంగీత స్వరకర్త, గేయ రచయిత, గాయకుడు, సినిమా ఎడిటర్, ఆడియో ఇంజనీర్, నిర్మాత, దర్శకుడు.. ఇన్ని కోణాలు ఉన్న మనిషే విజయ్ ఆంటోని. మరి ఇన్నిప్రతిభలు ఉన్న విజయ్ ఆంటోని ( Vijay Antony turned into a waiter ) ఒక హోటల్లో వెయిటర్ గా ఎందుకు పని చేస్తున్నాడు? అతని లైఫ్ ఎందుకు ఇలా అయింది? అంటూ విజయ్ ఆంటోనీ వెయిటర్ గా పనిచేస్తున్న ఒక ఇమేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బిచ్చగాడు 2 సినిమా కి హీరో మాత్రమే కాకుండా దర్శకుడుగా, నిర్మాతగా కూడా వ్యవహరించిన విజయ్ ఆంటోని సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఇలాంటి పరిస్థితి ఎందుకు ఎదురయింది అని జనం వాపోతున్నారు.

See also  Salaar : ప్రభాస్ సాలార్ టీజర్ లో అది కనిపెట్టారా?

vijay-antony-turned-into-a-waiter-at-a-restaurant-what-happened-to-him

అయితే ఈ ఫోటో అతని పరిస్థితి బాగోక అలాంటి పని చేస్తున్నది కాదు.. సినిమా సక్సెస్ అవ్వాలంటే ప్రమోషన్ బాగుండాలి. ఆ ప్రమోషన్ లో భాగంగా విజయ్ ఆంటోని హైదరాబాద్లో ఒక హోటల్లో తెలుగు వాళ్ళని ఆకట్టుకునే విధంగా తన ముఖానికి ముసుగేసుకుని వాళ్ళకి సర్వీస్ చేస్తున్నాడు. వాళ్లకు వడ్డిస్తున్న వెయిటర్ హీరో విజయ్ అంటోనీ అని అక్కడ కొందరు గమనించి.. ఆనందంతో పొంగిపోయారు. ఆ తర్వాత విజయ్ ఆంటోనీతో కలిసి అక్కడున్న వాళ్ళందరూ సెల్ఫీలు తీసుకోవడం, ఆటోగ్రాఫ్ తీసుకోవడం జరిగింది. ఈ రోజుల్లో సినిమా ప్రమోషన్ కోసం హీరోలు విభిన్నమైన ఆలోచనలు చేస్తూ ఆడియన్స్ లోకి వెళ్లి సినిమాను ప్రమోట్ చేసుకోవడం అనేది చాలా కామన్ గా జరుగుతున్న పనే. ఇటీవల అఖిల్ సినిమాకి అఖిల్ అలాగే బిల్డింగ్ మీద నుంచి దూకి ఆడియన్స్ కి సినిమా చేరువయ్యే విధంగా ప్రమోషన్ చేశాడు అన్న సంగతి మనకు తెలిసిందే.