Home Cinema Tollywood Heros: తల్లులు వేర్వేరు ఐనా ఈ టాలీవుడ్ స్టార్ హీరోలకు మాత్రం తండ్రి ఒక్కడే...

Tollywood Heros: తల్లులు వేర్వేరు ఐనా ఈ టాలీవుడ్ స్టార్ హీరోలకు మాత్రం తండ్రి ఒక్కడే అని ఎంతమందికి తెలుసు..

Tollywood Star Heroes: తెలుగు సినిమా ప్రపంచంలో మాత్రమే కాదు మరే ఇతర సినీ ప్రపంచంలో నైనా మొదటి సినిమాలోను లేదా మొదటి పరిచయంలోనూ ఇద్దరికీ ఇష్టం ఏర్పడుతుంది. ఆ తర్వాత ప్రేమించుకుని ఇంట్లో వాళ్ళను కాదని ఎదిరించి పెళ్లిళ్లు చేసుకుంటారు. ఆ తర్వాత ఎన్నో మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకుంటారు. ఇలా పెళ్లిళ్లు చేసుకుని అలా విడాకులు తీసుకోవడం అనేది సినీ ఇండస్ట్రీ వాళ్ళకి చాలా కామన్ గా జరిగే విషయం.. అందరూ అలా అని కాదు.. కానీ ప్రేమించి పెళ్లి చేసుకుని ఇప్పటివరకు అన్యోన్యంగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మన తెలుగు చిత్ర పరిశ్రమలో రెండు పెళ్లిళ్లు చేసుకున్న వాళ్లు కూడా ఉన్నారు. మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న వాళ్లు కూడా ఉన్నారు. అలా టాలీవుడ్ లో తల్లులు వేరు వేరు అయినప్పటికీ ఆ స్టార్ హీరోలకు మాత్రం తండ్రి ఒక్కరేనట.. మరి ఆలస్యం ఎందుకు ఆ హీరోలు ఎవరో తెలుసుకుందాం పదండి.. (Tollywood Star Heroes)

See also  Pawan Kalyan : చిరంజీవి మీద పవన్ సంచలన వ్యాఖ్యలు.. చెంప దెబ్బ కొట్టినట్టు..

Tollywood Star Heroes

నందమూరి ఎన్టీఆర్ – నందమూరి కళ్యాణ్ రామ్: ఈ ఇద్దరి నందమూరి హీరోలకు తండ్రి ఒక్కడే అయినప్పటికీ తల్లులు మాత్రం వేర్వేరు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరు దివంగత నటుడు రాజకీయ నేత అయిన హరికృష్ణ కుమారులు కాగా.. హరికృష్ణ మొదటి భార్య లక్ష్మి కుమారికి కళ్యాణ్ రామ్ జన్మిస్తే.. రెండవ భార్య శాలినికి ఎన్టీఆర్ జన్మించాడు. వీళ్ళిద్దరికీ తల్లులు వేరైనాప్పటికీ తండ్రి మాత్రం ఒక్కడే. అయినప్పటికీ వీళ్లిద్దరూ సొంత అన్నదమ్ముల కంటే ఎక్కువ ఆప్యాయంతో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కలిసిమెలిసి ఉంటారు.

See also  Lavanya Tripathi : వరుణ్ కంటే లావణ్య ప్రేమించి వదిలేసిన వ్యక్తి ఏమయ్యాడంటే..

although-the-mothers-are-different-these-tollywood-star-heroes-have-the-same-father

మంచు విష్ణు – మంచు మనోజ్: డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు రెండు వివాహాలు చేసుకున్నాడన్న సంగతి చాలా తక్కువ మందికే తెలుసు.. అయితే మోహన్ బాబు మొదటి భార్య విద్యా దేవికి మంచు లక్ష్మి, మంచు విష్ణు లు జన్మించగా విద్యాదేవి చనిపోవడంతో.. ఆమె చెల్లెలు నిర్మల దేవిని మోహన్ బాబు వివాహం చేసుకున్నాడట.. ఆ తర్వాత వీళ్ళిద్దరికీ మంచు మనోజ్ పుట్టాడు.

అక్కినేని నాగచైతన్య – అక్కినేని అఖిల్: ఈ అక్కినేని హీరోల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు మనందరికీ తెలిసిన విషయమే.. వీళ్లిద్దరి తండ్రి అక్కినేని నాగార్జున అన్న విషయం మనందరికీ తెలిసిందే.. కానీ తల్లులు మాత్రం వేరు వేరు.. మొదట అక్కినేని నాగార్జున రామానాయుడు కూతురు లక్ష్మిని వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ అక్కినేని నాగచైతన్య పుడితే ఆ తర్వాత రెండో భార్య అమలకు అక్కినేని అఖిల్ జన్మించాడు. వీళ్లిద్దరి తల్లులు వేరైనప్పటికీ చైతు, అఖిల్ కూడా సొంత అన్నదమ్ముల మాదిరిగానే కలిసిమెలిసి ఎంతో అన్యోన్యంగా ఉంటారు.

See also  Allu Arjun : అల్లు అర్జున్ ఫస్ట్ లవర్ వెలుగులోకి.. సీక్రెట్ తెలిసిన స్నేహారెడ్డి!

ఘట్టమనేని మహేష్ బాబు – వీ.కే.నరేష్: పైన చెప్పిన హీరోలందరికీ తల్లులు వేరువేరు కానీ తండ్రులు ఒక్కడే.. కానీ ఈ అన్నదమ్ముల ఇద్దరికి మాత్రం.. తల్లులే కాదు తండ్రులు కూడా వేరువేరు.. అదెలా అంటే.. సూపర్ స్టార్ కృష్ణ మొదటి భార్యకు మహేష్ బాబు జన్మించాడు. ఇక కృష్ణ రెండో భార్య విజయ నిర్మల.. అయితే విజయనిర్మల తన మొదటి భర్త ద్వారా ఓ కుమారుడికి జన్మించింది. అతడే నరేష్ అయినా సరే నరేష్ ను కృష్ణ సొంత కొడుకులాగే చూసుకున్నాడు.

although-the-mothers-are-different-these-tollywood-star-heroes-have-the-same-father