Mega Power Star RamCharan: మెగాస్టార్ చిరంజీవి తనయుడుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇక ఆయన గురించి ప్రత్యేకమైన పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు.. మెగాస్టార్ తనయుడుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటికీ భారీ సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ కేవలం తనదైన శైలిలో, తన టాలెంట్ తోనే స్టార్ హీరోగా ఎదిగాడు రామ్ చరణ్.. ఇక ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ.. ఆ తర్వాత నటుడిగా తానేంటో నిరూపించుకొని ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. మొత్తానికి తండ్రికి తగ్గ తనయునిగా తన పేరును పదిలం చేసుకున్నాడు.
దర్శక ధీరునిగా పేరుపొందిన రాజమౌళి నిర్మించినటువంటి ఆర్ఆర్ఆర్ చిత్రంతో గ్లోబల్ స్టార్ గా తన గుర్తింపును కైవసం చేసుకున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ కు హాలీవుడ్ నుంచి కూడా ఎన్నో ఆఫర్లు లభిస్తున్నాయి. మరి ఆయన రేంజ్ ప్రస్తుతం ఎంత గొప్ప స్థాయికి చేరుకుందో ఈ ఒక్క విషయం చూస్తే మనకు అర్థమవుతుంది. ఇంత గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించినప్పటికీ ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే నైజం రామ్ చరణ్ సొంతం. నేను మెగాస్టార్ చిరంజీవి కొడుకుని కదా అనే గర్వం ఆయనలో ఎప్పుడూ కనపడదు. స్టార్ హీరోగా ఎదిగాను కదా అనే అహం ఆయనలో ఎప్పుడూ లేదు.
ఇదే కాకుండా ఏ ఫంక్షన్ లో.. ఏ ప్రోగ్రాం లో.. ఆయనను గమనించినప్పటికీ పెద్దల పట్ల గౌరవం తో నటి నటుల తో ఎలా మెలగాలో ఆయనను చూస్తే ఇట్టే అర్థమవుతుంది. దానికి నిదర్శనం ఓ సంఘటన కూడా.. రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత చిరంజీవి సినిమాలకు పూర్తిగా దూరమైన సంగతి మనందరికీ తెలిసిందే.. కానీ ఆ తర్వాత ఖైదీ నెంబర్ 150 చిత్రంతో రియంట్రీ ఇచ్చాడు చిరంజీవి.. ఇక ఈ చిత్రాన్ని వి.వి వినాయక్ దర్శకత్వం వహించగా.. ఇందులో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించింది. ఇక ఈ చిత్రం 2017 లో విడుదలై సంచలనమైన విజయాన్ని కైవసం చేసుకుంది.
అయితే ఖైదీ నెంబర్ 150 చిత్రం ఎంతో ఘన విజయం సాధించడంతో రామ్ చరణ్ మరియు చిరంజీవి ఒక రోజు వాళ్ళ ఇంటికి దర్శకుడు వి.వి వినాయక్ ని డిన్నర్ కు ఆహ్వానించాడట.. ఇక ఇదే సమయంలో చాలా రోజుల తర్వాత తన తండ్రి మళ్ళీ సినిమా ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చిన సినిమాను చక్కగా తీర్చిదిద్దినందుకు వి.వి వినాయక్ గారికి కృతజ్ఞతలు చెప్పడమే కాకుండా రామ్ చరణ్ ఆయన కాళ్లకు నమస్కారం కూడా చేశాడట.. ఇక ఈ విషయాన్ని స్వయంగా ఇటీవలే ఒక కార్యక్రమంలో పాల్గొన్న డైరెక్టర్ మెహర్ రమేష్ తెలిపాడు. స్టార్ హీరో హోదాలో ఉన్నప్పటికీ పైగా మెగాస్టార్ తనయుడు అయినప్పటికీ అలాంటి రామ్ చరణ్ ఓ డైరెక్టర్ ని ఇంటికి పిలిచి మరి కాళ్లు పట్టుకొని నమస్కరించాడు అంటేనే అతని సంస్కారం ఎంత గొప్పదో మనమందరం అర్థం చేసుకోవచ్చు. (Mega Power Star RamCharan)