Home Cinema Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ ఆ హీరోతో పిచ్చి ప్రేమలో ఉన్నప్పటికీ ఎందుకు మోసపోయింది.

Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ ఆ హీరోతో పిచ్చి ప్రేమలో ఉన్నప్పటికీ ఎందుకు మోసపోయింది.

Actress Kajal Aggarwal: కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన చిత్రం లక్ష్మీ కల్యాణం లో తొలిసారిగా హీరోయిన్ గా పరిచయమైంది కాజల్ అగర్వాల్.. ఈ చిత్రంతోనే తెలుగు సినీ ప్రపంచంలోకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. తన మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ సంపాదించుకుని ఆ తర్వాత చందమామ చిత్రంతో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది. ఇక ఆ తర్వాత నటించిన మగధీర చిత్రంతో ఇండస్ట్రీలో గా స్టార్ హీరోయిన్ గా ముద్ర వేసుకుని తన పేరును పదిలం చేసుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ లో ఉన్న అగ్ర హీరోలు అందరితో నటించి స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతూ వచ్చింది.

actress-kajal-aggarwal-was-in-deep-love-with-that-hero-but-got-break-up-and-married-other-guy

అలాంటి ఈ ముద్దుగుమ్మకి కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే బిజినెస్ మాన్ తన చిన్ననాటి మిత్రుడైన గౌతమ్ కిచ్లూ ను ప్రేమించి వివాహం చేసుకుంది. ప్రస్తుతం వీరిద్దరికీ ఓ బాబు కూడా పుట్టాడు. వివాహం అనంతరం ఇక ఇటీవలే కాజల్ అగర్వాల్ (Actress Kajal Aggarwal) మళ్లీ తన రెండవ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. ప్రస్తుతానికైతే ఈ విషయాన్ని పక్కన పెడితే.. సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల మధ్య ప్రేమలు, డేటింగ్ లు అనేవి చాలా కామన్ గా మనం చూస్తూనే ఉంటాం. అందులో భాగంగానే కాజల్ అగర్వాల్ కూడా గతంలో ఆ స్టార్ హీరోను ప్రేమించిందట.. ఇక ఆ హీరో మరెవరో కాదు టాలీవుడ్ లో ఎనర్జిటిక్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న రామ్ పోతినేని. కాజల్ అగర్వాల్ రామ్ పోతినేని వీళ్లిద్దరి కాంబినేషన్లలో వచ్చిన చిత్రం గణేష్.

See also  Jailer: మూడు రోజుల్లో అన్ని వందల కోట్ల కలెక్షన్ తో సంచలనం సృష్టిస్తున్న జైలర్..

actress-kajal-aggarwal-was-in-deep-love-with-that-hero-but-got-break-up-and-married-other-guy

ఇక ఈ చిత్రం సమయంలోనే వీళ్ళిద్దరూ ప్రేమలో పడి చాలా రోజులు చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతూ వీళ్ళ ప్రేమను ముందుకు సాగించారట. ఇక ఇదే విషయాన్ని కాజల్ అగర్వాల్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నపుడు స్వయంగా తన నోటితోనే చెప్పిందట. ఇదే కాకుండా ఆ హీరో తో ఉన్న బంధం గురించి మాత్రమే కాకుండా నేను రామ్ పోతినేని తో లివింగ్ రిలేషన్ షిప్ లో కూడా ఉన్నానని క్లారిటీ తెలిపిందట.. ఇదే కాకుండా ఓ బిజినెస్ మాన్ తో కూడా నేను ప్రేమలో పడ్డాను అని తెలిపింది. కానీ ఆ బిజినెస్ మాన్ ఎవరో కాదు ప్రస్తుతం వివాహం చేసుకున్న గౌతమ్ కిచ్లు. కాజల్ తెలివిగా గౌతమ్ తో ఉన్న ప్రేమని అలాగే కంటిన్యూ చేసి చివరికి పెళ్లి చేసుకుని బాబుకు జన్మనిచ్చింది.

See also  Samantha: డబ్బు చేతిలో పడిందా అంతే..? ఎంత మంది ఉన్నా అలాంటి సీన్లు చేయడానికి సమంత సర్వం అర్పింస్తుందట..

actress-kajal-aggarwal-was-in-deep-love-with-that-hero-but-got-break-up-and-married-other-guy

కానీ రామ్ పోతినేని మధ్యలోనే వదిలేసింది. కాగా కాజల్ అగర్వాల్ ని మరొక సందర్భంలో గతంలో ఇంటర్వ్యూలో యాంకర్ మీరు ఎప్పుడైనా బాధపడిన సందర్భాలు కన్నీళ్లు పెట్టుకున్న విషయాలు ఏమైనా ఉన్నాయని అడగ్గా.. ఎస్ నేను నా బాయ్ ఫ్రెండ్ తో ప్రేమ విఫలమైనప్పుడు చాలా దుఃఖంతో కన్నీళ్లు పెట్టుకున్నాను. ఆ బాధను చెప్పడానికి నాకు మాటలు రావు.. అంటూ ఆ ఇంటర్వ్యూలో తెలిపిందట. ఇక ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరో కాదు రామ్ పోతినేని అంటూ కొంతమంది నెటిజన్లు భావిస్తున్నారు. మరదే కాకుండా ఆ హీరో చేసిన మోసానికి కాజల్ అగర్వాల్ అంతగా బాధపడిందా లేక కాజల్ అగర్వాల్ హీరోని మోసం చేసిందంటూ కామెంట్లు చేస్తున్నారు.