Home Cinema Rajamouli-Jagapathi Babu: అసలేంటి రాజమౌళి – జగపతి బాబు ల మధ్య ఉన్న బంధుత్వం.? ఎవ్వరికీ...

Rajamouli-Jagapathi Babu: అసలేంటి రాజమౌళి – జగపతి బాబు ల మధ్య ఉన్న బంధుత్వం.? ఎవ్వరికీ తెలియని న్యూస్ ఇది..

Rajamouli-Jagapathi Babu: తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శక ధీరునిగా తన పేరును కైవసం చేసుకున్న రాజమౌళి గారంటే తెలియకుండా ఎవ్వరూ ఉండరు. సినీ ఇండస్ట్రీలో సినిమాలను డైరెక్టర్లు అందరూ తీస్తారు కానీ దర్శక ధీరుడు మాత్రం చిత్రాలను చెక్కుతుంటాడు. అందుకే చాలామంది రాజమౌళిని జక్కన్న అని కూడా సంబోధిస్తుంటారు. మొదట తన సినీ కెరియర్ను సీరియల్స్ డైరెక్టర్ గా మొదలు పెట్టి నేడు మాత్రం ఏకంగా ఆస్కార్ అవార్డు విన్నింగ్ మూవీకి దర్శకత్వం వహించే స్థాయికి ఎదిగాడు. తిరుగులేని అపజయం ఎరుగని దర్శకుడిగా తన పేరును పదిలం చేసుకున్నాడు. తెలుగు చిత్రాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చి పెట్టాడు.

See also  Varun Tej Lavanya marriage date : వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి డేట్ ని మార్చేసిన చిరంజీవి..

is-there-such-a-close-relationship-between-rajamouli-and-jagapathi-babu

ఇక ఈ విషయం పక్కన పెట్టి.. మన అసలు టాపిక్ విషయంలోకి వచ్చినట్లయితే.. ఒకప్పుడు హీరోగా ఓ వెలుగు వెలిగి ప్రస్తుతం విలన్ గా అలాగే క్యారెక్టర్ ఆర్టిస్టుగా దూసుకుపోతున్న జగపతిబాబు గారికి రాజమౌళి గారు బంధువులని మీకు తెలుసా? అవును.. మీరు విన్నది నిజమే.. వీరిద్దరి మధ్య చాలా దగ్గర బంధుత్వం ఉందట ఎందుకంటే రాజమౌళికి కార్తికే అనే తనయుడు ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే రాజమౌళి నిర్మించే ప్రతి చిత్రం వెనుక ఈయనే లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తాడు.

See also  Balagam : బలగం సినిమా దానికి పోటీ.. ఇక వీళ్ళ సంగతి ఏమిటి?

is-there-such-a-close-relationship-between-rajamouli-and-jagapathi-babu

ఇక కార్తికేయ రాజమౌళి తీసినటువంటి చిత్రాలను ఎలా జనాల్లోకి తీసుకెళ్ళాలి మార్కెట్ ను ఎలా పెంచాలి? ఎంత పెంచాలి వంటి అనేక విషయాలను చూసుకునేది మొత్తం ఈయనే అట.. అతనికి తెలిసినన్ని ప్రమోషన్స్ టెక్నిక్స్ కూడా చివరికి రాజమౌళికి కూడా తెలియవని అంటుంటారు. ఆర్ఆర్ఆర్ చిత్రానికి కూడా ఆస్కార్ అవార్డు రావడానికి వెనుక కార్తికేయ కృషి ఎంతో ఉందట.. అయితే కార్తికేయ 2018 వ సంవత్సరంలోనే ఓ ఇంటివాడయ్యాడు. తను తో ఏడడుగులు నడిచి మేడలో మూడు ముళ్ళు వేసుకున్న తన ప్రియ సఖి పేరు పూజా ప్రసాద్.

See also  Rashmi: ఫస్ట్ టైం రూల్స్ బ్రేక్ చేసిన రష్మీ.. మల్లెమాల చరిత్ర తిరగరాసింది.?

is-there-such-a-close-relationship-between-rajamouli-and-jagapathi-babu

రాజస్థాన్ రాజధాని జైపూర్ లో వీరి యొక్క వివాహం అంగరంగ వైభవంగా జరిగింది . అయితే ఆధ్యాత్మిక గాయనిగా మంచి పేరు సంపాదించుకున్న పూజా ప్రసాద్ మరెవరో కాదు జగపతిబాబు అన్నగారైన రాంప్రసాద్ గారి కూతురు. అంటే కార్తికేయ జగపతిబాబుకి వరుసకు అల్లుడు అవుతాడు. అలాగే రాజమౌళి వరుసకు బావ అవుతాడు. ఇదన్నమాట వీరి మధ్య ఉన్న చుట్టరికం. ఇక ఈ విషయం చాలామంది తెలుగు ప్రేక్షకులకు తెలియనే తెలియదు. (Rajamouli-Jagapathi Babu)