Rashmi Gautam: ప్రస్తుతం ఉన్న బుల్లితెర యాంకర్లలో తనకంటూ మంచి గుర్తింపు తన కైవసం చేసుకుని తన అందంతో చిలక పలుకులాంటి మాటలతో కోట్ల మంది తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందుతూ నెంబర్ వన్ స్థానాన్ని పొందడానికి ఎప్పటికప్పుడు తన ప్రయత్నాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తూ వస్తున్న యాంకర్ రష్మి గురించి మనందరికీ తెలిసిన విషయమే.. మొదట వెండితెర పైన కొన్ని సైడ్ క్యారెక్టర్ అరెస్టుగా చేసిన ఈ అమ్మడు ఆ తర్వాత జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో ద్వారా యాంకర్ గా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇక రష్మీ ఇండస్ట్రీలోకి రాకముందుకు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నది. ప్రస్తుతానికైతే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మాత్రం స్టార్ యాంకర్ గా తన సత్తా చాటుతూ కొనసాగుతోంది. (rashmi not getting opportunities)
ఇక నిత్యం తన అందంతో హాట్ గ్లామర్ షోలతో ఈమె అందాలు ఆరబోయడం రష్మీ తర్వాతే ఎవరైనా అనేంతలా మారిపోయింది. అంతలా తన గ్లామర్ తో ఆకట్టుకుంటున్న రష్మీ కి కొన్ని సినిమాలలో కూడా అవకాశాలు అందుకొని హీరోయిన్ గా మారిపోయింది. కానీ ఆమె దురదృష్టం అనుకున్నంత స్థాయిలో మంచి సక్సెస్ అయితే పొందలేకపోయింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం రోజు చాలా చురుగ్గా ఉంటూ తన గ్లామరస్ ఫోటోలను వాళ్ళ అభిమానులకు షేర్ చేస్తూ పంచుకుంటుంది. ఇదే కాకుండా ప్రతి చిన్న విషయాన్ని కూడా సోషల్ మీడియా ద్వారా నెటిజన్స్ తో చర్చిస్తూ ఉంటుంది. ఇక కేవలం ఇదే కాకుండా సమాజంలో జరిగే అన్యాయాలపై కూడా స్పందిస్తూ అప్పుడప్పుడు రష్మి పేరు హాట్ టాపిక్ గా వినిపిస్తూ ఉంటుంది. (rashmi not getting opportunities)
ఇక రష్మీ ఇటీవలే ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు.ఆమెకు సినిమాల్లో హీరోయిన్ గా అవకాశం రాలేకపోవడానికి గల కారణాలను వివరించింది.. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక ప్రోమో విడుదల చేసింది. ఇందులో యాంకర్ రష్మీ ఆసక్తికరమైన విషయాలు తెలిపింది. దాంతో ఆ విషయాలు ఆమె అభిమానులే గాక తెలుగు ప్రేక్షకులు సైతం చర్చించుకునే అంశంగా మారింది. అయితే ప్రోమోలో భాగంగా యాంకర్ రష్మిని ఇంద్రజ ప్రశ్నిస్తూ.. బుల్లితెరపై ఇంత మంచి అవకాశాలను సాధిస్తున్న నీకు వెండితెరపై ఎందుకు విజయం సాధించలేకపోతున్నావని అడగగా.. దీనిపై యాంకర్ రష్మీ రియాక్ట్ అవుతూ.. సమాధానం తెలుపుతూ..
సినిమా ఇండస్ట్రీలో తనకు అవకాశాలు లభించాయి. అయితే అవకాశాల్లో రాత్రికి రాత్రే నా పాత్రలో ఇంకొకరు వచ్చారు. మంచి అవకాశాలను కోల్పోయాను.. ఇండస్ట్రీలో సాధారణంగా అందరికీ ఒక స్టాంపు అనేది ఉంటుంది. అది ఎలాంటి స్టాంప్ అంటే కొంతమంది మెయిన్ హీరోయిన్ గా మరి కొంతమంది సెకండియర్ గా మరి కొద్ది మంది సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా అక్క, వదిన పాత్రలకు మాత్రమే సెట్ అవుతారు. అలాంటి వాళ్లకు ఓ స్టాంపు ఉంటుంది. నాకు సినిమలాలో సెట్ అయ్యేలా స్టాంప్ లేదు కేవలం యాంకర్ గా మాత్రమే సెట్టయ్యే స్టాంప్ ఉంది. అందుకే ఇక్కడ ఉన్నానంటూ తెలిపింది. మొత్తానికైతే రష్మీ యాంకరింగ్ రంగాన్ని మాత్రం వదులుకోనని అందరి ముందు స్పష్టంగా తెలియజేసింది. ప్రస్తుతానికి ఓ ప్రోగ్రాం కి అమ్మడు 2 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటుందట.. ప్రస్తుతం వార్తలు నటింట వైరల్ గా మారాయి.