Home Cinema Niharika: ఎట్టకేలకు లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ల పెళ్లిపై  క్లారిటీ ఇచ్చిన నిహారిక..

Niharika: ఎట్టకేలకు లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ల పెళ్లిపై  క్లారిటీ ఇచ్చిన నిహారిక..

Niharika: వరుణ్ సందేశ్ లావణ్య త్రిపాఠి వీళ్లిద్దరి ప్రేమ వ్యవహారం గురించి ఇదివరకే ఎన్నోసార్లు మనం చర్చించుకున్నాం. వీరిద్దరి మధ్య ఉన్న బంధం గురించి ఇప్పటికే ఎన్నోసార్లు ఎన్నో రకాల వార్తలు వ్యాపించాయి. కాగా గత రెండు రోజుల నుంచి బడా మీడియాలో కూడా ఒక వార్త వైరల్ గా మారుతుంది. అదేందంటే.. వచ్చే నెలలో వీరిద్దరూ ఘనంగా నిశ్చితార్థం చేసుకోబోతున్నారట. కానీ ఈ విషయం గురించి ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ మాత్రం ఎలాంటి క్లారిటీ తెలుపలేదు. కానీ తాజాగా నిహారిక తన అన్నయ్య పెళ్లిపై క్లారిటీ తెలిపింది. ఎలా అంటే.. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి వీళ్లిద్దరూ కలిసి మిస్టర్, అంతరిక్షం అనే రెండు సినిమాలలో జోడిగా నటించారు. ఇక ఆ సినిమాలో నటించే సమయంలోనే వీళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడి అది కాస్తా ప్రేమగా మారిందంటూ ఎన్నో రకాల కథనాలు వ్యాపించాయి. (Finally Niharika gave clarity)

See also  Naga Chaitanya - Samantha : నాగచైతన్య సమంతలకు మళ్ళీ పెళ్లా?

finally-niharika-gave-clarity-on-varun-and-lavanya-wedding

ఇదేకాక గతంలో లావణ్య పుట్టినరోజుకి వరుణ్ ఏకంగా ఓ డైమండ్ రింగ్ ఆమెకు గిఫ్ట్ ఇవ్వడానికి వెళ్ళాడంటూ కూడా ఎన్నో రకాల వార్తలు వ్యాపించాయి. ఇందులో నిజమెంతుందో వాళ్లకే తెలుసు.. కానీ ఈ వార్తలపై ఎప్పుడు లావణ్య అడిగినా కూడా మేమిద్దరం చాలా మంచి ఫ్రెండ్స్ మా మధ్య ఏమీ లేదు అంటూ ఉంటుంది. కానీ చాలాసార్లు కెమెరా కంటా వీళ్ళిద్దరూ ప్రైవేట్ పార్టీలలో.. అలాగే మెగా ఫ్యామిలీ ఫంక్షన్లలో.. త్రిపాఠి పాల్గొనగా చిక్కింది. ఈ కారణాల వల్లే వీళ్ళిద్దరి మధ్య ఖచ్చితంగా ఏదో ఉందని అందరూ అనుమానిస్తున్నారు. అయితే నిహారిక వివాహ సమయంలో ఏ సెలబ్రెటీలు కూడా రాలేదు. కానీ లావణ్య మాత్రం పెళ్లికూతురు చేసే అప్పటినుండి పెళ్లి జరిగేటప్పుడు అన్ని ఫంక్షన్లో పాల్గొన్నది.

See also  Telugu Heroines: ధనిక వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్లు ఎవరో తెలుసా.? ప్లాన్ అంటే ఇదే

finally-niharika-gave-clarity-on-varun-and-lavanya-wedding

ఇక మనకు తెలియనిది ఏముంది సెలబ్రిటీలు తాము పెళ్లి చేసుకోబోతున్నామన్న విషయం పెళ్లి అయ్యేవరకు కూడా ఎవ్వరికీ తెలియకుండా సీక్రెట్ గా ఉంచుతారు. మరి అదే విధంగా లావణ్య త్రిపాఠి కూడా ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచుతుందా అని అందరూ భావిస్తున్నారు. ఇక ఈ విషయాలన్నీ పక్కన పెడితే తాజాగా నిహారిక ప్రధానమైన పాత్రలో వస్తున్న డేట్ పిక్సల్ అనే వెబ్ సిరీస్ ఇవాళ విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఈ వెబ్ సిరీస్ విడుదల సిద్ధంగా ఉన్న నేపథ్యంలో వరుసగా ప్రమోషన్లలో పాల్గొంటూ బిజీబిజీగా గడుపుతోంది నిహారిక. ఇంటర్వ్యూలో పాల్గొనిన నిహారిక ఎన్నో విషయాలను చర్చించింది అలాగే ఇంటర్వ్యూలో భాగంగా నిహారికకు ఓ ప్రశ్న ఎదురయింది.

finally-niharika-gave-clarity-on-varun-and-lavanya-wedding

అది ఏమిటంటే.. మీ అన్నయ్య లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకోబోతున్నారంట కదా వచ్చేనెల ఎంగేజ్మెంట్ అంతా ఇది నిజమేనా అని యాంకర్ అనగా.. అందుకు సమాధానంగా నిహారిక స్పందిస్తూ.. ఇప్పుడు నేను ఆ విషయం గురించి మాట్లాడాలి అనుకోవడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం కేవలం నా వెబ్ సిరీస్ ప్రమోషన్ లోనే మాత్రమే పాల్గొన్నాను. ఆ వెబ్ సిరీస్ గురించే మాట్లాడుతున్న అంటూ ముఖాముఖిగా తేల్చి చెప్పింది. అయితే నిహారిక మాటలు నెట్టింట వైరల్ అవ్వడంతో లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ల పెళ్లి నిజమే ఎందుకంటే ఇందులో ఏ మాత్రం నిజమనేది లేకపోతే నిహారిక (Finally Niharika gave clarity) వార్తలను కొట్టి పారేసేది కానీ.. ఖండించనేలేదంటే నిజంగా వాళ్ళిద్దరి పెళ్లి జరుగుతుందని అర్థం చేసుకోవాలంటే చాలామంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ విషయం గురించి నిజా నిజాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు తప్పక ఎదురుచూడాల్సిందే..