Home Cinema Manchu Lakshmi: భర్తకు దూరమైన మంచు లక్ష్మి విడాకులు తీసుకోనుందంనే ప్రచారంలో నిజమెంత.?

Manchu Lakshmi: భర్తకు దూరమైన మంచు లక్ష్మి విడాకులు తీసుకోనుందంనే ప్రచారంలో నిజమెంత.?

Lakshmi Manchu: తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటికే ఎంతోమంది బడా ఫ్యామిలీలు ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే.. ఇందులో ముఖ్యంగా మెగా కుటుంబం, నందమూరి కుటుంబం, అక్కినేని కుటుంబం, ఘట్టమనేని కుటుంబం, దగ్గుపాటి కుటుంబం, మంచు కుటుంబం.. ఇక వీళ్ళందరిలో మెగా మరియు నందమూరి కుటుంబాల నుండి ఎందరో హీరోలుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. మరలాగే దగ్గుపాటి కుటుంబం నుండి కూడా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇక ఘట్టమనేని కుటుంబం నుండి మహేష్ బాబు మాత్రమే కృష్ణ వారసునిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అలాగే మంచు కుటుంబంలో మోహన్ బాబు తర్వాత ఇద్దరు కొడుకులు ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ వారికి అంతగా అదృష్టం కలిసి రాలేదు.

manchu-lakshmi-staying-away-from-her-husband-is-she-also-taking-divorce

ఇదే కాకుండా మంచు లక్ష్మి కూడా అనగనగా ఓ ధీరుడు అనే సినిమాలో లేడీ విలన్ గా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఇక ఆ తర్వాత మంచు లక్ష్మి తనదైన శైలిలో సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక కేవలం సినిమాల్లోనే కాకుండా మంచు లక్ష్మి కొన్ని షో లలో కూడా హోస్ట్ గా వ్యవహరించింది. మంచు లక్ష్మి మాట్లాడే విధానంపై సోషల్ మీడియాలో ఎన్నో రకాల ట్రోల్స్ వస్తాయని మనందరికీ తెలిసిన విషయమే.. ఆమె తెలుగు మాట్లాడడం ఫారినర్స్ మాట్లాడినట్టు ఉండడంతో చాలామంది ఈమె పై ఎన్నో రకాల మీమ్స్ చేస్తూ తెగ వైరల్ చేస్తూ ఉంటారు. అయితే దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మంచు లక్ష్మి ఎక్కువగా ఫారిన్ లోనే ఉండడం వళ్ళనే ఆమెకి తెలుగు అనేది అంతగా మనలాగా పలకరాదు.

See also  Chiranjeevi: చిరంజీవి జీవితంలో పెద్ద సీక్రెట్ ని బయటపెట్టేసిన ఆ స్టార్ హీరో..

manchu-lakshmi-staying-away-from-her-husband-is-she-also-taking-divorce

అయితే తన పై ఎన్ని ట్రోల్స్ వచ్చినప్పటికీ మంచు లక్ష్మీ వాటిని లెక్కచేయదు. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే మంచు లక్ష్మి చాలా రోజుల నుంచి ఇండియాలోనే ఉంటుంది. మరి ఆమె భర్తనేమో అమెరికాలో ఉంటాడు. ఏ ఫంక్షన్ లో పార్టీలైన ఎక్కడికన్నా వెళ్ళినా కూడా మంచు లక్ష్మి సింగిల్ గానే వెళుతుంది. సోషల్ మీడియాలో కొంతమంది మంచు లక్ష్మి తన భర్తకి దూరంగా ఉండడానికి కారణం ఆమె తన భర్తతో విడాకులు సీక్రెట్ గా తీసుకుందా.. అందుకే దూరంగా ఉంటున్నారా అనే వార్త ప్రస్తుతం ట్రెండ్ చేస్తున్నారు. అయితే ఈ వార్తల గురించి తాజాగా ఇంటర్వ్యూలో ఓ ఇంటర్వ్యూలో భాగంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ.. నా భర్తతో విడాకులు తీసుకున్నాను అనే వార్తలు నా దగ్గరికి కూడా వచ్చాయి.

See also  Jr NTR : ఆ వ్యక్తి కోసం ప్రాణాలు ఇస్తానంటున్న ఎన్టీఆర్!

manchu-lakshmi-staying-away-from-her-husband-is-she-also-taking-divorce

కానీ ఆ విడాకుల విషయం లో ఎలాంటి నిజం లేదు. అయినా నా భర్త అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆయన చాలా సంవత్సరాల నుండి అక్కడే ఉంటున్నాడు. నేను నా భర్తతో ఉండడానికి లాస్ ఏంజెల్స్ కి వెళ్ళినప్పుడు నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. అందుకే నేను మళ్ళీ సినిమాల్లో చేస్తానని అనడంతో నీకు ఏది ఇష్టం అనిపిస్తే అదే చేయమని నా భర్త నాకు చెప్పాడు. దాంతోనే నేను మళ్ళీ ఇండియా కి వచ్చి సినిమాల్లో చేస్తున్నాను. ఇక మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు. మా మధ్య ఉన్న బంధం అంతా సింపుల్గా ఎవరికి అర్థం కాదు. ఇక టైం దొరికినప్పుడు అలా భర్త దగ్గరికి వెళుతూ ఉంటాను అని చెబుతూ.. విడాకులు తీసుకుంటున్నాను అంటూ వస్తున్న వార్తలపై మంచు లక్ష్మి (Lakshmi Manchu) క్లియర్ గా క్లారిటీ తెలిపింది.