Vijay Deverakonda : ఏ రంగంలో అయినా పోటీ అనేది ఉండడం సహజం. సినిమా రంగంలో అది మరింత ఎక్కువగా ఉంటుంది. సినిమా రంగంలో.. అందులో నటించే హీరోలు హీరోయిన్లకు మాత్రమే కాకుండా, వాళ్ళ అభిమానులకు కూడా ఒకరి మీద ఒకరికి పోటీ భావన ఉంటుంది. అందుకే ఈ రంగానికి అంత క్రేజ్ ( When Vijay Deverakonda movie flopped ) రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. విజయ్ దేవరకొండ ఈ పేరు వింటే యూత్ లో ఒక రకమైన ఉత్సాహం వస్తుంది పెళ్లిచూపులు సినిమాతో హీరోగా తన కెరీర్ ని మొదలు పెట్టిన విజయ్ దేవరకొండ అతి తక్కువ కాలంలోనే ఎవరూ ఊహించనంత గొప్ప స్థానానికి చేరుకున్నాడు అన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు.
పెళ్లిచూపులు సినిమా తర్వాత అర్జున్ రెడ్డి సినిమా వచ్చింది. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ క్రేజ్ ఎలా మారుమ్రోగిందో.. ఆ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక కొత్త సెన్సేషన్ ఎలా క్రియేట్ చేసింది అనేది మన అందరికీ తెలిసినదే. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత గీత గోవిందం.. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ( When Vijay Deverakonda movie flopped ) అమ్మాయిల మనసుల్ని దోచుకోవడమే కాకుండా.. వాళ్ళ హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోయేంత అభిమానాన్ని సంపాదించుకున్నాడు. గీత గోవిందం సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ మూవీ అవ్వడంతో విజయ్ దేవరకొండ పై అందరికీ ఎన్నో అంచనాలు పెరిగిపోయాయి.
సినిమా రంగంలోకి ఎంటర్ అయిన అతి తక్కువ కాలంలోనే చాలా స్పీడ్ గా చాలా పెద్ద రేంజ్ కి ఎదిగిన హీరోగా విజయ్ దేవరకొండ ఒక స్పెషల్ స్థానాన్ని తెలుగు సినిమా ఇండస్ట్రీలో చోటుచేసుకున్నాడు. అయితే ఇలాంటి విజయ్ దేవరకొండ కెరియర్ లో కూడా ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. ఏ రంగంలోనైనా ఒడిదురుకులనేవి ఉంటాయి కానీ సినిమా రంగంలో హిట్టు ఫ్లాపు మధ్య ఎందరో జీవితాల్లో మార్పు తెచ్చేస్తుంది. ఒక సినిమా ( When Vijay Deverakonda movie flopped ) హిట్, ప్లాప్ వెనుక కేవలం హీరోకి మాత్రమే కాకుండా ఇంకా ఆ సినిమాతో ముడిపడి ఉన్న చాల మంది జీవితాలకు ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే సినిమా హిట్ అయ్యినవాళ్లు ఆనందిస్తే.. దాని వలన ఆ పోటీ తట్టుకోలేక ఇంకొకరి సినిమా ప్లాప్ అయ్యే పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తాది.
విజయ్ దేవరకొండ సినిమా స్లాప్ అవ్వగానే ఒక హీరో చాలా ఆనందిస్తాడంట. విజయ్ దేవరకొండ సినిమా ఎప్పుడు ఫ్లాప్ అవుతదా అని ఎదురు చూస్తూ.. అది ఫ్లాప్ టాక్ రాగానే తన తోటి హీరోల్ని పిలిచి గ్రాండ్ గా పార్టీ ఇస్తాడంట. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు నిఖిల్ సిద్దార్థ. విజయ్ దేవరకొండ అంటే నిఖిల్ కి అస్సలు పడదని అంటున్నారు. సినిమా ఫ్లాప్ అవ్వగానే ఆనందంతో పార్టీ ఇచ్చి అందరితో సంబరాలు చేసుకుంటాడని, అప్పట్లో విజయ్ దేవరకొండ ట్విట్టర్ లో పబ్లిక్ గానే ఈ విషయాన్నీ చెప్తూ ట్వీట్ వేసాడు, దానికి నిఖిల్ కూడా కౌంటర్ ఇచ్చాడు. వాళ్లిద్దరూ ఎందుకు అలా కౌంటర్లు ఇచ్చుకున్నారో తెలీదు కానీ, ఇప్పుడు నిఖిల్ సిద్దార్థ్ కూడా మంచి పొజీషన్ లోనే ఉన్నాడు. కాబట్టి అసలు వాళ్ళిద్దరి మధ్య అలంటి బేధ భావాలూ ఉండిఉండవని కొందరు నెటిజనులు వాపోతున్నారు.