Home Cinema Rajamouli : రాజమౌళి తీయబోయే మహాభారతం లో మన హీరోలకి ఇచ్చే రోల్స్.. ద్రౌపది కోసం..

Rajamouli : రాజమౌళి తీయబోయే మహాభారతం లో మన హీరోలకి ఇచ్చే రోల్స్.. ద్రౌపది కోసం..

netizens-comment-on-rajamouli-mahabharatham-movie

Rajamouli : రాజమౌళి ఒక దర్శకుడిగా ఎంత పెద్ద విజయాన్ని సాధించాడో మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసి.. తెలుగువాడి ( Netizens comment on Rajamouli Mahabharatham ) సత్తాని నాటు నాటు అంటూ కేక పెట్టించాడు. అలాంటి దర్శకుడు సినిమాలో నటించాలని పెద్ద పెద్ద స్టార్ హీరోల నుంచి అతి చిన్న సామాన్యమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా తహతహలాడడం అనేది చాలా సహజం. రాజమౌళి ఒక సినిమా తీయాలని అనుకుంటే ఆ సినిమా కథని మూలాల నుంచి చూసుకొని.. చక్కగా రాసుకొని అందులో ప్రతి క్యారెక్టర్ దానికి ఎలాంటి ఆర్టిస్ట్ అయితే బాగుంటాడో చూసుకొని సహనంగా ఎంతో సమయాన్ని తీసుకొని ఒక అద్భుతమైన అనుభూతిని కలిగేలా సినిమాని చిత్రీకరిస్తాడు.

netizens-comment-on-rajamouli-mahabharatham-movie

బాహుబలి సినిమాతో భారతదేశం మొత్తం ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచం మొత్తం తన ప్రతిభని చాటుకున్న రాజమౌళి తీయబోయే నెక్స్ట్ సినిమా ఏమిటి? ఎలా ఉంటాది? ఎవరితో తీస్తాడు? అనే దానిపై ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతూనే ఉంటాయి. రాజమౌళి ఒకసారి మాటల్లో నాకు ఎప్పటికైనా మహాభారతం తీయాలని కోరిక అని అన్నాడు. ఆ మాటను పట్టుకొని ఒక నెటిజన్ ఒక వీడియో తయారు చేశాడు. ఆ వీడియో ( Netizens comment on Rajamouli Mahabharatham ) ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అసలు రాజమౌళి మహాభారతం సినిమా తీస్తే అందులో ఏ క్యారెక్టర్ కి ఎవరు సూట్ అవుతారు అనేదానిపై అతను ఒక వీడియో చేశాడు. మహాభారతం సినిమాలో మహేష్ బాబుని కృష్ణుడిగా, ప్రభాస్ ని కర్ణుడిగా, జూనియర్ ఎన్టీఆర్ ని భీముడిగా, రానాని దుర్యోధనుడిగా, పవన్ కళ్యాణ్ ని ధర్మరాజుగా, రామ్ చరణ్ ని అర్జునుడిగా, బాలకృష్ణని పరశురాముడిగా, అల్లు అర్జున్ ని అశ్వద్ధామ గా, ఆదిశేషుని సహదేవుడిగా, ఏకలవ్యుడుగా సందీప్ ని..

See also  Devi Sri Prasad: దేవి శ్రీ ప్రసాద్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరో తెలుసా.??

netizens-comment-on-rajamouli-mahabharatham-movie

ఇలా వీళ్ళతో చిత్రీకరికొస్తే బాగుంటది అని ఒక వీడియో చేయగా.. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరోపక్క కొందరు రాజమౌళి మామూలు సినిమాలు తీస్తే ఒక్కొక్క సినిమాకి రెండేళ్లు తీసుకునే రాజమౌళి ఇప్పుడు మహాభారతం గాని తీశాడంటే పది భాగాలుగా తెస్తాడు. ఒక్కొక్క భాగం రెండు సంవత్సరాలు ( Netizens comment on Rajamouli Mahabharatham ) తీసుకుంటే పది భాగాలకు 20 సంవత్సరాలు.. అంటే మన హీరోలు అందరూ ముసలోళ్ళు అయిపోతారు గనుక.. అప్పుడు సినిమా ఎలా కంప్లీట్ అవుతది అని సరదాగా కామెంట్లు చేసుకుంటున్నారు. ఆ వీడియో చూసి కొందరు లేదు లేదు ధర్మరాజుగా పవన్ కళ్యాణ్ సూట్ అవ్వడు, ధర్మరాజుగా బాలకృష్ణ అయితే బాగుంటాడు. అలాగే కృష్ణుడిగా మహేష్ బాబుకంటే కృష్ణుడిగా పవన్ కళ్యాణ్ అయితే బాగుంటాడు అంటూ..

See also  Prabhas : ప్రభాస్ పుట్టినరోజుకి ఆ ముగ్గురు హీరోయిన్స్ తో కలసి.. అసలు విషయం బయటపడింది..

netizens-comment-on-rajamouli-mahabharatham-movie

ఎవరి అభిమానులు వాళ్ళ హీరోని ఏ రూపంలో చూడాలని ఆశిస్తే.. ఆ రూపంలో ఆ హీరోనే బాగుంటాడు అంటూ తిరిగి కామెంట్లు చేస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే కొంతమంది నెటిజనులు.. ఏ పాత్రకి ఏ హీరో బాగుంటాడో చెప్పాడు గాని అసలు ద్రౌపది పాత్రకి ఏ హీరోయిన్ బాగుంటది అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ద్రౌపతి పేరు సరదాగా కామెంట్లు చేస్తూ ఒకరికి ఒకరు షేర్లు చేసుకుంటూ ఈ వీడియోని విపరీతంగా వైరల్ చేసుకుంటూ వస్తున్నారు. ఏది ఏమైనా రాజమౌళి మహాభారతం సినిమాను తీస్తాడా లేదా అనేది తెలియదు గానీ అసలు రాజమౌళి మహాభారతం సినిమా తీస్తే ఎలాంటి కిక్ ఉంటది అనేది మాత్రం నెటిజనులు బాగా ఒకరితో ఒకరు కామెంట్లు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు.