Custody : అక్కినేని నాగచైతన్య హీరోగా, కృతి శెట్టి హీరోయిన్ గా, వెంకట్రావు దర్శకత్వంలో రూపొందిన కస్టడీ సినిమా మే 12వ తేదీ శుక్రవారం నాడు ప్రేక్షకులుగా ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. బంగార్రాజు సినిమా తర్వాత నాగచైతన్య, కృతి శెట్టి కలిసి నటించబోతున్న రెండవ సినిమా ఇది. ఈ సినిమాపై ( Do you know what is the target of the Custody movie? ) అక్కినేని అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. కస్టడీ సినిమా టీజర్ మరియు ట్రైలర్ లు అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడంతో అక్కినేని అభిమానులు ఈ సినిమాని ఒక స్థాయిలో ఊహించుకుంటున్నారు.
అలాగే సినీ అభిమానులు కూడా ఈ కస్టడీ సినిమాపై కొన్ని అంచనాలను వేసుకుంటున్నారు. ఈ సినిమాలో అరవిందస్వామి, ప్రియమణి, శరత్ కుమార్ మొదలగు వారు ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై, శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ కి ( Do you know what is the target of the Custody movie? ) ముందే దాని రిజల్ట్ తెలియక ముందే బిజినెస్ మాత్రం చాలా బాగా జరిగింది. నాగచైతన్య కస్టడీ సినిమాకి ముందు వచ్చిన.. థాంక్యూ సినిమా ప్రేక్షకులను పెద్దగా సంతృప్తి పరచలేకపోయింది. అయినప్పటికీ దాని తర్వాత రిలీజ్ అవుతున్న కస్టడీ సినిమాకు మాత్రం మంచి బిజినెస్ జరిగింది.
నైజాంలో ఏడున్నర కోట్లకు ఈ సినిమా రైట్స్ అమ్మగా.. అలాగే సీడెడ్ లో 2:30 కోట్లకు.. తెలుగు రాష్ట్రాల మొత్తం మీద 18 కోట్ల 20 లక్షల బిజినెస్ జరిగింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా 21 కోట్ల 80 లక్షల బిజినెస్ జరిగింది. ఈ సినిమా తమిళ్ వర్షన్ తో కలిపి ప్రపంచ వ్యాప్తంగా 25 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది. మరి ఇంత ( Do you know what is the target of the Custody movie? ) స్థాయిలో ఈ సినిమా కలెక్షన్స్ రాబడుతుందా రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది రేపు సినిమా చూసిన తర్వాత ద్రాక్షకుల ద్వారా తెలుసుకోవాలి. ఈ సినిమా ట్రైలర్ చూస్తే.. సినిమాలో పోలీస్ గా నాగచైతన్య మంచి పెర్ఫామెన్స్ ఇవ్వబోతున్నట్టు అనిపిస్తుంది.
ఈ సినిమాలో ప్రియమణి పాత్ర ముఖ్యమంత్రి పాత్ర అని అర్ధమవుతుంది. ముఖ్యమంత్రికి సెక్యూరిటీ కోసం పంపిస్తే.. ఆమె బండిని ఆపుతావా? అనే డైలాగ్ తో ట్రైలర్ కొంత హైప్ కి వెళ్ళింది. చైతు లవర్ కృతి శెట్టికి బలవంతంగా వేరే వాళ్ళతో పెళ్లి జరిపించాలని చూడటం, దానిని ఆపే క్రమంలో చైతు ఉండటం చూస్తే.. సినిమాలో లవ్ ట్రాక్ మీద కూడా కొంత ఆశక్తి కనిపిస్తుంది. అలాగే ముఖ్యమైన పాత్ర అరవింద్ స్వామిని విలన్ గా చూపిస్తున్నారు. అరవింద్ స్వామి నటన ఎలా ఉంటాదో మనం కొత్తగా చెప్పుకోనక్కరలేదు. మరి ఇన్ని ప్లస్ పాయింట్స్ అయితే బాగానే కనిపిస్తున్నాయి కాబట్టి మంచి రిజల్ట్ ఉంటాదని ఆశిద్దాం..