Home Cinema Kushboo: ఒక్క సారైనా నా జీవితంలో ఆ హీరో తో రొమాన్స్ చెయ్యాలనుంది – ఖుష్బూ..

Kushboo: ఒక్క సారైనా నా జీవితంలో ఆ హీరో తో రొమాన్స్ చెయ్యాలనుంది – ఖుష్బూ..

Kushboo: అలనాటి అందాల తార ప్రముఖ నటి కుష్బూ గురించి మనందరికీ ఆమె సుపరిచితమే.. దేశంలో ఏ నటికీ లేని ఓ ప్రత్యేకమైన గుర్తింపు తనకు దక్కింది అది ఏంటంటే ఏకంగా తమిళనాడు ప్రజల చేత ప్రత్యేకంగా గుడి కట్టించుకున్న ఏకైక నటి ఈమె.. కేవలం తన అందచందాలతో అంతకుమించి తన నటనతో ఇప్పుడు కూడా అటు తమిళ ప్రేక్షకులను, ఇటు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ అలరిస్తుంది కుష్బూ. ఇక తన సినీ జీవితం పరిచయమైంది మాత్రం తెలుగు చిత్ర పరిశ్రమలోనే ఆ తర్వాతే తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. ఒకానొక సమయంలో తమిళ చిత్ర పరిశ్రమలో ఆమెకు మించిన హీరోయిన్ లేదు అంటే అది నమ్మశక్యం కాని విషయం..

See also  NTR: ఎన్టీఆర్ తిరస్కరించిన స్టొరీ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అల్లు అర్జున్. మరి ఆ సినిమా ఏంటో తెలుసా? 

senior-actress-kushboo-reveals-she-wants-to-do-that-with-that-hero

ఎందుకంటే ఆమె నటించిన అన్ని సినిమాలు దాదాపు బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన చిత్రాలే.. అలా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన ఈ హీరోయిన్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో నటిస్తున్నది. ఈమె నటించిన తాజా చిత్రం రామబాణం మే 5న విడుదలకు సిద్ధమైంది. ఇక ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ లో ఫుల్ బిజీ అయిపోయింది. దాంతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కుష్బూ కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. ఇక ఈ చిత్రం శ్రీవాస్ దర్శకత్వంలో డింపుల్ హయత్ హీరోయిన్ గా గోపీచంద్ హీరోగా వస్తున్న ఈ చిత్రం మే 5న విడుదల కాబోతుంది.

See also  Manchu Lakshmi: హాలీవుడ్ యాక్షన్ హీరో తో మంచి లక్ష్మీ ప్రసన్న పెళ్లి.? షాక్ లో టాలీవుడ్ 

senior-actress-kushboo-reveals-she-wants-to-do-that-with-that-hero

ఈ చిత్రం యొక్క ప్రమోషన్ లో భాగంగా కుష్బూ మాట్లాడుతూ నా జీవితంలో ఒక్కసారి అయినా చిరంజీవితో రొమాన్స్ చేయాలన్న తన కోరికను బయటపెట్టారు. చిరంజీవిలో చూసి నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఆయన ఒక లెజెండ్ ఎంతో మానవతా దృక్పథం కలిగిన వ్యక్తి, ఎంత ఎదిగినప్పటికీ ఒదిగి ఉండాలని మనస్తత్వం అతని సొంతం.. అదేకాక చేసే పని మీద ఎంతో ఫ్యాషన్ కలిగి ఉంటాడు.. వయసుతో సంబంధం లేకుండా ఇప్పటికీ ప్రతి రోజు ఏదో నేర్చుకోవాలనే తపన ఆయనలో కనిపిస్తుంది.. ఇక నేను మెగాస్టార్ కదా నేను ఏం చేసినా జనాలు ఏమనరు లే అని ఆయన ఎప్పుడూ అనుకోరు..

senior-actress-kushboo-reveals-she-wants-to-do-that-with-that-hero

కొత్తగా ఏదైనా చేసి చూపించాలనే ప్రయత్నం చేస్తుంటాడు అని చిరు పై ప్రశంసల వర్షం కురిపించింది. నాకు చిరంజీవితో రొమాన్స్ చేయాలని కోరిక ఇప్పటికీ ఉందంటూ ఆమె తెలిపింది. కాగా గతంలో స్టాలిన్ సినిమాలో ఆయనతో కలిసి నటించినప్పటికీ అక్కడ సిస్టర్ క్యారెక్టర్ చేసింది. ఇక ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఒక కమర్షియల్ యాడ్ కూడా చేశారు. దానికి మంచి స్పందన అయితే దక్కింది. ఆయనతో కలిసి పని చేయడానికి ఓ మంచి స్క్రిప్ట్ కోసం చూస్తున్నాను. మెచ్యూర్ లవ్ స్టోరీ ఫ్యామిలీ రావాలని ఏదైనా దొరుకుతుందేమోనని ఎదురు చూస్తున్నాను అంటూ ఆమె వెల్లడించింది. చిరు తో చివరగా చేయాలని ఉంది అదేనా చివరి కల అంటూ ఆమె తన మనసులోని మాట చెప్పింది. (Kushboo)