Home Cinema Agent: “ఏజెంట్” చిత్రం భారీ డిజాస్టర్‌.. 37 కోట్లకు వచ్చింది ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.!

Agent: “ఏజెంట్” చిత్రం భారీ డిజాస్టర్‌.. 37 కోట్లకు వచ్చింది ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.!

Akhil Akkineni Agent: అక్కినేని నాగార్జున తనయుడు అక్కినేని అఖిల్ నటించిన తన ఐదవ చిత్రం ఏజెంట్ ఇటీవలే విడుదల అయిన సంగతి అందరికి తెలిసిందే.. ఇక ఈ చిత్రాన్ని డైరెక్టర్ సురేందర్ రెడ్డి హై వోల్టేజ్ స్రై యాక్షన్ థ్రిల్లర్ గా నిర్మించినటువంటి సంగతి మనకు తెలుసు. ఇక ఈ చిత్రంలో నటించిన సాక్షి వైద్య మనందరికీ హీరోయిన్ గా పరిచయమైంది. ఇందులో ముఖ్యమైన పాత్రలో పాల్గొన్నటువంటి వారు మమ్ముట్టి, డినో మోరియో, విక్రమ్ జీత్, ప్రముఖులు అదే విధంగా స్పెషల్ సాంగ్ లో ఆడి పాడి మెరిపించింది ఊర్వశి రౌతెలా..

akhil-akkineni-agent-movie-box-office-collections

ఇక ఈ చిత్రం ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర, అజయ్ సుంకర, దీపా రెడ్డి తదితరులు నిర్మించారు. ఈ చిత్రం పోయిన నెల ఏప్రిల్ 28వ తారీకున విడుదలైనప్పటికీ నెటిజన్స్ అంచనాలను మాత్రం చేరుకోలేకపోయింది. ఇక ఈ చిత్రం స్ప్రై థ్రిల్లర్ కావడంతో యాక్షన్ ఎపిసోడ్స్ చాలా భారీగానే ప్లాన్ చేసినప్పటికీ, అదే విధంగా అఖిల్ కూడా ఈ చిత్రం కోసం ఎంతగానో కష్టపడ్డప్పటికీ.. అందరికీ ఇట్టే అర్థం అయిపోయింది. ఇది రొటీన్ కథకు రొటీన్ కథనం ఉండడమే దీంట్లో చాలా మైనస్ గా మారిపోయింది. ఇక ఈ చిత్రం విడుదలైన తొలి ఆట నుంచి చాలా నెగటివ్ టాక్ తో వెళ్లడంతో అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయింది. ఆఖరికి అక్కినేని అభిమానులకు కూడా ఏజెంట్ చిత్రం మురిపించలేకపోయింది.

See also  Sarath Babu: తీవ్రమైన అనారోగ్యానికి గురైన శరత్ బాబు హుటా హుటిన ఆస్పత్రికి తరలింపు..

akhil-akkineni-agent-movie-box-office-collections

సినిమా స్పందన అనుకున్నంత అనుకూలంగా లేకపోవడం వల్లనే ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం పాలు అయింది. ఇక ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా 36 కోట్లకు పైగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగడంతో 37 కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ లోకి రంగంలోకి దిగింది. కానీ బాక్సాఫీస్ వద్ద మూడు రోజులు పూర్తి చేసుకున్నప్పటికీ కూడా కనీసం 10 కోట్లు కూడా వసూలు చేయలేకుండా బోర్లా బొక్కలో పడింది. మొదటి రోజే అనుకున్నంత స్థాయిలో అంచనాలను రాబట్టలేక పోయింది ఇక రెండవ రోజు కంప్లీట్ గా డౌన్ ఫాల్ మూటగట్టుకుంది.

See also  Dhanush : ధనుష్ ని ఐశ్వర్య పెళ్లి చేసుకోవడానికి అసలు కారణం అదా?

akhil-akkineni-agent-movie-box-office-collections

మూడవ రోజు ఆదివారం అయినప్పటికీ అనుకూల వాతావరణం ఏర్పడుతుందనుకున్నారు కానీ ఏమాత్రం దాని ప్రభావం మనకు కనిపించలేదు. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద మూడు రోజులు పూర్తి అయ్యే సమయానికి తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 5.10 కోట్ల రేంజ్ లో షేర్ రాబట్టి సరిపెట్టుకుంది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ గా నిలబడాలంటే ఇప్పటివరకు వచ్చిన వసూలు కాకుండా ఇంకా 30.76 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. కానీ అంత రేంజ్ లో వసూళ్ళను రాబట్టాలంటే అది చాలా కష్టమని బాక్సాఫీస్ వద్ద ఏజెంట్ (Akhil Akkineni Agent) చిత్రం డిజాస్టర్ చిత్రంగా మిగలడం ఖాయమనే సినీ ప్రముకులు తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు.