Home Cinema Naga Chaitanya: మొట్ట మొదటి సారి సమంతతో విడాకుల విషయంలో నోరు విప్పి సంచలనమైన విషయాలు...

Naga Chaitanya: మొట్ట మొదటి సారి సమంతతో విడాకుల విషయంలో నోరు విప్పి సంచలనమైన విషయాలు వెల్లడించిన చైతు..

Naga Chaitanya About Divorce: అక్కినేని వారసునిగా అక్కినేని నాగార్జున తర్వాత నాగచైతన్య సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్నప్పటికీ సరైన హిట్ ఇప్పటి వరకు దొరకడం లేదు. ఇక ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా మే 12 వ తారీఖున విడుదల కాబోతున్న తాజా చిత్రం కస్టడి. ఇక నిజం చెప్పాలంటే ఇటు నాగార్జున అటు కృతి శెట్టి ఆశలన్నీ ఇక ఈ చిత్రం పైనే పెట్టుకొని ఉన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో వీళ్ళిద్దరూ సినిమా ప్రమోషన్ లో భాగంగా చాలా బిజీ బిజీ అయ్యారు.

See also  Dhanush - Aishwarya: రజనీకాంత్ కూతురు ధనుష్ ను పెళ్ళి చేసుకుంది ఆ స్టార్ హీరో పై పగ తీర్చుకోవడం కోసమేనా.?

naga-chaitanya-gives-full-clarity-why-he-took-divorce-with-wife-samantha

అందులో భాగంగానే నాగచైతన్య తాజాగా యూట్యూబ్ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో నాగచైతన్య కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. యూట్యూబ్ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో నాగచైతన్య ట్రూత్ ఆర్ డేర్ గేమ్ లో పాల్గొని అందరినీ అలరింప చేశాడు. అందులో భాగంగానే యూట్యూబ్ యాంకర్ అడిగిన ఓ ఆసక్తికరమైన ప్రశ్న అదేంటంటే.. మీరు మీ నిజ జీవితంలో ఎప్పుడైనా పశ్చాత్తాప పడ్డ రోజులు ఉన్నాయా.? అని యాంకర్ అనగా అలాంటివి అయితే ఏమీ లేవని.. నా జీవితంలో జరిగిన ప్రతి సంఘటన ఒక మర్చిపోలేని గుణపాఠమే అంటూ సమాధానం ఇచ్చాడు.

See also  Mangalavaaram : మంగళవారం మేకింగ్ వీడియో లో మంచం మీద పాయల్.. ఆ సీన్ వైరల్..

naga-chaitanya-gives-full-clarity-why-he-took-divorce-with-wife-samantha

అలాగే మీరు సినిమాల పరంగా నైనా లేదా డైవర్స్ తీసుకున్నాక ఐనా బాధపడ్డ విషయాలు ఉన్నాయా అని యాంకర్ మళ్ళీ ప్రశ్నించింది. దానికి నాగచైతన్య బదులిస్తూ నా జీవితంలో నేను రెండు, మూడు సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు ఎంతో బాధపడ్డానంటూ నాగచైతన్య సినిమాలపరంగా ఈ విషయానికి సమాధానం ఇచ్చాడు తప్పితే.. సమంతతో డివోర్స్ (Naga Chaitanya About Divorce) తర్వాత జరిగిన విషయం గురించి మాత్రం ఒక్క మాట పెదవి నుండి బయట పెట్టలేదు. దాంతో ప్రస్తుతం నాగచైతన్య యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

naga-chaitanya-gives-full-clarity-why-he-took-divorce-with-wife-samantha

ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య, సమంత పట్టుమని పది కాలాలు కూడా లేకుండా కేవలం నాలుగు సంవత్సరాలకే వీళ్లిద్దరు విడిపోయి ఎవరి దారు దారి వారే చూసుకున్నారు. ఇక ఇటీవలే నాగచైతన్య పై కుప్పలు తిప్పలుగా వస్తున్న వార్తలు నాగచైతన్య శోభిత ధూళిపాలతో ప్రేమాయణం నడుపుతున్నాడని ఎన్నో రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వార్తలకు తగ్గట్టే వీళ్ళు ఇప్పటికే చాలాసార్లు కెమెరా కంట పడడం అవి చాలా వైరల్ గా మారడం అయితే జరిగాయి. ఇందులో భాగంగానే నాగచైత రెండో భార్య శోభిత దూళిపాల నే అంటూ నెటిజన్స్ ఇప్పటికే ఎన్నోసార్లు ఈ విషయాన్ని వైరల్ చేసిన సంఘటన మనందరికీ తెలిసిందే..