Home Cinema Rashmika: ఎన్ని వివాదాల్లో ఇరుక్కున్నప్పటికీ హీరోయిన్లు అందరు కుల్లుకునేలా సరికొత్త రికార్డు సృష్టించింది గా..

Rashmika: ఎన్ని వివాదాల్లో ఇరుక్కున్నప్పటికీ హీరోయిన్లు అందరు కుల్లుకునేలా సరికొత్త రికార్డు సృష్టించింది గా..

Rashmika New Record: కన్నడ చిత్ర పరిశ్రమలో మొదటగా అడుగుపెట్టినప్పటికీ ఆ తర్వాత తెలుగులో అవకాశాలు లభించడంతో తెలుగు చిత్ర పరిశ్రమలో రాణిస్తూ మొదటి చిత్రంతోనే మంచి స్పందన దక్కించుకొని ఆ తర్వాత వరుస సినిమాల్లో నటిస్తూ అనది కాలంలోనే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ హోదాను దక్కించుకున్న కన్నడ సోయగం రష్మిక మందన. ఇక మనకు తెలిసిందే పుష్ప సినిమాతో నేషనల్ వైడిగా ఎంత పాపులాటి దక్కించుకుందో ఇంకేముంది ఆ తర్వాత నేషనల్ క్రష్ గా తన ముద్ర పదులపరుచుకుంది..పుష్ప సినిమాతో వచ్చిన క్రేజ్ సౌత్ లోనే కాకుండా నార్త్ లోను బ్యాక్ టు బ్యాక్ ఆఫర్ల పరంపర కొనసాగించింది. ఊహించినంత స్థాయిలో అయితే అవకాశాలు రాబట్టుకుంది గాని అనుకున్నంత స్థాయిలో హిట్స్ తో రాణించలేకపోయింది.

rashmika-mandanna-has-created-a-new-record-than-all-south-heroines

ఎందుకంటే రష్మికకు గ తేడాది అన్ని చేదు అనుభవాలే తరచు ఏదో ఒక వివాదాల్లో ఇరుక్కుంటూనే సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారుతూ మన ముందు ప్రత్యక్షమవుతుంది. ఎందుకంటే అప్పట్లో ముఖ్యంగా కాంతార వివాదంతో ఈ అమ్మడు పై ఏ స్థాయిలో నెగిటివిటీ పెరిగిందో మనమందరం చూసాం.. సొంతగడ్డ అయిన కన్నడలోనే రష్మికను బ్యాన్ చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఇలా ఎప్పుడూ ఎన్నో వివాదాల్లో చిక్కుకుని ఎన్నో విమర్శలు ఎదురైనప్పటికీ రష్మికకు మాత్రం క్రేజ్ తగ్గడం లేదని చెప్పాలి. ఎందుకంటే ఆమెకు వచ్చే ఆఫర్లు అలాగే ఉన్నాయి ఆమె నటించే సినిమాలు పెరుగుతూనే ఉన్నాయి..

See also  Allu Arjun: ఏంటి.! అల్లు అర్జున్ హీరోగా సినిమాల్లోకి రాకముందుకు ఆ పనులు చేస్తూ పైసలు సంపాదించేవాడా.?

rashmika-mandanna-has-created-a-new-record-than-all-south-heroines

మరోవైపు సోషల్ మీడియా పరంగా ఫాలో అయ్యే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ పోతుంది తప్ప తగ్గడం లేదు. ఇక ఇదే క్రమంలో రష్మిక…ఎన్నో వివాదాలు ఇరుక్కున్నప్పటికీ హీరోయిన్లందరూ కుళ్ళుకునేలా ఓ సరికొత్త రికార్డు సృష్టించింది. అదేంటంటే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే రష్మిక అంతే స్థాయిలో భారీ ఫాలోయింగ్ పెంచుకుంటూ మరింత యాక్టివ్ గా దూసుకుపోతుంది. తాజాగా సౌత్ లో హీరోయిన్లలోనే అత్యధిక ఫాలోవర్స్ కలిగిన తొలి హీరోయిన్ గా తన రికార్డును కైవసం చేసుకుంది. వచ్చి అతి తక్కువ కాలం అయినప్పటికీ సీనియర్ హీరోయిన్లను తలదన్నేలా ఈ అమ్మడికి సోషల్ మీడియాలో యమక్రేజ్ పెరిగింది. ఏకంగా సమంత, పూజా హెగ్డే వాళ్ళను సైతం దాటుకుంటూ ముందుకు వెళ్ళింది. ఇక ఇంస్టాగ్రామ్ లో ఈ అమ్మడికి 38 మిలియన్లు అదే విధంగా ట్విట్టర్లో 4.5 ఫాలోవర్స్ ఉన్నారు ఈ మొత్తం కలిపితే 42.5 మిలియన్ల ఫాలోవర్స్ ను రష్మిక తన సొంతం చేసుకుంది. (Rashmika New Record)

See also  Mirchi Madhavi: మిర్చి మాధవిని సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తి దారుణంగా మోసం చేశాడు.. ఇంతకు ఎవరు.??

rashmika-mandanna-has-created-a-new-record-than-all-south-heroines

అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆమె క్రేజీ స్థాయిలో ఉందని ఇట్టే అర్థమవుతుంది. ఇక రష్మిక తర్వాత సమంతకు 26.4 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు ఆ తర్వాత కాజల్ 25.4 మిలియన్లు, పూజా హెగ్డే కు 23.5, రకుల్ ప్రీత్ సింగ్ 23.1, తమన్న 20.7, శృతిహాసన్ కు 22.9 ఫాలోవర్స్ ఉన్నారు. మరదే విధంగా సినిమాల విషయానికొస్తే టాలీవుడ్ లో అల్లు అర్జున్ జోడిగా ప్రస్తుతం పుష్ప 2 లో నటిస్తుంది. ఇవే కాకుండా బాలీవుడ్ లో రన్ వీర్ కపూర్ సరసన యానిమల్ అనే చిత్రం చేస్తుంది. ఇక ఇటీవలే రెయిన్ బో లేడీ ఓరియంటెడ్ చిత్రానికి ఈ అమ్మడు సైన్ చేసింది. ఇంకా ఈ చిత్రాలన్నీ పాన్ ఇండియా చిత్రాలే కావడం విశేషం. ఒక సినిమా తో రాత్రికి రాత్రే స్టార్ సెలబ్రిటీ అవ్వడం అంటే అది రష్మిక మందన అని చెప్పాలి.