Pooja Hegde Wants RamCharan: తన తొలి సినిమా తోనే తెలుగు ప్రేక్షకులను అలరించిన ముద్దుగుమ్మ పూజా హెగ్డే ఆ తర్వాత వరుస చిత్రాలలో అవకాశాలు లభిస్తూ స్టార్ హీరోల సరసన జతకట్టి స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. అలవైకుంఠపురం చిత్రం నుంచి మొదలు దువ్వాడ జగన్నాథం వరకు వెనుతిరిగి చూసుకోకుండా అవకాశాల పరంపర కొనసాగించింది. అలాంటి స్టార్ హోదాను దక్కించుకుంది పూజ హెగ్డే. అప్పట్లో పూజ హెగ్డే ఏ సినిమాలో నటిస్తే ఆ సినిమా మంచి హిట్ టాక్ సొంతం చేసుకునేది. దాంతో అందరూ అమ్మడిని గోల్డెన్ లెగ్ అని పిలవడం మొదలుపెట్టారు. కానీ ఆ తర్వాత మనందరికీ తెలిసిన విషయమే గత ఏడాది నుంచి వరుస ఫ్లాప్ ను ఎదుర్కొంటుంది.
ఆచార్య, బీస్ట్, రాధే శ్యామ్ వంటి వరుస చిత్రాలు డిసాస్టర్ గా నిలవడంతో వచ్చిన పేరు కాస్తా పోయి ప్రస్తుతం అందరూ ఈమెను ఐరన్ లెగ్ అని పిలవడం మొదలుపెట్టారు. వరుస ప్లాపులు ఎదుర్కొంటున్నప్పటికీ ఈ అమ్మడికి అవకాశాల కొదవలేదు. ఇక ఇదే నేపథ్యంలో మహేష్ బాబు సరసన ఎస్ ఎస్ ఎం బి 28 సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఇటీవల విడుదలైన హిందీ చిత్రం కీసిక భాయ్ కీసిక జాన్ సినిమాలో సల్మాన్ ఖాన్, వెంకటేష్ సరసన కలిసి నటించిన ఈమె ఇటీవల చిత్రం విడుదలైంది. ఇక ఇదే కాకుండా అగ్ర హీరోలైన మహేష్ బాబు, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి హీరోల అందరితో ఈ అమ్మడు పలు చిత్రాల్లో నటించింది.
కానీ రామ్ చరణ్ తో మాత్రం ఇంతవరకు పూర్తి సినిమాల అవకాసం మాత్రం దక్కించుకోలేకపోయింది. చెప్పాలంటే ఆచార్య సినిమాలో వీరిద్దరూ కలిసి నటించినప్పటికీ ఈమె ఆ చిత్రంలో చాలా కొద్ది సేపు స్క్రీన్ పై మనకు కనబడుతుంది. మరదే విధంగా మరోవైపు రామ్ చరణ్ తో రంగస్థలం చిత్రంలో జిగేల్ రాణి పాటలో మాత్రమే కనిపింది. ఈ అమ్మడు ఇటీవల నటించిన హిందీ చిత్రం కీసికా భాయ్ కిసీ కా జాన్ సాంగులో కేమియో రోల్ లో మాత్రమే కనిపించాడు రామ్ చరణ్. ఇలా చిన్నచిన్న టైమింగ్స్ లో తప్పితే పూజా హెగ్డే, రామ్ చరణ్ పూర్తి స్థాయిలో నటించే అవకాశం మాత్రం.
ఇంత వరకు పూజా హెగ్డే కి మాత్రం దక్కలేదు. ఇక ఇటివలే ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న పూజ హెగ్డే ఈ టాపిక్ గురించి ప్రస్తావించగా ఆమె మాట్లాడుతూ రామ్ చరణ్ (Pooja Hegde Wants RamCharan) నేను కలిసి పూర్తి సినిమా చేయాల్సి ఉందని తెలిపింది. ఇప్పటికీ మేము ఇద్దరం కలిసి ఎన్నో చిత్రాలు నటించినప్పటికీ జస్ట్ గెస్ట్ రూల్స్ మాత్రమే చేసాము. కానీ త్వరలో ఖచ్చితంగా రామ్ చరణ్ తో సినిమా చేయాలని అనుకుంటున్నానని తెలిపింది. కచ్చితంగా ఈ పని రామ్ చరణ్ తో చేస్తే తప్ప నా కోరిక తీరేలా లేదంటూ కచ్చితంగా ఓ చిత్రం రావాల్సిందే అంటూ కామెంట్లు చేసింది. ఇక పూజ హెగ్డే కోరిక మేరకు రామ్ చరణ్ ఆమెతో పూర్తిస్థాయి సినిమాలో చేస్తాడని మనం వేచి చూడాల్సిందే..