Rashmika Mandanna : చలో సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రష్మిక.. మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ తన ఖాతాలో వేసుకుంది. గీతగోవిందం సినిమాతో రష్మిక రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఛలో సినిమా నుంచి స్టార్ట్ అయిన ఆమె కెరియర్ ఎక్కడ కూడా ఆగకుండా మంచి ఊపు మీద ముందుకు వెళ్తూనే ఉంది. ఇటీవల వచ్చిన ( Rashmika Mandanna is being hated ) పుష్ప సినిమాతో రష్మిక పాన్ ఇండియా స్టార్ట్ అయ్యింది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ లాంటి స్టార్ డమ్ ఉన్న హీరో నటించే ఆ సినిమాలో ఆమె పాత్రకి చాలా ప్రాముఖ్యతను తెచ్చుకొని చాలా మంచి పేరు తెచ్చుకోవడంతో ఆ సినిమా సక్సెస్ తో పాటు రష్మికకి కూడా చాలా మంచి మంచి ఆఫర్స్ టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా వచ్చాయి.
అలాగే బాలీవుడ్ లో అవకాశాలు వచ్చినప్పటికీ వాటిని సక్సెస్ చేసుకోవడం అనేది కొంచెం కష్టమే అయినా కూడా తన క్రేజ్ ని నిలబెట్టుకోవడానికి కావలసిన ప్రయత్నాలు అన్ని చేసుకుంటుంది. ఇప్పుడు రష్మిక పుష్ప2 సినిమా షూటింగ్ లో చాలా బిజీగా ఉంది. అయితే ( Rashmika Mandanna is being hated ) ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రష్మిక కొన్ని సంచలమైన వ్యాఖ్యలు చేసింది. అవేమిటంటే రష్మిక సినిమా రంగంలో నటిస్తున్నందుకు తన తల్లిదండ్రులకు అసలు నచ్చదని వాళ్ళ తనను బాగా ఇప్పటికీ ఇంకా అసహ్యించుకుంటూ ఉంటారని.. అయితే దానికి కారణం కేవలం వాళ్లకి సినిమా రంగంపై సరైన అవగాహన లేకపొవడమే తప్ప ఇంక అంతకంటే ఏమీ లేదని చెప్పింది. అలాగే సినిమా రంగంలో తన అడుగు పెట్టినప్పుడు వాళ్ళ కుటుంబం చాలా కష్టాల్లో ఉందని..
ఆర్థికంగా తన తల్లిదండ్రులు చాలా కష్టాలు పడ్డారని ఇప్పుడు ఇంక వాళ్లకు అలాంటి అవసరం లేదని వాళ్ళు పడిన కష్టాలు ఇంక చాలని కొంచెం ఎమోషనల్ గా ఫీల్ అవుతూ చెప్పుకుంటూ వచ్చింది. అలాగే తన తల్లిదండ్రుల పడ్డ కష్టాలను గుర్తుచేసుకొని ఇంకా ఇంకా ఎదిగి ఇంకా మంచి సక్సెస్ సాధించి వాళ్లకు మంచి పేరు తీసుకురావాలని తాను ఎంత ( Rashmika Mandanna is being hated ) ఎదిగితే వాళ్ళు అంత హ్యాపీగా బతుకుతారని చెప్పింది. ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. ఆమె అభిమానులు బాధపడుతున్నారు. తల్లిదండ్రుల గురించి కుటుంబం గురించి ఒక ఆడపిల్ల అంత బాగా ఆలోచిస్తూ తన కెరియర్ లో వస్తున్న కష్ట నష్టాలను ఎదుర్కొంటూ సక్సెస్ బాటలో నడుచుకుంటూ వెళ్తున్న రష్మీక ని ఆమె తల్లిదండ్రులు అభినందనలు చెప్పాలి తప్ప అసహ్యించుకోకూడదని అంటున్నారు.
బహుశా రష్మిక తల్లితండ్రులకు అప్పట్లో సినిమా రంగం మీద అవగాహన లేనప్పుడు.. రష్మిక రంగంలో అడుగుపెట్టిన కొత్తల్లో అలాంటి భావన ఉండి ఉంటాది గాని.. ఈరోజు స్టార్ డండమ్ సంపాదించుకొని బాలీవుడ్ లెవెల్లో అవకాశాలు చేజిక్కించుకుంటూ పాన్ ఇండియా లెవెల్లో సినిమాల్లో నటిస్తూ.. ఇంకా పుష్ప2 ఎలాంటి గ్రాండ్ సక్సెస్ ని అందుకుంటాదో, దానితో రష్మిక పొజిషన్ ఇంకా ఎక్కడికి వెళ్తుందో ఊహించుకుంటున్న తరుణంలో.. ఆమె తల్లిదండ్రులు ఇంకా ఆమెను అసహ్యించుకుంటున్నారు అని అనుకోవడానికి అవకాశం లేదు. రష్మిక అప్పటి ఫీలింగ్ లోనే ఉండిపోయి ఉంటాది కానీ.. ఈరోజు నిజంగా గర్వంగా పదిమందికీ మా అమ్మాయి రష్మిక అని చెప్పుకునే స్థాయిలో రష్మిక ఉందని అలాంటి ఫీలింగ్ తో రష్మిక బాధపడకూడదని ఆమె అభిమానులు అందరూ వాపోతున్నారు.