Home Cinema Akkineni Akhil : కష్టమైనా కూడా చివరికి సిగ్గు వదిలేసి.. ఇప్పుడెవరి ప్రేమలో ఉన్నాడో ఓపెన్...

Akkineni Akhil : కష్టమైనా కూడా చివరికి సిగ్గు వదిలేసి.. ఇప్పుడెవరి ప్రేమలో ఉన్నాడో ఓపెన్ గా చెప్పేసిన అఖిల్..

akkineni-akhil-press-meet-for-agent-movie

Akkineni Akhil : అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమా ఏప్రిల్ 28 న రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమా పై అఖిల్ అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా గురించి అఖిల్ చాలా కష్టపడ్డాడని ( Akkineni Akhil Agent movie ) సినిమా చూడకముందే బాగా అర్ధమవుతుంది. ఏజెంట్ సినిమా ప్రమోషన్ కోసం అఖిల్ చాల ఇంటర్వ్యూ లు ఇచ్చాడు. ఇటీవల జరిగిన ఒక ప్రెస్ మీట్ లో అఖిల్ అడిగిన కొన్ని ప్రశ్నలకు అఖిల్ ఆశక్తికరమైన సమాధానాలు ఇచ్చాడు. అవేమిటో ఒకసారి చూద్దాం.. అసలు ఏజెంట్ సినిమా తియ్యాలని ఎందుకు అనుకున్నారు అని అడగగా.. అఖిల్ ఇలా చెప్పాడు..

akkineni-akhil-press-meet-for-agent-movie

తనకి యాక్షన్ మూవీస్ అంటే ఇష్టమని.. తన కెరియర్ లో మోస్ట్ ఎలిజిబుల్ బాచ్యులర్ సినిమా హిట్ అయినా కూడా తనకి ఏదో వెలితి ఉందని.. తనకిష్టమైన యాక్షన్ సినిమా చెయ్యాలని ఆలోచనలో ఎప్పుడు ఉంటాను అని అన్నాడు. లాక్ డౌన్ సమయంలో ఖాళీగా ఉన్నప్పుడు సురేందర్ రెడ్డి ని కలిసాను. ఆయన డిఫెరెంట్ స్టోరీ తో ( Akkineni Akhil Agent movie ) స్పై యాక్షన్ మూవీ చేద్దామని చెప్పగా అప్పుడు ఈ ఏజెంట్ సినిమా మొదలయ్యింది అని చెప్పాడు. అలాగే అఖిల్ బాడీ ఎనాలిసిస్ చేయడానికి హాలీవుడ్ లేదా బాలీవుడ్ హీరోలను ఫాలో అయ్యారా అని అడగగా.. లేదు ఒకరి బాడీ లా ఒకరికి రాదు. దాని కంటే దర్శకుడికి మన పాత్రకి ఎలాంటి బాడీ కావాలని కోరుకుంటే అలా మార్చుకోవడం మంచిదని అలా చేశాను అన్నాడు అఖిల్.

See also  Jr NTR : ఆ పొలిటీషియన్ కూతుర్ని ప్రేమించిన ఎన్టీఆర్ ఎవరి వలన లక్ష్మి ప్రణతిని పెళ్లి చేసుకున్నాడో తెలుసా?

akkineni-akhil-press-meet-for-agent-movie

ఏజెంట్ సినిమా చేసేటప్పుడు మీ ప్రిఫరెన్సెస్, లిమిటేషన్స్ ఏమిటని అడగగా.. ఏజెంట్ సినిమాలో నా పాత్ర కోతి లాంటిది. అంత క్రేజీగా నటించగలుతానా అని భయం. మరోపక్క ఈ సినిమాలో ప్రతీ క్షణం చాలా హై లో మాట్లాడాలి. అది నాకు చాలా కష్టం. నాకు చాల సిగ్గు ఎక్కువ, నేను అసలే సిగ్గరిని అందుకే భయపడ్డాను. కానీ నిమ్మదిగా పాత్రలో లీనం అయ్యే కొద్దీ అలవాటు పడ్డాను అని అన్నాడు. ఇంకా మీకు ఏ సినిమాలు అంటే ఇష్టం అని అడిగితే బాహుబలి 2 సినిమా అంటే తనకి చాల ఇష్టమని చెప్పాడు అఖిల్. ఆ సినిమాని లెక్కలేనన్ని సార్లు చూశానని, ఇంకా చూస్తూనే ఉన్నానని చెప్పాడు. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా పోకిరి ఇప్పటికి అఖిల్ 50 సార్లు చూశానని చెప్పాడు.

See also  Shobita Dhulipala: అక్కినేని ఇంటికి కోడలవ్వాలంటే సమంతలా శోభితకు అలాంటి కండీషన్ నాగార్జున పెట్టాడా.?

akkineni-akhil-press-meet-for-agent-movie

ఇంకా ఈ సినిమాలో పాత్రలు గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా హీరో మీద మాత్రమే కాకుండా ముగ్గురి మీద నడుస్తాదని చెప్పాడు. ఈ సినిమాలో మమ్ముట్టి గారి లాంటి పెద్ద ఆర్టిస్ట్ ఎందుకు తీసుకున్నామో మీకు సినిమా చూసిన తర్వాత అర్ధమవుతాదని చెప్పాడు. ఇక అఖిల్ మమ్ముట్టి పాత్రతో ప్రేమలో పడిపోయానని ఓపెన్ గా చెప్పాడు. ఆ పాత్ర అంత ( Akkineni Akhil Agent movie ) అద్భుతంగా వచ్చిందట. మరి అఖిల్ ప్రేమను సొంతం చేసుకున్నంత అద్భుతంగా మమ్ముట్టి పాత్రని దర్శకుడు తీర్చి దిద్దాడా? లేక ప్రమోషన్ కోసం అఖిల్ చెప్పాడా తెలియాలంటే సినిమా రిలీజ్ తరవాతనే అర్ధమవుతుందని. అలాగే ఈ సినిమా కచ్చితంగా అభిమానులకు ఒక కొత్తదనాన్నీ చూపిస్తుందని.. సినిమా అందరిని ఆకట్టుకుంటుదని అఖిల్ చెప్పాడు..