Home Cinema Dilraju: మామూలోడు కాదుగా దిల్ రాజు.. ఇద్దరు పోయి ముచ్చటగా ముగ్గురు రాబోతున్నారా.?

Dilraju: మామూలోడు కాదుగా దిల్ రాజు.. ఇద్దరు పోయి ముచ్చటగా ముగ్గురు రాబోతున్నారా.?

Dilraju: దిల్ రాజు అసలు పేరు వెలమకుచ వెంకటరమణారెడ్డి.. కానీ ఈయన చేసే వృత్తిరీత్యా ఆయనకు దిల్ రాజు అనే పేరు వచ్చింది. ఎందుకంటే ఈయన నిర్మించిన తొలి చిత్రం దిల్.. ఈ చిత్రంతోనే ఈయనకు దిల్ రాజుగా ముద్రపడింది. ప్రముఖ నిర్మాణ సంస్థ అయినటువంటి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ను స్థాపించి తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించాడు. దిల్ రాజు గారు మన తెలంగాణలో నిజాంబాద్ జిల్లా నర్సింగపల్లి లో పుట్టారు. మదక్ పల్లిలో ఆయన విద్యాభ్యాసం చేసినప్పటికీ చిన్నతనం నుంచే సినిమాలపై ఆసక్తి ఎక్కువ..

dilraju-enjoying-with-three-different-people

అలా ఆ ఆసక్తితోనే తన సోదరునితో హైదరాబాద్ వచ్చి ఆటోమొబైల్ వ్యాపారం చేశాడు. 1990లో పెళ్లి పందిరి అనే చిత్రంలో చలనచిత్ర డిస్ట్రిబ్యూటర్ గా ప్రవేశించాడు. ఆ తరువాత శ్రీ వెంకటేశ్వర ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ను ప్రారంభించాడు. దిల్ రాజు తన మొదటి భార్య అనితను వివాహం చేసుకున్నాడు. వీళ్ళిద్దరికీ హన్సితా రెడ్డి అనే కుమార్తె ఉంది. 2017వ సంవత్సరంలో అనిత గుండెపోటుతో మరణించిన తర్వాత దిల్ రాజు 2020 వ సంవత్సరంలో తేజస్విని అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. జ్యోతిష్యం ప్రకారం ఆమె వివాహం జరిగిన తర్వాత ఆమె పేరును వైఘా రెడ్డిగా మార్చారు.

See also  Sunny Leone: ఆ విషయంలో భర్త చేతిలో దారుణంగా మోసపోయానంటూ తన ఇస్టాగ్రామ్ లో పోస్ట్. క్షణాల్లో వైరల్..

dilraju-enjoying-with-three-different-people

తన కెరియర్ మొదట్లో ఎన్నో కష్టాలు పడి అంచలంచలుగా ఎదుగుతూ ప్రస్తుతం కోట్ల ఆస్తికి పడగెత్తాడు దిల్ రాజు (Dilraju). అందుకే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కష్టానికి మరో మారుపేరు దిల్ రాజు అని చెప్పుకుంటారు. ఇక ఇండస్ట్రీలో ప్రస్తుతమైతే ఏ సినిమా ఎప్పుడు షూట్ స్టార్ట్ అవ్వాలన్న, రిలీజ్ అవ్వాలన్నా, ఒటిటిలోకి ఎప్పుడు విడుదల అవ్వాలన్న, దాన్ని ఎంత రేటుకు ఫిక్స్ చేయాలి అన్ని ఆయన చేతుల్లో ఉంటాయని చెబుతుంటారు. ఇక ఇటీవల కాలంలో ఆయన పెట్టిన ఇన్వెస్ట్మెంట్ డబుల్, త్రిబుల్ కాకుండా పది రెట్లు ఎక్కువ ప్రాఫిట్ తెచ్చుకున్న దిల్ రాజు.. జాతకానికి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే మనందరికీ తెలుసు దిల్ రాజ్ మొదటి భార్య అనారోగ్యంతో మరణించింది.

See also  Manchu Manoj-Mounika: మంచు మనోజ్ భూమా మౌనిక పెళ్లి ఎంత సీక్రెట్ గా అంటే.. పెళ్ళిలో ఊహించని ట్విస్ట్ లు.??

dilraju-enjoying-with-three-different-people

ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో వివాహం చేసుకున్న ఈ జంట కి రెండో బిడ్డ కూడా పుట్టారు. అయితే దిల్ రాజ్ జాతకంలో ఈ ఒక్క బిడ్డ కాకుండా ఏకంగా ముగ్గురు కొడుకులు పుట్టే ఛాన్స్ ఉందని ఆయన జాతకంలో ఉందట.. ఇదే కాక దిల్ రాజు భార్య తర్వాత జన్మనివ్వబోయేది కవల పిల్లలని ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ట్రెండ్ అవుతుంది . ఈ క్రమంలో కొందరు బడుద్దాయిలు దిల్ రాజుకు సంబంధించిన ఈ వార్తని వల్గర్ గా చిత్రీకరిస్తుంటే.. మరి కొంతమంది  జాతకంలో రాసిన దానికి మనమేం చేయలేమంటూ కలిసొచ్చే కాలానికి నడిచే కొడుకులు అంటే ఇదే సామెత అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి కొందరు జాక్పాట్ కొడుతున్నాడు దిల్ రాజు అంటూ నిజంగానే మనసున్న మహారాజు అని ఆయనను తెగ పొగుడుతున్నారు.