Home Cinema Chiranjeevi: ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ మెగస్టార్ చిరంజీవి కోసం షూటింగ్ సెట్ లో కొట్టుకున్నారు..

Chiranjeevi: ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ మెగస్టార్ చిరంజీవి కోసం షూటింగ్ సెట్ లో కొట్టుకున్నారు..

Two Actresses Fight: సినీ పరిశ్రమలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా హీరోగా వచ్చి కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకుని మెగస్టార్ గా ఎదిగి అభిమానుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నాడు చిరంజీవి. సినీ రంగంలో మొదట అడుగు పెట్టిన చిరు ఎన్నో అవమానాల నడుమ వాటంన్నిటినీ దిగమింగుకుని ఆ స్థాయికి ఎదిగాడు. మొదట్లో ఓ సీరియల్లో తన నటనను ప్రారంభించిన చిరు ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, ఐదుగురు హీరోల్లో ఓక హీరోగా, చివరికి విలన్ గా దొరికిన ప్రతి క్యారెక్టర్ చేసుకుంటూ ప్రస్తుతం ఏ స్టేజ్ లో ఉన్నాడు మనందరికీ తెలిసిన విషయం.. దాదాపు 20 సంవత్సరాలు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపాడు చిరంజీవి.

See also  Parineeti Chopra: కుర్రాళ్ళకు పరిణితి చోప్రా క్రేజీ ఆఫర్. నాకు పెళ్ళి చేసుకోవాలనుంది..!! ఎవరైనా చేసుకుంటారా..??

two-actresses-fight-on-shooting-set-for-megastar-chiranjeevi

ఇక చిరు సినీ ఇండస్ట్రీలో రాజ్యమేలుతున్న వేల ఒకప్పటి స్టార్ హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లు మెగస్టార్ చిరంజీవి సినిమాలు విడుదలవుతున్నాయంటే భయపడేవారంట. అంతటి స్థాయికి ప్రతీ మెట్టు ఎక్కుతూ చేరగలిగాడు చిరంజీవి. ఇక ఈయన ఒకప్పటి అందాల తార దివంగత నటి అతిలోక సుందరి శ్రీదేవితోనే కాకుండా ఆ తర్వాత వచ్చిన హీరోయిన్లు రాధా, రాధిక, మాదవి, సుమలత, భానుప్రియ, విజయశాంతి వంటి వారితో నటించాడు. ఇక వీళ్ళే కాకుండా వీరి తర్వాత వచ్చిన జనరేషన్ సౌందర్య, మీన, రమ్యకృష్ణ, నగ్మ, ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే మొదలైన హీరోయిన్లతో కూడా ఆడి పాడి చిందేసాడు.

two-actresses-fight-on-shooting-set-for-megastar-chiranjeevi

కేవలం వీళ్ళతోనే కాకుండా ప్రస్తుతమున్న జనరేషన్ హీరోయిన్లు కాజల్, తమన్నా, శృతి హసన్ వంటి వాళ్ళతో కుర్ర హీరోలకు ఏ మాత్రం తక్కువ కాకుండా పోటీ పడుతూ మరి చిత్రాలలో చిందులేస్తున్నాడు చిరు. ఇక ఈ విషయాలన్నీ పక్కన బెట్టి అసలు మన టాపిక్ విషయానికి వస్తే.. చిరంజీవి గారికి ఆల్ టైం హిట్ ఇచ్చిన చిత్రం ఇంద్ర. ఐతే ఈ చిత్ర సమయంలో ఇద్దరు హీరోయిన్లు షూటింక్ స్పాట్లోనే చిరంజీవి గారి కోసం కొట్టుకున్నారట. బి. గోపాల్ గారి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం చిరంజీవి గారికే గాక ఇండస్ర్టీకి మంచి హిట్ తీసుకువచ్చిందనే చెప్పాలి. మెగస్టార్ జీవితంలో బ్లాక్ బ్లాస్టర్ హిట్ గా నిలిచిపోయింది.

See also  Janhvi Kapoor : అశ్లీల వెబ్సైటు లో అలా దారుణంగా జాన్వీ కపూర్.. ఆందోళనలో జాన్వీ..

two-actresses-fight-on-shooting-set-for-megastar-chiranjeevi

ఇక ఈ చిత్రంలో నటించిన ఇద్దరు హీరోయిన్లు ఒకరు ఆర్తీ అగర్వాల్ అయితే మరొకరు సోనాలి బింద్రే. ఈ చిత్రంలో వీళ్ళు ఇద్దరు చిరంజీవి సరసన హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ చిత్రం షూటింగ్ పనులు మొత్తం అయిపోయాక లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో చిరంజీవికి భార్యగా ఎవరు ఉండాలన్న విషయంలో ఈ ఇద్దరు (Two Actresses Fight) హీరోయిన్లు ఫన్నీగా గొడవపడ్డారు అంట. ఇక వాళ్ళిద్దరూ అలా ఫన్నీగా కేకలు వేసి గొడవ పెడుతున్న సమయంలో దర్శకుడు బి.గోపాల్ గారికి ఈ ఇద్దరికి హీరోయిన్లలో ఎవర్ని పెట్టాలో అర్థం కాక.. ఇక ఈ సినిమా కథను అక్కడితోనే ఆపేసి పులిస్టాప్ పెట్టాడట. అలా షూటింగ్ సమయంలో ఆ ఇద్దరు హీరోయిన్లు సరదాగా గొడవ పడ్డారట.. మరి చిరంజీవి కోసం ఆ మాత్రం గొడవ పడుకుంటే ఎలా..