Home Cinema Allu Arjun: అల్లు అర్జున్ ఇంట్లో తగ్గేదెలే అంటూ అదిరిపోయే వేడుక.. దీనికి వాళ్ళు కూడా...

Allu Arjun: అల్లు అర్జున్ ఇంట్లో తగ్గేదెలే అంటూ అదిరిపోయే వేడుక.. దీనికి వాళ్ళు కూడా వస్తారా?

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా పరంగా ఎంత బిజీగా ఉంటున్నారో మనందరికీ తెలుసు. పాన్ ఇండియా సినిమా పుష్ప హిట్ అయిన తరవాత అల్లు అర్జున్ లో ఎంత గొప్ప నటుడు ఉన్నాడో అందరికీ అర్ధం అయ్యింది. చూపే బంగారమాయెనే సిరివల్లి అనే పాటలో చెప్పు వదులుతూ.. వేసుకుంటూ.. భుజాన్ని ఎత్తి నడుస్తూ వేసిన స్టెప్ కి అల్లు అర్జున్ అభిమానులు మాత్రమే కాదు, సినీ (Allu Arjun big event celebrations started in Allu family ) అభిమానులందరూ ఫిదా అయిపోయారు. ఇటీవల రిలీజ్ అయిన పుష్ప 2 చూస్తే.. ఆ సినిమాపై విపరీతమైన అంచనాలు పెరుగుతున్నాయి. అల్లు అర్జున్ అమ్మవారి వేషంలో ఇంకా అద్భుతంగా ఫిట్ అవ్వడంతో సినిమా అంటే గౌరవం పెరిగింది.

See also  Samantha : వైష్ణవి చైతన్య కు అలాంటి బంపర్ ఆఫర్ ఇచ్చిన సమంత..

allu-arjun-big-event-celebrations-started-in-allu-family

Shaakuntalam Review and Rating : శాకుంతలం సంకనాకిపోవడానికి ఈ బలమైన కారణాల లోపం వాళ్ళిద్దరిదేనా.. రివ్యూ మరియు రేటింగ్..

అల్లు అర్జున్ గురించి సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తుంది. అదేమిటంటే.. అల్లు అర్జున్ ఇంట్లో అల్లు వారు అందరూ కలిసి ఏదో పెద్ద ఫంక్షన్ చేస్తున్నారట. దాని నిమిత్తం వాళ్ళ దగ్గర పని చేసేవాళ్ళందరికి బట్టలు, స్వీట్స్ ఇచ్చారంట. ఇంతకీ అల్లు అర్జున్ ఇంట్లో ఇప్పుడు అల్లు వారు ( Allu Arjun big event celebrations started in Allu family ) అందరు చేసే వేడుక ఏమిటబ్బా అని నెటిజనులు ఆలోచనలో పడ్డారు. ఎవరికైనా పెళ్లా? పెళ్ళైతే ముందుగా అనౌన్స్ చేస్తారుగా? ఇలా ఎవరికి వారు ఆలోచనలో పడ్డారు. అయితే ఈ వార్తలో ఎంత నిజం ఉందొ తెలీదు కానీ, అల్లు అర్జున్ ఇంట్లో వేడుక చెయ్యడానికి ఒక రీజన్ మాత్రం ఉంది.

See also  Varun Tej - Lavanya engagement : వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ల ఎంగేజ్మెంట్ ఫొటోస్ మరియు సందడి చేసిన స్టార్స్..

allu-arjun-big-event-celebrations-started-in-allu-family

పైగా ముఖ్యంగా ఈ వేడుక చేయడంలో అల్లు అరవింద్ చాలా హుషారు చూపుతున్నారని అంటున్నారు. అంటే ఖచ్చితంగా అభిమానులు ఊహిస్తున్నట్టు ఆ వేడుకే అయ్యి ఉంటాది. ఇంతకీ అదేమిటంటే.. అల్లు అర్హ గురించి ఈ వేడుక చేస్తున్నారంట. అల్లు అర్హ మొదటి సారిగా సినిమాలో నటించింది. అది కూడా వాళ్ళ నాన్నకు ధీటుగా పాన్ ఇండియా సినిమాలో నటించింది. ఈరోజు రిలీజ్ అయిన శాకుంతలం సినిమాలో అల్లు అర్హ నటించిన సంగతి మనందరికీ తెలిసినదే. ఈ సినిమా పై టాక్ ఎలా ఉన్నప్పటికీ.. అల్లు అర్హ నటన.. మాట్లాడిన మాటలు అద్భుతంగా ఉన్నాయంటూ ప్రశంసలు అందుకుంటుంది.

See also  Allu Arjun - Sreeleela : అల్లు అర్జున్ తో ఆ డీల్ కి శ్రీలీల ఎంత తీసుకుందో తెలుసా?

allu-arjun-big-event-celebrations-started-in-allu-family

శాకుంతలం సినిమా లో అల్లు అర్హ సింహం పై కూర్చుని అలా వస్తూ ఉంటె.. సినిమాల్లో హాల్లో విజిల్స్ తో వెల్కమ్ చెప్పారు. అల్లు అర్హ మొదటి సినిమా నటించిందనుకు.. ఆ సినిమా రిలీజ్ అయ్యి.. తన మనవరాలికి అంత మంచి పేరు వచ్చినందుకు అల్లు అరవింద్ బంధువులని, బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ని పిలిచి.. మంచి ఫంక్షన్ ప్లాన్ చేస్తున్నురట. ఈ వేడుకలో చిరంజీవి కుటుంబం కూడా ఎంజాయ్ చేయబోతున్నారట. అంతే కాకుండా ఈ వేడుకని శాకుంతలం టీం నుంచి.. గుణశేఖర్, సమంత, దిల్ రాజు కూడా వస్తారేమో అంటున్నారు. అల్లు అర్జున్ ఇంట్లో ఈ వేడుక సంగతి నిజమో కాదో తెలీదు కానీ.. అల్లు అర్జున్ అభిమానులు మాత్రం అల్లు హర్ష తోలి సినిమా ఆనందాన్ని సెలెబ్రేట్ చేసుకుంటున్నారు..