Hero Nikhil: హీరో సిద్ధార్థ నిఖిల్ గురించి మనందరికీ తెలుసు..హ్యాపీడేస్ చిత్రంలో ఉన్న అందరి హీరోలలో ఎవరి యాక్టింగ్ బాగా నచ్చిందంటే టక్కున చెప్పేస్తాం నిఖిల్ గురించి అలా తన నటనతో అందరికీ ఆకర్షితుడయ్యాడు. నిఖిల్ పుట్టింది మన హైదరాబాద్ బేగంపేటలోనే, పక్కా తెలుగు వాడు.. మనోని మాట తీరు చూస్తేనే అర్థమవుతుంది పక్కా మాస్ అని అందుకే నిఖిల్ కి మరో పేరు బేగంపేట్ బాయ్ అని కూడా ఉంది. ఇక హ్యాపీడేస్ చిత్రం తర్వాత అంచలంచలుగా ఎదుగుతూ.. చిన్న చిన్న సినిమాల్లో అవకాశాలు పొందుతూ..
తర్వాత తనదైన స్టైల్ లో స్వామి రారా చిత్రంతో మంచి ఫేం సంపాదించుకొని ఆ తర్వాత కార్తికేయ చిత్రంతో అభిమానులను మూట కట్టుకున్నాడు. ఇక ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రంతో సూపర్ హిట్ సంపాదించుకున్న నిఖిల్ ఆ తర్వాత తిరుగులేకుండా తెలుగు చిత్ర పరిశ్రమలో వెలుగు వెలుగుతూ కార్తికేయ 2 చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు పొందాడు. ఇటీవలే అనుపమ పరమేశ్వర్, నిఖిల్ జంటగా నటించిన 18 పేజెస్ చిత్రం కూడా ఎంతో గుర్తింపు లభించింది. పాన్ ఇండియా లెవెల్ లో పబ్లిసిటీ తెచ్చుకున్న హీరో నిఖిల్ ఇటీవల తన భార్యతో కలిసి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో వాళ్ళ ప్రేమ ఎంతో ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ అని చెప్పుకొచ్చాడు.
తన భార్య పల్లవికి తన ప్రేమ విషయాన్ని ప్రపోజ్ చేయడానికి గోవాలో ప్లాన్ సెటప్ చేశాడంట.. దాంతో వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చెప్పి గోవాలో పెద్ద స్కెచ్ చేశాడంట.. ఒక రోజు సడన్ గా చెప్పా పెట్టకుండా పల్లవిని గోవాకి తీసుకెళ్లడానికి రెడీ అయ్యి.. ఫ్లైట్ దిగేలోపే అక్కడ ఫ్రెండ్స్ ని మొత్తం తన ప్రేమను ప్రపోజ్ చేయడానికి కావలసిన సెటప్ అంతా చేయమని చెప్పాడంట.. మొత్తానికి పల్లవిని గోవా తీసుకెళ్లాడు కానీ.. తీరా అక్కడికి వెళ్లాక గోవాలో భారీ వర్షాలు ఎంతలా అంటే ఎంతో కష్టపడి వాళ్ళ ఫ్రెండ్స్ సెటప్ చేసిన సెటప్ అంతా పోయింది. చివరికి టెంట్ కూడా ఎగిరిపోయిందట.. అయినా సరే నిఖిల్ మాత్రం పల్లవికి ఎలాగైనా ప్రపోజ్ చేయాలని అక్కడే ఉన్న పెద్ద కొండపైకి ఎక్కి మోకాళ్లపై కూర్చుని మరి ప్రపోజ్ చేశారంట..
ఇలా సడన్ గా షాక్ ఇచ్చేసరికి ఈ విషయం తెలియని పల్లవి ముందే చెప్పుంటే మంచి డ్రెస్ ఏసుకొచ్చేదానిగా అని ఫన్నీగా చెప్పిందట.. దాంతో నిఖిల్ కౌంటర్ గా నో ప్రాబ్లం నీకు ప్రపోజ్ చేయాలని ఆత్రుతలో నేను రోడ్డు పక్కన ఉన్న ₹50 రూ చిన్న చెడ్డి వేసుకు వచ్చాను అంటూ ఫన్నీగా చెప్పాడట. ఆరోజు నిఖిల్ ప్రేమని పల్లవి యాక్సెప్ట్ చేయడంతో.. కొన్నాళ్లు వీళ్ళిద్దరూ ప్రేమించుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. కాగా హీరో నిఖిల్ (Hero Nikhil) కరోనా టైం లో చాలా సింపుల్ గా పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం తనదైన స్టైల్ లో కథలు ఎంపిక చేసుకొని నటిస్తూ ప్రజల్లో యమ క్రేజ్ సంపాదిస్తున్నాడు. కార్తికేయ 2 చిత్రంతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందాడు.