Home Cinema Punch Prasad: తీవ్రమైన అనారోగ్యంతో మళ్లీ ఆస్పత్రిలో చేరిన పంచ్ ప్రసాద్.. కన్నీరు మున్నీరవుతున్న భార్య..

Punch Prasad: తీవ్రమైన అనారోగ్యంతో మళ్లీ ఆస్పత్రిలో చేరిన పంచ్ ప్రసాద్.. కన్నీరు మున్నీరవుతున్న భార్య..

Punch Prasad: ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో వచ్చిన తర్వాత ఎంతమంది దానికి ఎడిక్ట్ అయ్యారో అందరికీ తెలుసు.. మల్లెమాల సంస్థ నిర్మించిన ఈ జబర్దస్త్ కార్యక్రమం బంపర్ హిట్ అయిందని చెప్పాలి. ఈ షో ద్వారా ఎందరో కమెడియన్లకు లైఫ్ దొరికింది.. ప్రస్తుతానికైతే చాలామంది ఈ షో నుంచి వేరే షోలోకి వెళ్లి, సినిమాలలో కూడా నటిస్తూ చాలా మంచి జీవితం గడుపుతున్నారు కానీ జబర్దస్త్ షో ద్వారా జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ కూడా ఎంతో మంచి అద్భుతమైన కమెడియన్ గా అందర్నీ నవ్వించే ఈయన ఇటీవలే అనారోగ్య పాలైన సంగతి మనందరికీ తెలిసిన విషయమే..

jabardasth-punch-prasad-health-issue-admitted-in-hospital

గత కొంతకాలంగా జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ కిడ్నీ సంబంధిత సమస్యతో ఎంతో బాధ పడుతున్నాడు. దాంతో పంచ్ ప్రసాద్ అనారోగ్యం ఉన్నడన్న సంగతి తెలుసుకున్న జబర్దస్త్ లోని నాగబాబు అలాగే రోజా వాళ్లు ఉన్నప్పుడే తలా కొంత డబ్బులు వేసి మరి ఆయనకు చికిత్స చేయించారు. మరి అదేవిధంగా ఆ తర్వాత మల్లెమాల సంస్థ కూడా సహాయం చేసిందట.. కిడ్నీ సంబంధిత సమస్య కావడంతో ఆయన రెగ్యులర్ గా క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకుంటూ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ ఆయన ఆరోగ్యం ఏ మాత్రం కుదుటపడడం లేదు. రోజురోజుకీ ఆయన ఆరోగ్యం క్షీనిస్తుందే తప్ప ఆయన ఆరోగ్యం కుదుట పడడమే లేదు పైగా అయన వెంబడి అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి.

See also  Pragathi: ఆ ప్రైవేట్ పార్ట్ పై కామెంట్ చేసిన ఆకతాయిలకు ఇచ్చి పడేసింది గా ప్రగతి..

jabardasth-punch-prasad-health-issue-admitted-in-hospital

ఇదే క్రమంలో మరొక్కసారి ఆయన తీవ్రమైన జ్వరంతో హాస్పిటల్లో జాయిన్ అయినట్లుగా తెలుస్తుంది. ఇదేకాక గొంతు సమస్యతో ఆయన ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారని తన భార్య ఆయన యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలిపింది. పంచ్ ప్రసాద్ భార్య సునీత మాట్లాడుతూ.. మేము ఇప్పుడే హాస్పిటల్ చేరాము. ఆయనకు ముందే థైరాయిడ్ సమస్య ఉందని ఇప్పుడు చాలా తీవ్రంగా మారిందని డాక్టర్లు చెబుతున్నారు. స్కానింగ్ రిపోర్ట్ లో డాక్టర్లు చూశాక సర్జరీ చేయాలని తెలిపారు. కానీ ఆయన కాలికి ఇన్ఫెక్షన్ ఉండడంతో సర్జరీ ఇప్పటంతలో వద్దని చెప్పారు. లెగ్ ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాతే సర్జరీ చేస్తామన్నారు.

See also  Vijay Devarakonda: సమంత మోసగత్తె చేసే పనులన్నీ అలాంటివే అంటూ విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్..

jabardasth-punch-prasad-health-issue-admitted-in-hospital

అంతవరకు ఎక్కడికి వెళ్లకుండా మెడిసిన్స్ తో తగ్గాలని భగవంతుని ప్రార్థిస్తానంటూ ఆమె కన్నీరు మున్నీరు అయ్యి తల్లడిల్లింది. పంచ్ ప్రసాద్ (Punch Prasad) కి చిన్నతనం నుంచే ఇంజక్షన్లు అంటే ఎంతో భయపడేవాడని.. ప్రస్తుతం ఇంజక్షన్లు వేస్తానంటే భయపడుతున్నాడని.. ఫ్లూయిడ్స్ ఎక్కించుకోవడానికి కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నాడని ఆమె చెప్పుకొచ్చింది. ఇప్పటికే ఆయన కుడి చేయి దాదాపు 50 పైగా ఇంజక్షన్లు చేశారని.. డయాలసిస్ నొప్పి తట్టుకోవడం ఆయన వల్ల కావడం లేదని ఆమె మనోవేదనకు గురైంది. ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ పంచ్ ప్రసాద్ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నారు.