Google Pay – PhonePe : ఈరోజుల్లో షాపింగ్ చెయ్యాలన్నా, ఎవరికైనా మనీ పంపాలన్నా చాలా ఈజీ అయిపొయింది. ఆన్లైన్ పేమెంట్ వచ్చాక, డబ్బు లావాదేవీలు చాలా ఈజీగా యిపోతున్నాయి. గూగుల్ పే, ఫోన్ పే లాంటి యాప్ లు ద్వారా డబ్బు చెల్లింపులు చాలా ఈజీ అయ్యాయి. అయితే గూగుల్ పే (Huge Cashback from Google Pay and PhonePe ) చేస్తే..కొంతమంది వినియోగదారుల అకౌంట్ లో 80,000 రూపాయలు వరకు డబ్బు జమ అయ్యిందంట. ఈ విషయం బయటకు రాగానే అందరిలో ఆశ్చర్యం, ఒకింత అసూయ కూడా మొదలయ్యింది. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది ఆన్లైన్ ద్వారానే పేమెంట్స్ చేస్తున్నారు.
అయ్యో మాకు ఎప్పుడూ అంత డబ్బురాలేదే అంటూ బాధపడిపోతున్నాడు. అదృష్టవంతులకే ఇలాంటి యోగం పడతాదంటూ వాపోతున్నారు. అయితే అసలు సంగతి ఏమిటంటే.. గూగుల్ పే యాప్ పని తీరులో చిన్న పొరపాటు వలన అలా అంత డబ్బు అకౌంట్స్ లోకి వెళ్లిపోయిందట. ముఖ్యంగా ( Huge Cashback from Google Pay and PhonePe) “డాగ్‌ఫుడింగ్” అనే ఫీచర్ పరీక్షిస్తున్న సమయంలో ఈ పొరబాటు జరిగిందని అంటున్నారు. కంపెనీ కొత్త ఫీచర్ టెస్టింగ్ సందర్భంగా తమ ఉద్యోగులకు చెల్లించే బదులు అనుకోకుండా నగదును కొంతమంది యూజర్లకు పంపించినట్టు తెలుస్తుంది.
యూజర్లకు ఈ విషయం చెబుతూ.. గూగుల్ మెయిల్ ద్వారా వాళ్ళను కాంటాక్ట్ అయ్యింది. పొరపాటు జరిగిందని.. సాంకేతిక లోపం వలన జరిగిన ఈ లోపానికి క్షమించి, డబ్బు రిటర్న్ చెయ్యమని గూగుల్ పే కోరింది. అంతేకాదు సంబంధిత క్రెడిట్‌ను యూజర్లు వాడేసినా, వేరే ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేసేసినా, తాము రివర్స్ చేయలేకపోతే, ఇక ఆ డబ్బు మీదే.. తదుపరి చర్యలు అవసరం లేదని కూడా గూగుల్ పేర్కొంది. ఈ రకంగా పాపం గూగుల్ పే అడ్డంగా దొరికిపోయింది. కొందరు యూజర్స్ మాత్రం నవ్వుతున్నారు.
ఎప్పుడు చూసిన పేమెంట్ తరవాత వచ్చే స్క్రాచ్ కార్డు చూస్తే చాలా ఆశ కలిగేలా చేస్తారు. తీరా దానిలో ఎక్కువ సార్లు 6 రూపాయలు మించి రాదు. ఇంకా ఎక్కువసార్లు నెక్స్ట్ టైం బెటర్ లక్ అంటాది. కొత్తల్లో ఎక్కువసార్లు కాష్ బ్యాక్ బాగా వచ్చేది. నిమ్మదిగా యూజర్స్ ఎక్కువై అయ్యే కొద్దీ.. నెక్స్ట్ బెటర్ లక్. అవేవో మనం వాడనివి, పనికిరానివి వెతికి అక్కడ మీరు డబ్బు ఖర్చు చేస్తే.. ఈ డిస్కౌంట్ వాడుకోండి అని ఇస్తుంది. ఏది ఏమైనా ఈ వార్త తెలియగానే అందరూ ఒక సారి గూగుల్ పే మరియు ఫోన్ పే ద్వారా వాళ్ళ అకౌంట్ ని చూసుకుంటున్నారు. మాకు కూడా ఏమైనా పడిందా అనే ఆశతో..