Home Cinema విధ్వంసం సృష్టించిన వీరసింహారెడ్డి. బాలయ్య చరిత్రలో అరుదైన రికార్డు.

విధ్వంసం సృష్టించిన వీరసింహారెడ్డి. బాలయ్య చరిత్రలో అరుదైన రికార్డు.

విధ్వంసం సృష్టించిన వీరసింహారెడ్డి. బాలయ్య చరిత్రలో అరుదైన రికార్డు 

గురువారం జనవరి 12న రిలీజ్ అయిన వీరసింహారెడ్డి అన్ని చోట్ల హౌస్ ఫుల్ షోలు నడిచాయి. రికార్డ్ అయిన తొలి రోజే వసూళ్ల ప్రవాహం సాగింది. ఇటు తెలుగు సినీ ప్రేక్షకులు అటు నందమూరి అభిమానులు వీర సింహారెడ్డి రిలీజ్ ని ఓ పండగల ప్రభంజనం సృష్టించారు. అఖండ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో తెలుసు ఆ సినిమా తర్వాత భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన వీరాసింహారెడ్డి పవర్ ఫుల్ డైలాగ్ లతో ప్రేక్షకులను సందడి చేసింది. రిలీజ్ కు ముందే విడుదలైన పోస్టర్లు, ట్రైలర్ లోని డైలాగులు సినిమాను విజయ తీరాల వైపుకు సాగనంపేలా చేశాయి. టాక్ ఎలా ఉన్నా బాలయ్య సినిమా ఓపెనింగ్ మామూలుగా ఉండవు. అదే బాలయ్య బాబు అంటే.

See also  Rashmika: ఆ రెండు సీక్రెట్ టాటోల అర్ధాలు తెలిపిన రష్మిక.. అవి ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా.?

తొలిరోజే 29 కోట్ల షేర్ గ్రాఫ్ సంపాదించింది. బాలయ్య చరిత్రలోనే తొలి రోజు అత్యధిక వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. రెండవ రోజు కూడా భారీ బుకింగ్స్ తో మరొక అంచనాలని కొల్లగొట్టనుండి. ఆర్ ఆర్ ఆర్, సర్కారు వారి పాట ఈ సినిమాల తర్వాత అత్యధిక ఓపెనింగ్ సాధించిన సినిమాగా పేరు ఎక్కింది. ఇలాగే మరో వారం రోజులు కలెక్షన్ల ప్రవాహం సాగిస్తే బ్రేక్ ఈవెంట్ సాధించడం పెద్ద విషయం కాదు సాధించేస్తుంది. కానీ నేడు రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య మరియు వారసుడు ఈ చిత్రాలతో పోటీపడి ఈ పండగలో ఎవరు మరి కలెక్షన్ కింగ్ అయితారో చూడాలి. థియేటర్ల సంఖ్య తగ్గనుంది కనుక కలెక్షన్లు కూడా కొంచెం తారు మారు అయ్యే అవకాశం ఉంటుంది

See also  Sai Dharam Tej: ఆ యంగ్ హీరోయిన్ మెగా ఇంటికి కోడలుగా రానుందా.?? తేజ్ ప్రేమించింది ఆమెనేనా.?

జై బాలయ్య.