Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున హీరోగా, రష్మిక హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ కొట్టిందో మనందరికీ తెలుసు. ఈ సినిమా లో అల్లు అర్జున్ గెటప్ ఫస్ట్ స్టిల్ చూడగానే అందరు జడుసుకున్నారు. ఇంత పెద్ద స్టార్ అయ్యాక ఇలాంటి రిస్క్ ఎందుకు అని కూడా అనుకున్నారు. కానీ సుకుమార్ హీరోని అలా చూపిస్తున్నాడంటే.. ( These are the unexpected changes in Pushpa 2 due to Garikipati ) అందులో ఏదో ప్రాధాన్యత ఉంటాదనే, ఖచ్చితంగా హిట్ అవుతాదనే అల్లు అర్జున్ అభిమానులు మాత్రం గట్టిగా నమ్మారు. వాళ్ళు నమ్మిన ప్రకారమే.. పుష్ప సినిమా తగ్గేదెలే అంటూ సూపర్ హిట్ కొట్టింది.
పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అలాగే రష్మిక కి కూడా బాలీవుడ్ లో మంచి ఆఫర్స్ వచ్చాయి. కాకపోతే అక్కడ అవకాశాలు అయితే వచ్చాయి గాని, పెద్ద హిట్ అవ్వలేదు అనుకోండి. అల్లు అర్జున్ మాత్రం తన గెటప్ తో, తన నటనతో సెన్సేషన్ సృష్టించాడు. అంతా బాగానే ఉంది కానీ, ( These are the unexpected changes in Pushpa 2 due to Garikipati ) నిజానికి చెప్పాలంటే ఈ సినిమాలో కథ దగ్గరకి వస్తే.. పెద్ద చెప్పుకోతగ్గ కథ అయితే లేదు. హీరో స్మగ్లర్లకు సపోర్ట్ చేస్తూ.. అందులో ఎదగడం.. హీరోయిజం చూపించడం తప్ప సినిమాలో అంతకంటే ఎక్కువ ఏమి చూపించలేదు.
సినిమాలో కథ పెద్దగా లేకపోయినా, ట్విస్ట్ లు ఏమి లేకపోయినా, గ్రాఫిక్స్ చూపించకపోయినా పుష్ప మాత్రం అంత హిట్ అయ్యింది అంటే కారణం ఆ సినిమా హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ అనే చెప్పుకోవాలి. సుకుమార్ అల్లు అర్జున్ పోస్టర్ ని మనసు పెట్టె గీస్తే, అల్లు అర్జున్ అందులో తన నటనతో ప్రాణం పోసాడు. అందుకే ఆ సినిమా అంత హిట్ అయ్యింది. పుష్ప సినిమా పై అప్పట్లో గరికపాటి కొన్ని కామెంట్స్ చేశారు. అసలు ఆ సినిమాలో ఏముంది? ఒక స్మగ్లర్ ని హీరోగా చూపించడం ఏమిటి? అని అన్నారు. పుష్ప 2 ట్రైలర్ వచ్చాక.. బన్నీ అభిమానులు గరికపాటి కి సుకుమార్ మంచి సమాధానం ఇచ్చాడు అంటున్నారు.
అదెలా అంటే.. సుకుమార్ పుష్ప 2 ట్రైలర్ లో మనం ఊహించని మార్పులను చేసారు. అవేమిటంటే.. పుష్పలో అల్లు అర్జున్ కేవలం ఒక వ్యక్తి.. డబ్బు కోసం స్మగ్లింగ్ చేసే మనిషి అంతే. ఆ సినిమా పూర్తి అయ్యేటప్పటికి.. పార్ట్ 2 లో పుష్ప ఇంకా పెద్ద మాఫియాకి డాన్ అయ్యి, ఆ విలన్ అంతు చూస్తాడు, దీనితో పాటు పుష్ప పెళ్లి తర్వాత ఫామిలీ లైఫ్ చూపిస్తాడని అనుకున్నారు. స్మగ్లర్ చేసుకునేవాడిని హీరో అనలేదు.. హీరో కాబట్టే, అందరికీ సాయం చేయడం కోసం స్మగ్లర్ అవతారం ఎత్తాడనీ చూపించాడు సుకుమార్. అంతే కాదు, అమ్మవారి వేషం వేసుకుని ఆడవారికి అన్యాయం చేసిన వారిని బాలి వేసేంత గొప్పగా ఆడవారి మీద గౌరవం, బాధ్యత ఉన్న హీరోగా చూపించాడు.