Ravi Teja: మాస్ మహారాజా రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన రావణాసుర సినిమా రేపు ఆడియన్స్ ముందుకి వస్తుంది. ఈ సినిమా థిల్లర్ మూవీ గా చిత్రీకరించబడింది. ఈ సినిమా లో ( Ravi Teja movie Ravanasura business details ) ఒకరు కాదు ఇద్దరు కాదు మొత్తం 5 గురు హీరోయిన్స్ ఉన్నారు. మరి ఒక హీరో అయిదుగురు హీరోయిన్స్ తో దర్శకుడు అన్ని పాత్రలకి ఎలా న్యాయం చేస్తాడో చూడాలి. ఈ సినిమా భారీ అంచనాలతో రిలీజ్ అవుతుంది. అసలే రవితేజ సినిమాలు ఇటీవల మంచి స్పీడ్ గా ఉన్నాయి. ఆ స్పీడ్ లో స్పీడ్ ఇప్పుడు ఈ సినిమా ఇంకా బాగా హైలెట్ అవుతాదని అందరి అంచనా.
అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీమ్ వర్క్స్ బ్యానర్ల పై అభిషేక్ నామా, శ్రీకాంత్ విస్సా నిర్మించిన రావణాసుర సినిమా టైటిల్ కూడా ఆశక్తికరంగానే ఉంది. రాముడు, రావణాసురుడు లో హీరో ఎవరంటే రాముడేనని తెలిసినదే. అలాంటిది ఈ సినిమాకి రావణాసురుడు అని ఎందుకు యాంటీ నేమ్ పెట్టారో చూడాలి. అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందు చాలా బిజినెస్ చేసిపెట్టింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 900 థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా బిజినెస్ ఎలా జరిగిందంటే.. ఆంధ్రాలో రూ.10 కోట్ల, నైజాం లో 7 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో రూ.3 కోట్ల రూపాయలు.
మొత్తం తెలుగు రాష్ట్రాలలో 20 కోట్ల రూపాయలు వరకు బిజినెస్ జరిగింది. అలాగే ఓవర్సీస్ లో 2. 50 కోట్ల రూపాయలకు హక్కులు అమ్మారు. మొత్తం మీద 23 కోట్లు బిజినెస్ జరిగింది. ఇంత వ్యాపారం జరిగింది అంటే.. అంత రేంజ్ లో వసూళ్లు రావాలి. అంటే రేపు రిలీజ్ అవుతున్న రావణాసుర సినిమా ( Ravi Teja movie Ravanasura business details ) హిట్ అనే టాక్ రావాలంటే మొత్తం 23 కోట్ల రూపాయాలు కంటే ఎక్కువ వసూళ్లు తేవాలి. లేదంటే సినిమా కొంచెం బాగానే ఉన్నా కూడా ఫ్లాప్ టాక్ వచ్చే అవకాశం ఉంటాది. బిజినెస్ బాగా జరగటం వలన కొన్ని యావరేజ్ సినిమాలకు ఈ రిస్క్ కూడా ఉంటాది.
అలాగే సినిమా గాని ఏ మాత్రం తేడా వచ్చిన కూడా అంతంత బడ్జెట్ పెట్టి సినిమా రైట్స్ కొనుక్కున్న వాళ్ళందరూ చాలా నష్టపోతారు. ఏదైనా ఒక సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వగానే, ఆ సినిమా హీరో మరియు డైరెక్టర్ రెమ్యునిరేషన్ అమాంతం పెరిగిపోతాది. దాని వలన తరవాత వచ్చే సినిమా బిజినెస్ చాలా భారీగా జరగాల్సిన అవసరం పడతాది. అంత బడ్జెట్ కలెక్ట్ కాలేదో అయిపోతారు. రవితేజ రెండు సినిమాలు సూపర్ హిట్ చేసుకుకోవడంతో, ఈ సినిమా పై భారీ అంచనాలతో ఇంత బిజినెస్ జరిగింది. తన సక్సెస్ తో ప్రొడ్యూసర్స్ కి వ్యాపారం పెంచేంత పని రవి తేజా చేసాడు గాని, తేడా వస్తే పాపం కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏమిటో అని అనుకుంటునన్నారు.