Home Cinema Naresh – Pavitra : మూడో పెళ్ళాం రెండో మొగుడు నుంచి తప్పించుకోవడానికి విజయనిర్మల సొంతూరెల్లి...

Naresh – Pavitra : మూడో పెళ్ళాం రెండో మొగుడు నుంచి తప్పించుకోవడానికి విజయనిర్మల సొంతూరెల్లి చివరికి నరేష్ పవిత్ర ఏం చేసారో చూడండి..

Naresh – Pavitra : సహజీవనం అనేది చాలా సహజంగా జరిగిపోతుంది. ఈరోజుల్లో సామాన్యులలో కూడా ఈ మాటా చాల చోట్ల వింటున్నాము. అలాగే సెలెబ్రెటీస్ దగ్గర మరింత ఎక్కువగా వింటామో, సెలబ్రెటీస్ కాబట్టి ఎక్కువసార్లు వింటామో తెలీదు కానీ, ఇటీవల సినిమా ఇండస్ట్రీలో నరేష్, పవిత్ర సహజీవనం గురించి బాగా వింటున్నాము. ఎక్కడ చూసినా వీళ్ళ ( Naresh and Pavitra did special puja in Vijaya Nirmala hometown ) గురించే వార్తలు. పైగా వీళ్ళ గురించి వార్తలు ఏమి వచ్చినా, వాళ్ళిద్దరికీ కూడా ఇష్టంగానే ఉన్నట్టు ఉంటారు.

naresh-and-pavitra-did-special-puja-in-vijaya-nirmala-hometown

ఎందుకంటే.. వీళ్ళ విషయంలో వార్తని ఎవరు వెతుక్కోవలసిన పని ఉండదు. వాళ్లిద్దరే ఏదో ఒక పని చేసి, వార్తల్లోకి ఎక్కుతారు. అలాంటి ఈ జంట గురించి ఇప్పుడు అనేక వార్తలు వస్తున్నాయి. ఎక్కడికి వెళ్లినా వీళ్ళిద్దరూ కలిసి వెళ్తుంటే.. వీళ్ళ వెనుక జనం ఫాలో అయ్యి, వార్తలు రాసుకుంటున్నారు. అలాగే వీళ్ళు పెళ్లి చేసుకున్నట్టు వీడియో కూడా షేర్ చేసి, దాని గురించి కూడా క్లారిటీ ఇవ్వకుండా కొన్ని రోజులు వార్తల్లో ఉన్నారు. తరవాత అది సినిమా కోసం అని నరేష్ చెప్పడంతో ఆ వార్తలు ఆగాయి.

See also  Mahesh - Ram Charan : మహేష్ మరియు రామ్ చరణ్ పోటీ పడితే గెలుపు ఆ హీరోదేనా?

naresh-and-pavitra-did-special-puja-in-vijaya-nirmala-hometown

అసలు నరేష్ పవిత్రని పెళ్లి చేసుకోవాలంటే.. అతని మూడవ భార్యకి విడాకులు ఇవ్వాలి. నరేష్ అయితే రెడీ గానే ఉన్నారు గాని, ఆమె మాత్రం విడాకులు ఇవ్వకుండా నరేష్ ని అలా లాక్ చేసి పెట్టి ఉంచింది. లీగల్ గా ఆమెకు విడాకులు ఇస్తే తప్ప, నరేష్ పవిత్రను పెళ్లి ( Naresh and Pavitra did special puja in Vijaya Nirmala hometown ) చేసుకోవడం కుదరదు. నరేష్ తనకు రమ్య రఘుపతి నుంచి ప్రాణహాని ఉంది అని కోర్టులో కేసు కూడా ఫైల్ చేయించారు. అలాగే పవిత్ర రెండవ భర్త సుచేంద్ర ప్రసాద్ కూడా పవిత్రపై ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే.

See also  Pranathi NTR: ఇంకోసారి అలా చేస్తే చంపేస్తానంటూ ప్రణతిని హెచ్చరించిన ఎన్టీఆర్.! ఏం జరిగిందంటే..

naresh-and-pavitra-did-special-puja-in-vijaya-nirmala-hometown

ఇంతలో విజయనిర్మల సొంత ఊరు అయిన ఏలూరుపాడు లో నరేష్, పవిత్ర కలిసి పూజలు చేస్తున్నట్టు ఫొటోస్ వచ్చాయి. దీనితో సోషల్ మీడియాలో నరేష్ మూడవభార్య రమ్యరఘుపతి, పవిత్ర రెండవ భర్త సుచేంద్ర ప్రసాద్ నుంచి మాకు విముక్తి కలిగి, మా ప్రేమ జంటకు పెళ్లి జరిగేలా చూడమని వీళ్లిద్దరు విజయనిర్మల ఊరిలో గుడికి వెళ్లి పూజలు చేయిస్తున్నారని నెటిజనులు సెటైర్లు వేస్తున్నారు . నిజానికి బంధువుల ఫంక్షన్ కోసం పవిత్రతో కలిసి ఏలూరుపాడుకు వెళ్లిన నరేష్, పవిత్ర అక్కడి అమ్మవారి ఆలయాన్ని దర్శించారట.