Home Cinema Anasuya: మిమ్మల్ని ఆంటీ అని పిలిస్తే అంతలా కోపం రావడానికి గల కారణం.? నెటీజన్ ప్రశ్నకు...

Anasuya: మిమ్మల్ని ఆంటీ అని పిలిస్తే అంతలా కోపం రావడానికి గల కారణం.? నెటీజన్ ప్రశ్నకు సరైన జవాబు..

Anasuya: మనందరికీ తెలుసు.. అనసూయ భరద్వాజ్ ఒకప్పుడు ఏ స్టేజ్ లో నుండి ప్రస్తుతం ఏ స్థాయికి ఎదిగిందో.. న్యూస్ రీడర్ గా తన జీవితాన్ని మొదలుపెట్టిన అనసూయకు యాంకర్ గా జబర్దస్త్ షోలో అవకాశం వచ్చిన తర్వాత ఆమె జీవితంలో ఓ టర్న్ అనుకోవాలి జబర్దస్త్ ఆఫర్. అలా యాంకర్ గా కొనసాగుతూనే సినిమాల్లో వచ్చిన అవకాశాలను అందుకుంటూ తన యాక్టింగ్ తో అందరినీ ఆకట్టుకుంటూ ప్రస్తుతం చాలా బిజీ బిజీగా మారిపోయింది. అలాంటి అనసూయ జబర్దస్త్ లో నుండి వెళ్లిపోవడానికి కారణం లేకనే పోలేదు.. ఆ మధ్య అనసూయను చాలామంది ఆంటీ అని ట్రోల్ చేస్తూ విపరీతమైన మనోవేదనకు గురి చేశారు. (Anasuya Aunty)

See also  Prabhas: కృష్ణంరాజుకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక మళ్ళీ అలాంటి తప్పు చేస్తున్న ప్రభాస్.?

anasuya-bharadwaj-reaction-about-calling-her-aunty

అతి తక్కువ సమయంలోనే బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయమై ప్రస్తుతం ఓ వెలుగు వెలుగుతున్న అనసూయ గురించి మనకందరికీ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అనసూయ ఎప్పుడు తన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం దిగే ఫోటోషూట్స్ ఖచ్చితంగా తన సోషల్ మీడియాలో పంచుకుంటుంది. అలాగే తన తదుపరి రాబోయే చిత్రాల గురించి, వెళ్తున్న మీటింగ్ ల గురించి ఇలా ప్రతి ఒక్క విషయం గురించి చర్చిస్తూ అభిమానులకు చాలా చేరువుగా ఉంటుంది. ఇదిలా ఉండగా..

anasuya-bharadwaj-reaction-about-calling-her-aunty

ఇటీవలే తన అభిమానుల కోసం ఆస్క్ మీ ఏ క్వశ్చన్ అనే ట్యాగ్ తో తన అభిమానులతో ముచ్చటిచ్చింది. తన అభిమానులు అడిగిన కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలకు బుదులిచ్చింది. అందులో భాగంగా.. ఐతే లాస్ట్ టైం మనందరికీ తెలుసు సోషల్ మీడియాలో అనసూయ ఎంత రచ్చ చేసిందో.. ట్రోలర్స్ అనసూయను ఆంటీ (Anasuya Aunty) అంటూ ఏకంగా ట్రెండింగ్ లోకి తెచ్చారు. దీంతో అనసూయ సోషల్ మీడియా వేదికగా లైవ్ లో స్పందిస్తూ పోలీస్ కేస్ పెడతానంటూ పెద్ద దుమారానికి తెర లేపింది. దీంతో ట్రోలర్స్ విపరీతంగా రెచ్చిపోయి కొన్ని రోజుల వరకు ఆంటీ అనే పదం ట్విట్టర్ లో టాప్ లో ఉండేలా చేసారు. కేస్ పెడతానంటూ హడావిడి చేసన అనసూయ ఆ తర్వాత కొద్ది రోజులకు ఆ వివాధం సద్దుమనగడంతో ఊపిరిపీల్చుకుంది.

See also  Raviteja World cup 2023 : వరల్డ్ కప్ లో రవితేజ కామెంట్రీ లో ఆ పాయింట్స్ వైరల్ అవుతున్నాయి..

anasuya-bharadwaj-reaction-about-calling-her-aunty

ఇదిలా ఉండగా క్వశ్చన్ అవర్ లో ఓ నెటీజన్ అడిగిన ప్రశ్న.. మిమ్మల్మి ఎవరైనా ఆంటీ అంటే మీకు ఎందుకు అంత కోపం వస్తుంది అని అడగ్గా.. అనసూయ బదులిస్తూ.. ఎందుకంటే వాళ్ళు ఆ అర్ధాలు వేరేలా ఉన్నాయి కాబట్టి, ఎనీవే ప్రస్తుతం ఎలాంటి కోపం రావడమే లేదు ఇక అది వాళ్ళ కర్మకే వదిలిపెడుతున్నామంటూ.. ఇక నా జీవితానికి ప్రాధాన్యతనిస్తూ మంచి మంచి పనులు చేసుకుంటూ పోతూ అలాంటి వాళ్ళకు సరైన గుణపాఠం చెబుతానంటూ ఆ నెటీజన్ వేసిన ప్రశ్నకు బదులిచ్చింది అనసూయ. ప్రస్తుతం అనసూయ పుష్ప-2 లో నటిస్తుంది. ఈ చిత్రం తర్వాత వరుస సినిమాల్లో బిజీ బిజీ గా నటించనుంది.