Home Cinema Famous Actor : ప్రముఖ నటుడి మృతి.. అసలు అతన్ని మోసం చేసిన హీరోలు ఎవరు?

Famous Actor : ప్రముఖ నటుడి మృతి.. అసలు అతన్ని మోసం చేసిన హీరోలు ఎవరు?

Famous Actor : సినిమా రంగంలో టైం బాగున్నంత సేపు వాళ్ళ జీవితం చాలా అద్భుతంగా, ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటాది. ఎందుకంటే డబ్బుకి డబ్బు, ఫేమ్ కి ఫేమ్ ఉంటాయి కాబట్టి. కానీ సినిమాలకు దూరం అయ్యాక జనం వాళ్ళని నిమ్మదిగా మరిచిపోతారు. ఏ రంగంలో అయినా అంతే అనుకోండి. కానీ, సినిమా రంగానికి ఒక అదృష్టం ఏమిటంటే.. సినిమాలకు దూరం అయితే వాళ్లు తాత్కాలికంగా కనుమరుగైనా ( Death of famous actor costumes Krishna ) కూడా స్క్రీన్ మీద వాళ్ళు ఎప్పుడు చిరంజీవులుగా ఉంటారు. వాళ్ళు ఇక లేరు అనగానే, వాళ్ళు నటించిన సినిమాలను ఒకసారి సినిమా ఇండస్ట్రీ తో పాటు సినీ అభిమానులు అందరూ నెమరువేసుకుంటారు.

See also  Ravi Teja : చివరికి ఆమె వలన రవితేజ ని భార్య వదిలేస్తానంటే.. అసలు విషయం బయటకొచ్చింది!

death-of-famous-actor-costumes-krishna

ఈ మధ్య కాలంలో వరుసగా సినిమా రంగంలో ప్రముఖుల మరణ వార్తలను వినాల్సిన పరిస్థితి రావడం నిజంగా దురదృష్టకరం. అలాగే ఇప్పుడు సీనియర్ నటుడు కాస్ట్యూమ్స్ కృష్ణ మరణించించారు. ఈ వార్త తెలియగానే సినిమా ఇండస్ట్రీ ఒక్కసారిగా చాలా బాధపడింది.  అనారోగ్య కారణాల వలన చైన్నై లో ఆయన సొంత ఇంట్లో మరణించారు. కాస్ట్యూమ్స్ కృష్ణ ( Death of famous actor costumes Krishna ) సొంత ఊరు విజయనగరం జిల్లా. ఈయన 1954 సంవత్సరంలో అసిస్టెంట్ కాస్ట్యూమర్  గా సినిమా రంగంలో ఎంటర్ అయ్యారు. చాలా కష్టపడే గుణం ఉన్న మనిషి. రోజుకు 18 గంటలు పని చేసిన రోజులు కూడా ఉన్నాయి.

See also  Vijay Deverakonda : విజయ్ దేవరకొండ సినిమా ప్లాప్ అయితే.. ఈ హీరోలు పార్టీ చేసుకుంటారట!

death-of-famous-actor-costumes-krishna

ఈయన పెద్ద పెద్ద స్టార్ హీరోస్ కి ట్రెండ్ ని బట్టి బట్టలు కుట్టేవారు. అందుకే కాస్ట్యూమ్స్ కృష్ణ అనే  పేరుతో ఒక వెలుగు వెలిగారు.. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి పెద్ద పెద్ద హీరోలతో పాటు వాణిశ్రీ, జయసుధ , జయప్రద , శ్రీదేవి లాంటి టాప్ హీరోయిన్స్ కూడా ఈయనే కాస్ట్యూమ్ డిజైనర్ గా చేసేవారు. అతి తక్కువ కాలంలో మంచి పేరు ( Costumes Krishna ) తెచ్చుకుని రామనాయకుడు సంస్థలో పర్మినెంట్ గా పనిచేసారు. కోడి రామకృష్ణ ఇతన్ని నటుడిగా సినిమాల్లో పరిచయం చేశారు. నటుడిగా కూడా చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. భారత్ బంద్ సినిమాలో ఇతని నటన అద్భుతం.

death-of-famous-actor-costumes-krishna

అసలు భరత్ బంద్ సినిమా అప్పట్లో అంత హిట్ అవ్వడంతో ఇతని పాత్ర చాలావరకు ఉంది. ఆ తరవాత అతనికి సినిమాల్లో నటించే అవకాశాలు బాగానే వచ్చాయి. మా ఆయన బంగారం, దేవుళ్ళు, అల్లరి మొగుడు, విలన్, పుట్టింటికి రా చెల్లి వంటి సినిమాలలో వరుసగా దొరికిన అవకాశాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే ఇతను నిర్మాతగా కూడా మారారు. జగపతిబాబు హీరోగా కోడి రామకృష్ణ దర్శకతంలో వచ్చిన పెళ్లి పందిరి సినిమాని ఈయనే ( Costumes Krishna ) నిర్మించారు. ఇకపోతే కొంతమంది హీరోలను నమ్మి, సంతకం చేస్తే సినిమా భవిష్యత్తు కాస్ట్యూమ్స్ కృష  కోల్పోయాడు అనే వార్తలు ఉండేవి. మరి ఎవరు ఇతన్ని మోసం చేసారో తెలియలేదు..

See also  Sri Reddy : అభిరామ్ అహింస కి శ్రీ రెడ్డి రివ్యూ మరియు రేటింగ్?