Home Cinema Ravi Teja: ఎందుకు.? తన తల్లి రవితేజకు ఇష్టం లేదంటున్న పెళ్లి చేసింది.! నిజా నిజాలు..

Ravi Teja: ఎందుకు.? తన తల్లి రవితేజకు ఇష్టం లేదంటున్న పెళ్లి చేసింది.! నిజా నిజాలు..

Ravi Teja Marriage: సినిమా రంగంలోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ప్రస్తుతం స్టార్ హోదాలో ఉన్న మెగాస్టార్ చిరంజీవి పేరు మొదట వినిపిస్తే ఆ తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన మాస్ మహారాజా రవితేజ పేరు వినిపిస్తుంది. నటనను నమ్ముకొని ఎదిగిన రవితేజ మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశాడు. ఆ తర్వాత మంచి మంచి ఆఫర్లు రావడంతో విలన్ గా కూడా చేశాడు. ఇక ఈయన శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన తొలి చిత్రం నీ కోసం తో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత రవితేజ నటించిన ఎన్నో చిత్రాలు బ్లాక్ బాస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అలా వరుస ఆఫర్లతో అప్పటి నుండి ఇప్పటి వరకు వెనుదిరి చూసుకోలేదు.

See also  Pawan - Prabhas: పవన్ మరియు ప్రభాస్ లు ఒకే దానిమీద.. ఎవరు హిట్టో ఫట్టో చెప్పగలరా?

why-ravi-teja-mother-got-him-married-even-he-didnt-wanted-to

ఇటీవలి కాలంలో ఐతే కుర్ర హీరోలకు ధీటుగా యంగ్ హీరోయన్లతో జత కట్టి తన నటనా ప్రతిభను వాళ్ళతో సమానంగా చూపిస్తున్నాడు. వసూళ్ళ విషయంలో భారీ స్థాయిలో రికార్డులు బద్దలు కొడుతున్నాడు. అలా రవి తేజ ఇప్పటి వరకు 60కి పైగా చిత్రాల్లో నటించాడు. ఇక ఇటీవలే రవితేజ నటించిన ధమాకా సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయిందో మనందరికీ తెలిసిన విషయమే.. ఈ చిత్రం సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ అవడమే కాకుండా 100 కోట్ల క్లబ్లో చేరింది. ఇదిలా ఉండగా రవితేజ నటించిన తన తదుపరిచిత్రం రావణాసుర విడుదలకు సిద్ధమయ్యింది. ఎందుకో తెలియదు కానీ అందరి హీరోల కాకుండా రవితేజ తన కుటుంబాన్ని సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంచుతాడు.

See also  Uday Kiran : ఉదయ్ కిరణ్ కి అసలు హీరో ఛాన్స్ రాకూడదని విశ్వప్రయత్నం చేసిన ఆ పెద్ద మనిషి ఎవరో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు..

why-ravi-teja-mother-got-him-married-even-he-didnt-wanted-to

ప్రస్తుతం రవితేజ గురించి తాజాగా వార్త సోషల్ మీడియాలో తెగ తిరుగుతుంది. అదేంటంటే.. రవితేజ ఇష్టం లేకుండానే తన తల్లి ఆయనకు పెళ్లి (Ravi Teja Marriage) చేసిందట.. ఇక తన తల్లి ఎందుకు అలా చేసింది అన్న వివరాల్లోకి వెళితే.. రవితేజ వివాహం చేసుకుంది ఎవరినో కాదు స్వయంగా తన తల్లి రాజ్యలక్ష్మి సోదరుని కూతురు కళ్యాణి. రవితేజ మేమమామ కూతురు.. అయితే సినిమా ప్రపంచంలో రవితేజ ఓ మంచి పొజిషన్ కు వెళ్లాక వేరే హీరోయిన్లను ఎక్కడ ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు అని ముందుగానే భావించిన ఆమె తల్లి రాజ్యలక్ష్మి రవితేజకు అలాంటి ఆలోచనలు ఏమి లేకున్నా.. ముందే తన మేనకోడలు అన్న కూతురుని ఇచ్చి రవితేజకు వివాహం చేసింది.

See also  హీరోలను ప్రేమించి కెరియర్ ను పాడు చేసుకున్న హీరోయిన్లు వీళ్ళే.!

why-ravi-teja-mother-got-him-married-even-he-didnt-wanted-to

ఇంకో విషయం ఏంటంటే.. రవితేజ ఈ పెళ్లి (Ravi Teja Marriage) చేసుకోవడానికి తన తల్లి రాజ్యలక్ష్మి ఎంతో ప్రయత్నించి ఒప్పించిందట.. ఎందుకంటే రవితేజకు ఇప్పుడంతలో పెళ్లి చేసుకోవడం అసలు ఇష్టం లేదంట. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రవితేజకు ఇంకా కొన్ని రోజులు ఆగిన తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నాడట. ఇండస్ట్రీలో ఇంకా ఎత్తుకు ఎదిగిన తర్వాత వివాహం చేసుకుందామనుకున్నాడట. కానీ రవితేజ అమ్మ బలవంతం మీద ఒప్పించి మరి కళ్యాణి తో వివాహం చేసింది. వీరి వివాహం 26 మే 2002వ సంవత్సరంలో జరిగింది. వివాహం తర్వాత కళ్యాణి ఇంటి వద్ద ఉంటూ ఓ ఇల్లాలిగా తన పని చేసుకుంటూ రవితేజ పనుల్లో సహాయపడుతూ ఉంటుందట.