Home Cinema Manchu brothers: మంచు బ్రదర్స్ మధ్య ఇన్ని రోజులు జరిగిన గొడవలన్నీ ఉత్తిత్తివే నట.?? మనందర్నీ...

Manchu brothers: మంచు బ్రదర్స్ మధ్య ఇన్ని రోజులు జరిగిన గొడవలన్నీ ఉత్తిత్తివే నట.?? మనందర్నీ బకరాలు చేశారు.! అసలు విషయం ఇదే..

Manchu brothers: మంచు మనోజ్ పెళ్లి ప్రస్తావన తెరలేపినప్పటినుంచి మంచు కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ముల (Manchu Brothers) మధ్యలో కాకుండా కుటుంబం మొత్తం ఎన్నో గొడవలు అవుతున్నాయని సోషల్ మీడియాలో భారీ ఎత్తున న్యూస్ వైరల్ అయ్యాయి. ఇదే క్రమంలో మంచు మనోజ్ పెళ్లికి అన్న విష్ణు ఒక గెస్ట్ లా ఇలా వచ్చి అలా వెళ్లడం.. ప్రతి ఒక్కరినీ పెద్ద కలకలమే లేపింది. ఇక ఇటీవలే ఈ మధ్యకాలంలో మంచు విష్ణు తమ కుటుంబంలోని అన్ని పనులు చూసుకునే సారధి అనే అతనిని కొట్టడానికి ఇంటికి వెళ్ళినట్లు స్వయంగా మంచు విష్ణు ఓ వీడియో తన సోషల్ మీడియా లో పోస్ట్ చేశాడు..

See also  Oscars Academy - Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ కి ఆ గౌరవం ఎలా వచ్చిందంటే..

all-the-quarrels-between-the-manchu-brothers-for-so-many-days-are-not-true

మంచు మనోజ్ తనే స్వయంగా వీడియో తీస్తూ మా అన్న విష్ణు ఇలాగే ఇంటికి వెళ్లి అందరితో గొడవ పడుతూ అందర్నీ కొడుతూ, బెదిరిస్తూ ఉంటాడని స్వయంగా మంచు విష్ణు తీసిన వీడియో ముఖ పుస్తకంలోని తన ఖాతాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో చాలా వైరల్ అయింది. ఇక ఇదే కాకుండా మంచు మనోజ్ కి ఆ వ్యక్తి సాయం చేయడం వల్లే విష్ణుకు చాలా కోపం రావడంతో అడ్డు వచ్చిన అతనిపై గొడవకు దిగి అతనిని కొట్టేందుకు ప్రయత్నించాడంటూ ఎన్నో రకరకాల వార్తలు సోషల్ మీడియాలో ఇప్పటికీ చెక్కర్లు కొడుతూ తిరుగుతూనే ఉన్నాయి.

See also  Animal Audience Review : అనిమల్ సినిమా పబ్లిక్ ఆడియన్స్ రివ్యూ పాయింట్స్ అదిరాయి..

all-the-quarrels-between-the-manchu-brothers-for-so-many-days-are-not-true

ఇక ఇదే విషయం గురించి అక్క మంచు లక్ష్మి ఇలాంటి చిన్న గొడవలు పెద్దది చేయకండి అని స్పందించింది.. దాంతో విష్ణు మాత్రం మనోజు చిన్నోడు వాడికేం తెలియకుండా అలా పెట్టాడంటూ చెప్పుకొచ్చాడు. ఇక మోహన్ బాబు మంచు మనోజ్ తన ఫేస్బుక్లో పెట్టిన వీడియోను డిలీట్ చేయమని గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు కూడా ఎన్నో రకాల వార్తలు వ్యాపించాయి. ప్రస్తుతం వీటన్నిటికీ సంబంధించి ఒక న్యూస్ చాలా వైరల్ అవుతుంది. అదేంటంటే మంచు కుటుంబం అందరినీ బకరాలు చేసింది. ఆ వీడియోలన్నీ ఫ్రాంక్ వీడియోలు అంట..

See also  Lavanya Tripathi : విజయకచవితి పండుగలో పెళ్లి కాకుండానే నిహారికని బాధపెట్టిన లావణ్య త్రిపాఠి.. నిజమా?

all-the-quarrels-between-the-manchu-brothers-for-so-many-days-are-not-true

వీళ్లు మనందరినీ పిచ్చోళ్ళు చేసి మనతో ప్రాంక్ వీడియోలు చేస్తున్నారు. అవును మీరు విన్నది నిజమే.. త్వరలో వీళ్లు తమ బ్యానర్ లో హౌస్ ఆఫ్ మంచూస్ (Manchu Brothers) అనే రియాల్టీ షోను తెరకెక్కించనున్నారు. ఈ రియాల్టీ షో కోసమే ఇన్నాళ్లు ఈ గొడవలన్నీ సృష్టించారని స్వయంగా మంచు విష్ణు నే తెలిపారు. ఆ ప్రాంక్ వీడియో కూడా ఇందులో భాగమే అంటూ.. మనందరిని ఫూల్స్ చేయడానికి ప్రయత్నించారు. దీంతో చాలామంది నేటిజన్స్ మీరు రియాల్టీ షో చేస్తున్నారా లేక మీ పరువు గంగలో కలిసిందని రియాల్టీ షో అనే పేరుతో నాటకాలు ఆడుతున్నారా అంటూ నిలదీస్తున్నారు