That Woman Is The Reason: సోషల్ మీడియా అయినా గాని మెయిన్ మీడియా అయినా గాని ఏది ఏమైనప్పటికీ వారానికి ఒకసారి ప్రభాస్ పెళ్లి టాపిక్ గురించి రచ్చ జరగాల్సిందే ఈ మీడియాలలో.. ఎందుకంటే ఇటు ప్రభాస్ కే కాకుండా ప్రభాస్ ఇంట్లో వాళ్లకి కాకుండా కోట్ల మంది అభిమానులకి ఆయన పెళ్లంటే ఓ పండగ. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా రెబల్ స్టార్ ప్రభాస్ కొనసాగుతున్నాడు. ఇంటర్వ్యూలో పెళ్లి తప్పకుండా చేసుకుంటా కానీ ఇప్పుడైతే కాదని మనందరికీ హింట్ ఇచ్చాడు. కానీ ఒరిస్సా సినిమాలతో ప్రస్తుతం చాలా బిజీ బిజీగా ఉంటున్న ప్రభాస్ ఇప్పుడైతే పెళ్లి చేసుకునేలా అయితే లేడు దీంతో ప్రభాస్ పెళ్లి వార్తలకు మరోసారి పుల్ స్టాప్ పడట్లే అయ్యింది. ఇక అప్పటినుంచి ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అని చాలామంది అభిమానులు ఆశగానే ఎదురుచూస్తున్నారు.
ఈ వార్తలన్నీ పక్కన పెడితే కాస్త మరొక వార్త ఇంట్రెస్టింగ్ గా మన ముందుకు వచ్చింది. ఇదిలా ఉంటే ప్రభాస్ ఇన్ని రోజులు పెళ్లి చేసుకోకుండా ఉండడానికి కారణం ఆ అమ్మాయిలే అని తెలుస్తుంది. అసలు విషయానికి వస్తే ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు చనిపోయాక వారి ఫ్యామిలీ బాధ్యతలు మొత్తం ప్రభాస్ మీద పడ్డాయి. ఇక కృష్ణంరాజు ముగ్గురు కూతుర్లకి అన్న ప్రభాస్ పెద్దదిక్క.. అయితే ఆ ముగ్గురు చెల్లెల పెళ్లి బాధ్యత ఆయన మీదనే ఉంది.ఆ ముగ్గురు చెల్లెళ్లకు పెళ్లిళ్లు చేయకుండా ప్రభాస్ పెళ్లి చేసుకుంటే చాలామంది విమర్శిస్తారు. ఇక ఆ కారణం వల్లనే తన ముగ్గురు చెల్లెళ్లకు పెళ్లిళ్లు చేశాకే ప్రభాస్ పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యాడట.
అందుకోసమే తన పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నాడట.. ఇక ఈ విష.యంలో శ్యామల దేవి అసలు ఊరుకోవడమే లేదట. ఎందుకంటే ముందు ప్రభాస్ ని పెళ్లి చేసుకోమని చాలా ఒత్తిడి తెస్తుందట. అయినప్పటికీ ప్రభాస్ మాత్రం పెద్దమ్మ శ్యామలాదేవి మాటలు వినడం లేదట. కానీ శ్యామలాదేవి మాత్రం నువ్వు పెళ్లి చేసుకుంటేనే మీ భార్యతో కలిసి జంటగా చెల్లిలా పెళ్లి చేయొచ్చు పెళ్లి కాకుండా ఒంటరిగా కన్యాదానం ఎలా చేస్తావు. (That Woman Is The Reason)
మొదట నువ్వు పెళ్లి చేసుకో అని శ్యామల దేవి ఎంత చెప్పినా వినకుండా ప్రభాస్ పెళ్లి చేసుకోవడం లేదట ముందు చేల్లెల్ల పెళ్లి చేశాకే ఆ తర్వాత నా పెళ్లి గురించి ఆలోచిద్దామని ఆ విషయాన్ని వాయిదా వేస్తూ వస్తున్నాడట.. ఇక ఈ విషయంలో ప్రభాస్ ని అప్పుడప్పుడు ప్రభాస్ తల్లి అలాగే శ్యామలాదేవి ఇద్దరు బ్రతిమాలినప్పటికీ కూడా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడం లేదట. ఇలా చెల్లిల పెళ్లి కోసం ప్రభాస్ తన పెళ్లిని కొన్ని రోజులు వాయిదా వేసుకుంటూ వస్తున్నాడు.