Rajamouli took sensational decision after Oskar Awards: సినిమా రంగాన్ని తనకు నచ్చినట్టు ఎలా కావాలో అలా మలుచుకుంటున్న రాజమౌళి తెలుగువాడు అవ్వడం నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ అదృష్టమనే అనుకోవాలి. ఎప్పటికప్పుడు ఇంతకంటే ఏం చేస్తాడు అని అనిపిస్తున్నంతలోనే అంతకు అంత ఏదో ఒక మిరాకిల్ ని చూపుతున్నాడు రాజమౌళి. ఇండియన్ ఫిలిం చరిత్రలోనే ఫస్ట్ టైం ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చేలా చేసిన రాజమౌళి పేరు ఇప్పుడు ప్రపంచమంతట మారు మ్రోగుతుంది. అసలు ఇద్దరు దేశభక్తుల ఆధారంగా ఎవరైనా సినిమా చేస్తే.. హిస్టరీ లో ఉన్నది చూసి కొంచెం మసాలా కలిపి సినిమా తీస్తారు. కానీ రాజమౌళి వాళ్ళ పేర్లు మాత్రమే వాడి, ఆ టైం ని వాడి.. తనకు నచ్చినట్టు కథను రాసి అందరిని మెప్పించి, ఒప్పించాడంటే మామూలోడు కాదు.
అంతే కాకుండా రణం రౌద్రం రుధిరం అంటూ ఆర్ఆర్ఆర్ అనే పేరుని పెట్టి.. దానికి రామారావు, రాజమౌళి,రామ్ చరణ్ అని అభిమానులకు ఊపు ఇచ్చి సినిమాని ఓ రేంజ్ లో సక్సెస్ చేసుకుని, దేశవ్యాప్తంగా అనేక అవార్డ్స్ ని పొందాడు. అక్కడితో ఆగకుండా, రామారావు, రాజమౌళి, రామ్ చరణ్ ల ఇండైరెక్ట్ పేరు తో ఉన్న ఈ సినిమాలో పాటని ఆస్కార్ అవార్డు వచ్చేలా చేసి ఈ సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకుని వెళ్ళాడు. ఇంకా ఇందులో ఉన్న బ్యూటీ ఏమిటంటే.. పాటలో ఇద్దరి హీరోలను కవర్ చేసాడు. ఇంకా చంద్రబోస్, రాజమౌళి కి అత్యంత గౌరవప్రదమైన వ్యక్తి కీరవాణి అందరూ కవర్ అయ్యేలా చూసుకుని ఆ పాటను అలా తనకు కావలసినట్టు మలుచుకున్నారు.
అందుకే 95 ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్ లిస్టులో ఒరిజినల్ సాంగ్ విభాగంలో భాగంగా ( Rajamouli took sensational decision after Oskar Awards ) నాటునాటు పాట ఆస్కార్ అవార్డును గెలుచుకుంది. ఈ దర్శక మహా ముని, పట్టు వదలని విక్రమార్కుడు ఇంత ఘన విజయం తరవాత ఇంకేమి ట్విస్ట్ ఇవ్వగలడు అని అనుకుంటే మరో సంచలనం సృష్టించబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. రాజమౌళి రేంజ్ ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ కాదు, హాలీవుడ్ రేంజ్ కి వెళ్ళిపోయింది. అలాగని రాజమౌళి హాలీవుడ్ కి వెళ్ళిపోతున్నాడా అనుకుంటే కాదు, తెలుగు సినిమా ఇండస్ట్రీ ని ఆ లెవెల్ కి తీసుకుని వెళ్తున్నాడు. రాజమౌళి తరవాత సినిమా మహేష్ బాబు తో అన్న విషయం మనందరికీ తెలుసు. ఈ సినిమాకి రాజమౌళి 100 కోట్లు రెమ్యునిరేషన్ అడుగుతున్నాడని వార్తలు వస్తున్నాయి.
ఇలాంటి రెమ్యునెరేషన్స్ హాలీవుడ్ డైరెక్టర్స్ మాత్రమే తీసుకుంటారు. ఇంతవరకు భారతీయ సినిమా ఇండస్ట్రీ లో ఏ దర్శకుడు కూడా ఇంత రెమ్యునిరేషన్ తీసుకోలేదు. అందుకే నిజంగానే రాజమౌళి అలాంటి సంచలన నిర్ణయం తీసుకుని ఉంటె.. తెలుగు సినిమా ఇండస్ట్రీ వణికిపోక తప్పదు అని కొందరు అంటుంటే.. ఎందుకు వణికిపోవడం.. ఇప్పటి వరకు ఎవ్వరూ తీసుకోని రెమ్యునిరేషన్ గురించి ఆలోచిస్తే, ఇప్పటివరకు ఎవ్వరూ చెయ్యని మిరకిల్స్ తెలుగు ఇండస్ట్రీ కి తెచ్చాడుగా అని మరొకొందరు అంటున్నారు. ఏది ఏమైనా రాజమౌళి ఒక పట్టు పట్టినా, ఒక నిర్ణయం తీసుకున్నా అది ఆయనతో పాటు ఎందరికో మంచి ఫలితాన్ని ఇస్తాదని ఎందరో నమ్ముతుంటే.. సినిమా ఇండస్ట్రీ ఎందుకు నమ్మదు.