Oscar Special Rajamouli: మొత్తానికి ఇన్ని సంవత్సరాల తర్వాత 130 కోట్ల మంది జనాభా ఎదురు చూస్తున్న ఆస్కార్ అవార్డు మనల్ని వరించింది. భారతీయ చిత్ర పరిశ్రమ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఆస్కార్ అవార్డు కైవసం చేసుకుంది ఆర్ ఆర్ ఆర్ సినిమా.. బాలీవుడ్ సినిమాలను తలదన్నే విధంగా టాలీవుడ్ సినిమాలు అంటే ఏంటో ఇప్పుడు ప్రపంచానికి తెలిసింది. మన టాలీవుడ్ గొప్పతనం రాష్ట్రాలు దాటి ప్రస్తుతం దేశాలు దాటి ప్రపంచ దేశాలకు టాలీవుడ్ సత్తా ఏంటో తెలియపరిచింది దర్శక ధీరుడు రాజమౌళి. ఇన్ని రోజులు ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూసామో ఆ అవార్డే రాజమౌళి సినిమా ఆస్కార్డ్ అవార్డుని దక్కించుకుంది.. ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు గాను ఆస్కార్ అవార్డు లభించింది.
ఇక పాట పాడినటువంటి రాహుల్ సిప్లి గంజ్, కాలభైరవ తో పాటు పాట లిరిక్స్ రాసినటువంటి చంద్రబోస్ అదేవిధంగా పాట ట్యూన్ చేసిన కీరవాని పేర్లు సోషల్ మీడియాలో మాత్రం ఒక రేంజ్ లో మార్మోగిపోతున్నాయి. ఇదే కాకుండా ఏ ఫోన్ కాలర్ ట్యూన్ చూసినప్పటికీ ప్రతి ఒక్కరిది ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటనే కాలర్టోన్ గా సెట్ చేసుకుంటున్నారు. ఇదే విధంగా గతంలో రాజమౌళి చెప్పిన ఒక విషయాన్ని అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఆ న్యూస్ ఏంటంటే.. అభిమానుల కోరిక మేరకు రాజమౌళి గతంలో చెప్పినట్లే ఆర్ ఆర్ ఆర్ సినిమా కనుక ఆస్కార్ అవార్డు విన్ అయితే తప్పకుండా రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ 2 సినిమాను తెరకెక్కిస్తారని అభిమానులకు మాటిచ్చాడు.
ఇక ఇదే కాకుండా రాజమౌళి (Oscar Special Rajamouli) త్వరలోనే ఆర్ ఆర్ ఆర్ 2 పై ప్రత్యేకంగా ఓ ప్రకటన అఫీషియల్ గా ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. కాగా మనకు తెలిసిన విషయమే..ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు కోసం మంచి కథను రెడీ చేశారు. తొందర్లోనే ఈ సినిమా కూడా నిర్మించబోతున్నాడు రాజమౌళి. ఈ సినిమా అయిపోయిన వెంటనే బాహుబలి 3 ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో కూడా ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే తాజా సమాచారం ప్రకారం బాహుబలి 3 సినిమాను ఇప్పట్లో ప్లాన్ చేసే విధంగా అయితే లేదు. బాహుబలి 3 స్థానంలోకి ఆర్ ఆర్ ఆర్ 2 రాబోతున్నట్లు సినీ వర్గాల నుంచి ప్రత్యేక సమాచారం తెలుస్తుంది.
ఇదే విషయంపై కూడా త్వరలోనే రాజమౌళి అఫీషియల్ గా ప్రకటన కూడా చేయనున్నాడు. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా అవార్డు అందుకున్న శుభ సందర్భంగా రాజమౌళి అందరికీ పెద్ద పార్టీ ఇవ్వబోతున్నాడు. ఇదే పార్టీలో ఆర్ ఆర్ ఆర్ 2 గురించి చర్చించి ఆ తర్వాత అందరికి అఫీషియల్ గా ప్రకటన చేయనున్నాడు. ఏది ఏమైనప్పటికీ భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే తెలుగు చిత్ర పరిశ్రమ మొట్టమొదటిసారి అది తెలుగు సినిమాకి ఆస్కార్ అవార్డు సంపాదించి పెట్టడం రాజమౌళికే సాధ్యమైంది. దీంతో ప్రతి ఒక్కరు రాజమౌళిని శభాష్ అంటూ అభినందనలు తెలుపుతున్నారు.