Home Cinema RRR Oscar Award: నాటు నాటు పాటకి ఎలాంటి ఆస్కార్ అవార్డు వచ్చిందో తెలుసా?

RRR Oscar Award: నాటు నాటు పాటకి ఎలాంటి ఆస్కార్ అవార్డు వచ్చిందో తెలుసా?

Details about RRR Oscar Award: తెలుగు సినిమా ఇండస్ట్రీ గర్వంతో పొంగిపోయే రోజు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ ని గౌరవించే రోజు వచ్చింది. ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు ని సంపాదించుకుంది. దీనికి తెలుగు వారందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇంక రాజమౌళి టీమ్ ఆనందానికి అవధులు లేవు. బాహుబలి సినిమాతో రాజమౌళి తెలుగు సినిమా ఇండస్ట్రీ ని భారతీయ సినిమా ఇండస్ట్రీ నుంచి అనేక అవార్డులను సంపాదించి తెలుగు వాడి సత్తాను చాటాడు. అలాగే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాతో యావత్ ప్రపంచానికి తెలుగు సినిమా ఇండస్ట్రీ సత్తాని చూపాడు రాజమౌళి. ఆస్కార్ అవార్డు రిజల్ట్ కోసం గత కొన్ని రోజులగా ఎంతగానో ఎదురు చూసింది తెలుగు సినిమా ఇండస్ట్రీ. మొట్టమొదటి సారిగా తెలుగు సినిమాకి ఆస్కార్ అవార్డు వచ్చిన రోజుని మాత్రం తెలుగు ఇండస్ట్రీ మరువలేదు.

See also  Indraja: దసరా పాటకు డాన్స్ దంచి కొట్టిన ఇంద్రజ.. వామ్మో ఈ వయసులో కూడా మామూలుగా ఇరగదీయ్యలేదుగా

details-about-rrr-oscar-award

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా ( Details about RRR Oscar Award ) గత ఏడాది విడుదలై ఎన్ని రికార్డ్ లు సృష్టించిందో మనందరికీ తెలుసు. నాటునాటు పాటలో ఎన్టీఆర్ రామ్ చరణ్ డాన్స్ ఆ పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ల వాయిస్, ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రాఫర్ మొత్తం అదిరిపోయాయి. అందుకే ఈ పాటుకు అంత క్రేజ్ వచ్చింది. క్రేజ్ అంటే మామూలు క్రేజ్ కాదు, భారతదేశంలో ఎంతో క్రేజ్ సంపాదించడంతో పాటు, ఆస్కార్ అవార్డు కి కూడా సెలెక్ట్ అయ్యి, అవార్డు ని గెలిచింది అంటే ఇది మామూలు విజయం కాదు. ఎందుకంటే ఆస్కార్ అవార్డు అందుకున్న తొలి భారతీయ చిత్రంగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా చరిత్ర సృష్టించింది.

See also  Allu Arjun: ఆహ్వానం అందినప్పటికీ కూడా అల్లు అర్జున్ రాకపోవడానికి కారణం అదేనా..?

details-about-rrr-oscar-award

భారతదేశం మొత్తం ప్రపంచ వ్యాపతంగా గుర్తింపు తెచ్చే ఆస్కార్ అవార్డు కోసం భారతదేశం ఎప్పటినుంచో ఎదురుచూస్తుంది. ఆ కోరికని నాటు నాటు పాట ద్వారా, ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆస్కార్ అవార్డు తెలుగువారు సొంతం చేసుకున్నారు. ఇది నిజంగా మన తెలుగు వారి అందరికీ పండగ లాంటిది. గత 15,20 రోజుల నుండి ఆర్ఆర్ఆర్ టీం మొత్తం ఆస్కార్ అవార్డ్ ప్రమోషన్స్ లో పాల్గొని ఆర్ఆర్ఆర్ టీం ప్రమోషన్స్ చేసారు. వారి శ్రమ ఫలించింది. రాజమౌళి టీమ్ నాయకుడిగా కూడా సక్సెస్ అయ్యాడు. ఈ పాటకి ” బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు ” వచ్చింది. అసలు ఎప్పుడు ఎం జరుగుతాదో, ఎలాంటి సినిమాకి ఎలాంటి రిజల్ట్ వస్తాదో, ఎవరి అంచనాలు ఇష్టాలు ఎలా ఉంటాయో చెప్పలేము.

See also  Ram Charan : రామ్ చరణ్ కూతురి జాతకంలో బయట పడ్డ అద్భుతాలు.. ఆ ఒక్క విషయం చాలా బాధాకరం..

details-about-rrr-oscar-award

బాహుబలి తరవాత వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా చూసి.. దీనికంటే బాహుబలి1, బాహుబలి 2 బాగుంటాదని కొందరు ఆడియన్స్ అనుకున్నారు. కానీ బాహుబలి దేశస్థాయిలో అవార్డ్స్ తెస్తే ఆర్ఆర్ఆర్ ప్రపంచస్థాయిలో మొదటి సరి ఆస్కార్ అవార్డు సాధించి రికార్డు సృష్టించింది. రాజమౌళి నెక్స్ట్ సినిమా ఎలాంటి అవార్డ్స్ తెస్తాడో అంటూ నెటిజనులు మాట్లాడుకుంటున్నారు..