Home Cinema Chiranjeevi: చిరంజీవి జీవితంలో పెద్ద సీక్రెట్ ని బయటపెట్టేసిన ఆ స్టార్ హీరో..

Chiranjeevi: చిరంజీవి జీవితంలో పెద్ద సీక్రెట్ ని బయటపెట్టేసిన ఆ స్టార్ హీరో..

The star hero who revealed the big secret in Chiranjeevi life: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తరవాత అంత పెద్ద స్టార్, ఇప్పటి వారికి పెద్దగా నిలిచిన వ్యక్తి చిరంజీవి. కానీ ఆయన ఎప్పుడూ కూడా నేను పెద్ద స్టార్ ని అనే అహం గాని, ఇప్పటి కుర్ర హీరోలపై తన పెద్దరికం చూపించాలనే స్వభావం గాని ఏమి కనబడవు. సినిమా ఇండస్ట్రీ లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తన స్వయం కృషితో పైకి రావడమే కాకుండా మెగా హీరోలను తెలుగు సినిమా ఇండస్ట్రీ కి ఇచ్చారు. నిజానికి చెప్పాలంటే మెగా హీరోలు అందరూ చిరంజీవికి ఎంతో రుణపడి ఉండాలి. ఆయన కష్టపడి వేసిన రోడ్ మీద వీళ్ళందరూ ఇప్పుడు చాలా హాయిగా నడుస్తున్నారు. అసలు నా కుటుంబం నుంచి ఇంతమంది హీరోలు ఉన్నారు అనే అహం కూడా ఎప్పుడూ చిరంజీవి చూపించడు.

See also  Raj-Koti : రాజ్ - కోటీ విడిపోవడం వెనుక ఉన్న దుష్టశక్తి గురించి వెలుగులోకి..

the-star-hero-who-revealed-the-big-secret-in-chiranjeevi-life

చిరంజీవి సినిమాలకు కొంతకాలం దూరం అయ్యి పాలిటిక్స్ లోకి వెళ్లారు. కానీ అక్కడ ఆయన అంతగా రాణించలేకపోయారు. అయినా ఆయన ఏ మాత్రం ఫీల్ అయిపోకుండా, ఇంక మళ్ళి రిటర్న్ సినిమాలు ఏమి నటిస్తామని అనుకోకుండా, మళ్ళి సినిమాల్లోకి ఎంటర్ అయ్యి, వరుసగా ఈ జనరేషన్ కి పోటీగా, ధీటుగా నిలుస్తున్నారు.చిరంజీవి రామ్ చరణ్ తో కొన్ని స్క్రీన్స్ పంచుకున్నారు. వాటిలో గమనిస్తే, రామ్ చరణ్ తో చిరంజీవి స్క్రీన్ పంచుకున్నప్పుడు ఆయనలో పుత్రోత్సాహం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. రామ్ చరణ్ కి తన తండ్రి తో నటించేటప్పుడు వాళ్ళ నాన్నకి తగ్గ కొడుకుని అని నిపించుకోవాలన్నట్టు ఉంటాడు. చిరంజీవి మాత్రం రామ్ చరణ్ ఎలా చేసినా మురిసిపోతూ ఉంటారు. పుత్రోత్సాహం అంటే అదేనేమో మరి.

See also  ఇదా అసలు కథ అందుకే మీనా - రమ్యకృష్ణ లకు మాటలు లేవా.? గట్టిదేగా యవ్వారం..

the-star-hero-who-revealed-the-big-secret-in-chiranjeevi-life

ఆర్ఆర్ఆర్ సినిమా లో నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్ కి సెలెక్ట్ అయిన విషయం మనందరికీ తెలిసినదే. ఆ వేడుక చూడటానికి రాంచరణ్ అమెరికా వెళ్లారు. ఈ సందర్బంగా రామ్ చరణ్ ని మీడియా వాళ్ళు ఇంటర్వ్యూ చేసారు. వారితో రామ్ చరణ్ మాట్లాడుతూ.. చిరంజీవి ( The star hero who revealed the big secret in Chiranjeevi life ) గురించి కొన్ని ఆశక్తికరమైన మాటలు చెప్పాడు. చిరంజీవి ఎంత మెగా స్టార్ అయినప్పటికీ ఆయన నీడలో మేము పెరగకూడదని, మా అంతట మాకు గుర్తింపు రావాలని మమ్మల్ని ఆ దిశగా చాలా సాదాసీదాగా పెంచారని చెప్పాడు. ఆఖ‌రికి తన స్టార్డం మాపై ప్రభావం చూపకూడదని తనకు వచ్చినటువంటి అవార్డులను, ప్రశంసా పత్రాలను కూడా ఇంట్లో పెట్టేవారు కాదు. వాటన్నింటిని తన ఆఫీసులో పెట్టుకున్నారు. అవి చూసి మేము ప్రౌడ్ అయిపోయి ఎక్కడ పాడయ్యి, ప్రయోజకులం కాకుండా పోతామో అని ఆయన భయం.

See also  Rangabali Review and Rating : ఈ సినిమాకి వెళ్లాలంటే అందుకే వెళ్లాలా?

the-star-hero-who-revealed-the-big-secret-in-chiranjeevi-life

అంత జాగ్రత్తగా మా నాన్న మమ్మల్ని పెంచబట్టే మేము ఈరోజు ఇలా ఉన్నామని రామ్ చరణ్ చెప్పాడు. అయితే చిరంజీవికి వచ్చిన ఒక్క అవార్డు ని కూడా ఆయన ఇంటికి తీసుకుని వెళ్లకుండా, ఆయన ఇంట్లో పెట్టలేదు అనే సీక్రెట్ ఇంతకాలం ఆయన అభిమానులు ఎవ్వరికీ తెలియని సీక్రెట్ ని రామ్ చరణ్ బయట పెట్టాడు.