Posani says about Jr.NTR and Chandrababu: సినిమాల్లో ఉన్నవారు రాజకీయాల్లోకి వెళ్లడం, రాజకీయాల్లోకి సినిమా వాళ్ళను లాక్కుని రావడం ఇవన్నీ ఎప్పటి నుంచో సహజంగా జరుగుతున్న అనుభవాలే. ఎందుకంటే.. సినిమా రంగంలో ప్రజలకు తొందరగా దగ్గర కావచ్చు, ప్రజలకు దగ్గరగా అవ్వడం వలన సినిమా నటుల వలన రాజకీయ నాయకులకు ఓటింగ్ పెర్సెంటేజ్ పెరుగుతాది. అందుకే వీళ్ళిద్దరూ ఒకొరికి ఒకరు ఎప్పుడు లింక్ అయ్యి ఉంటారు. అయితే సీనియర్ ఎన్టీఆర్ నటుగా ఎలాంటి అద్భుతాలను సృష్టించారో అలానే ఒక రాజకీయ నాయకుడిగా కూడా ప్రజలకు అనునయంగా పరిపాలించారు. అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ నందమూరి వారసులలో ఎన్టీఆర్ తరవాత అంత ఫెమ్ ఉన్న యంగ్ హీరో. బాలకృష్ణకు కూడా బాగా ఫాలోయింగ్ ఉంది కానీ, ఎన్టీఆర్ కి ఎక్కువ ఫ్యూచర్ ఉందని అనుకుంటున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ కి టాలీవుడ్ లో చాలా మంచి క్రేజ్ ఉంది. దాదాపుగా నందమూరి అభిమానులు అందరు జూనియర్ ఎన్టీఆర్ ని ఇష్టపడతారు. ఎన్టీఆర్ క్రేజ్ కేవలం తెలుగు రాష్ట్రాలకే, నేషనల్ గానే కాదు, గ్లోబల్ వైస్ కూడా ఇమేజ్ పెరుగుతుంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ క్రేజ్ అక్కడి వరకు వెళ్ళింది. ఇక సినిమా రంగంలో ఎన్టీఆర్ కి తిరుగులేదు. కానీ పొలిటికల్ గా అతని లైఫ్ ఎప్పుడు మొదలు అవుతాదో ఎలా ఉంటాదో తెలీదు. ఎన్టీఆర్ ఫాన్స్ ఎప్పుడు రాజకీయాల్లోకి వాళ్ళ హీరో వస్తాడని ఎదురుచూస్తున్న, ఎన్టీఆర్ మాత్రం ప్రెజెంట్ తన ఫోకస్ అంత సినిమాలపైనే అంటున్నారు. ఇలా ఉండగా ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి జూనియర్ ఎన్టీఆర్ పై కొన్ని ఆశక్తికరమైన విషయాలు చెప్పారు. అది ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది.
పోసాని మాట్లాడుతూ.. జూనియర్ ఎన్టీఆర్ ( Posani says about Jr.NTR and Chandrababu ) సినిమా రంగంలో అడుగుపెట్టినప్పుడు అతన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. ఎలాంటి సపోర్ట్ ఇవ్వలేదు, కానీ అతను సక్సెస్ అయిన తరవాత చంద్రబాబు నాయుడు అతన్ని ఎలా వాడుకోవాలా అని చూడటం మొదలు పెట్టాడు. అలాగే సీనియర్ ఎన్టీఆర్ అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆయన భార్య బసవతారకం మరణించారు. ఆ సమయంలోనే ఎన్టీఆర్ కి అండగా ఉండేందుకు లక్ష్మీపార్వతి ఆయనను వివాహం చేసుకుంది. అలాంటి మహిళను పట్టుకొని చంద్రబాబు, టిడిపి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు. అదే లక్ష్మీపార్వతిని తిట్టే వాళ్ళకి హరికృష్ణ రెండో భార్య, జూనియర్ ఎన్టీఆర్ తల్లి శాలినిని తిట్టే ధైర్యం లేదు. ఎందుకంటే అలా చేస్తే జూనియర్ ఎన్టీఆర్ ఊరుకోరు కాబట్టి అని అన్నారు.
అప్పట్లో లక్ష్మీపార్వతని వంకపెట్టుకుని ఎన్టీఆర్ ని వాళ్ళ కుటుంబ సభ్యులతోనే నానా హింస పెట్టించి, ఆయన్ని మానసికంగా చంపించాడు చంద్రబాబునాయుడు. కానీ రాజకీయాల్లో మాత్రం ఎన్టీఆర్ అసలైన వారసులను ఎదగనివ్వలేదు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ ని కూడా చాల కాలం దూరం పెట్టి, అతను సక్సెస్ అవ్వగానే అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ పదవిని లాక్కున్నట్టు, ఇప్పుడు ఈ జూనియర్ ఎన్టీఆర్ ని ఎలా వాడుకుని వదలాలి అని స్కెచ్ వేస్తున్నట్టున్నాడు అంటూ నందదమూరి అభిమానులు వాపోతున్నారు..