Why Rajamouli will enter in Politics: దర్శకుడిగా తిరుగులేని స్థానంలోకి వెళ్ళిపోయాడు రాజమౌళి. దేశవ్యాప్తంగా సినిమా ఇండస్ట్రీ లో అందుకోవాల్సిన అవార్డులు అన్ని ఈ ఈయన సినిమాలు అందుకున్నాయి. బాహుబలితో అవార్డులు కాకుండా ప్రపంచం మొత్తానికి పరిచయం అయ్యాడు. అందుకే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆస్కర్ అవార్డు ఎలా సాధించాలా అని రాజమౌళి ట్రై చేస్తున్నారు. తన శ్రమకు తగ్గ ఫలితం వచ్చేవరకు వదిలిపెట్టని విక్రమార్కుడు రాజమౌళి. రాజమౌళి చేసే సినిమాలపై ఇప్పటికే భారీ స్థాయి అంచనాలు, పెట్టుబడులు పెరిగిపోతున్నాయి, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాకి గాని ఆస్కార్ అవార్డు వచ్చిందా రాజమౌళి ఆయన సినిమాలు ఎంత రేంజ్ లో ఉంటాయో, ఎలాంటి నిర్మాతలను తీసుకురావాలో కూడా అర్ధం కావడం లేదు.
అయితే రాజమౌళి ఎంత రేంజ్ కి వెళ్లినా ఆయనకి నటులతో బాధ లేదు. ఎందుకంటే ఒకవేళ హీరోలు ఖాళీలేకపోయినా, ఆయన సెలెక్ట్ చేసుకున్నవాళ్ళు లేకపోయినా, ఆయన వెంటనే ఏ చీమనో దోమనో కూడా పెట్టి సినిమా ఆయన తియ్యగలడు, ఆడియన్స్ చూడగలరు. చూసి వాళ్ళతో శభాష్ అని అనిపించుకోగలిగే దర్శకుడు రాజమోళి. అయితే ఈయన సినిమాకి బాగా స్ట్రాంగ్ గా కావాల్సింది, స్టార్స్ కాదు కానీ, నిర్మాతలు గట్టిగా కావాలి. ఏ ఒక్క నిర్మాతో ఈయన్ని ఇప్పుడు భరించాలంటే చాలా కష్టం. ఇద్దరు ముగ్గురు కలిసి ఈయన సినిమాని భరించాలి. అయితే ఇంత ఫేమ్, గుడ్ విల్ ఉన్న రాజమౌళిని రాజకీయాల్లోకి వెళ్తే ఎలా ఉంటాది అనేది ఊహించుకోవాల్సిన అవసరం లేకుండా ఆయనే వెళ్తున్నారు.
సినిమాలతో అంత బిజీగా ఉండే రాజమౌళి ( Why Rajamouli will enter in Politics )రాజకీయాల్లోకి వెళ్లడం ఏమిటని జనం షాక్ తిన్నారు. అసలు సంగతి ఏమిటంటే.. రాజకీయాలలో ఓట్ల శాతం పెంచుకునేందుకు రాజమౌళిని వాడుకుందామని మన తెలుగు ప్రభుత్వాలు కాదు గాని, కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఓట్ల శాతం పెరిగేలా ఓటర్లను చైతన్య పరచడానికి రాజమౌళి సేవలను వినియోగించుకోవాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించుకుంది. ప్రచారకర్తగా రాజమౌళి పేరును ఎన్నికల కమిషన్ కి కలెక్టర్ చంద్రశేఖర్ నాయక్ సిఫార్సు చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా ఓటు హక్కు వినియోగం పై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని దానికి రాజమౌళి అయితే సరైన వ్యక్తి అని చంద్రశేఖర్ నాయక్ ఆలోచించారు.
రాయచూరు జిల్లా మాన్వి తాలూకా అమరేశ్వర క్యాంపు లోని రాజమౌళి జన్మించారు. ఈ నేపథ్యంలోని జిల్లాలో ఆయనతో ప్రచారం చేయిస్తే పోలింగ్ శాతం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారట. ఈ ప్రచారానికి రాజమౌళి కూడా ఒప్పుకున్నారంట. ఏది ఏమైనా రాజమౌళి ప్రచారానికి ఒప్పుకున్నారంటే, రాజమౌళికి కూడా రాజకీయాలోకి వెళ్లాలని కోరిక ఉందేమో అని అనుకుంటున్నారు. అక్కడ ఓన్లీ ట్రైలర్ తరవాత తప్పకుండా రాజకీయాల్లోకి వెళ్తారు అని అందరూ అనుకుంటున్నారు.